నటి సంజన అరెస్ట్‌ | Actress Sanjana Galrani Arrested In Drugs Case | Sakshi
Sakshi News home page

నటి సంజన అరెస్ట్‌

Sep 9 2020 4:05 AM | Updated on Sep 9 2020 4:05 AM

Actress Sanjana Galrani Arrested In Drugs Case - Sakshi

యశవంతపుర: కర్ణాటక సినీరంగాన్ని డ్రగ్స్‌ భూతం కుదిపేస్తోంది. డ్రగ్స్‌ రవాణా ఆరోపణలపై తాజాగా బహుభాషా నటి సంజనా గల్రానిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె ఉంటున్న బెంగళూరులోని ఇందిరానగర రోడ్డు సాయితేజ్‌ అపార్ట్‌మెంట్‌పై మంగళవారం తెల్లవారుజామున దాడి చేసి అరెస్ట్‌ చేశారు. ఆమె నివాసంలో ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్, పెన్‌డ్రైవ్‌తో పాటు అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ కేసులో సంజనా సన్నిహితులు రాహుల్, పృథ్వీశెట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను అరెస్టు చేశారు. డ్రగ్స్‌ వ్యవహారంలో గత శుక్రవారం ప్రముఖ నటి రాగిణి ద్వివేదిని అరెస్టు చేసి విచారిస్తుండడం తెలిసిందే. అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు నటి సంజనా.. నోటీసు లేకుండా ఎలా వస్తారని ప్రశ్నించడంతో పోలీసులు ఆగ్రహించారు. నీవు చెప్పినట్లు మేం నడుచుకోలేం అని స్పష్టంచేశారు. కోర్టు వారంట్‌ను చూపించి అరెస్టు చేశారు. కాగా, ఓ ఎమ్మెల్యే తనయుడు, ఓ వర్ధమాన నటి, ఇద్దరు సీరియల్‌ నటుల పేర్లు బయటపడినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement