చెన్నై: తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్ సెంగారై గ్రామానికి చెందిన మణిమేఘలై(24)కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా నాగలాపురం సమీపంలోని కారణి ప్రాంతానికి చెందిన రాజేష్ తో వివాహం జరిగింది. రాజేష్ చెన్నైలోని ఎయిర్‌పోర్టు వద్ద ట్రావెల్స్ సరీ్వసును నిర్వహిస్తున్నాడు. మణిమేఘలై–రాజేష్ దంపతులకు ముగ్గురు పిల్లలు వున్నారు. కాగా మణిమేఘలైకు అదే ప్రాంతానికి చెందిన దుర్గాప్రసా«ద్‌కు మధ్య అక్రమ సంబంధం వున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో భర్తతో రాజేష్ తో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఇరువురు విడిపోయి, సెంగారై ప్రాంతంలో మణిమేఘలై నివాసం వుంటూ తేరువాయి కండ్రిగ సిప్‌కాట్‌లోని పరిశ్రమలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది.
ఇదిలా వుండగా మణిమేఘలై గత కొద్ది రోజుల నుంచి దుర్గాప్రసాద్‌తో మాట్లాడడం మానేసింది. దీంతో మణిమేఘలై పని చేస్తున్న పరిశ్రమ వద్దకు వెళ్లి దుర్గాప్రసాధ్ అక్కడ ఆమె ప్రవర్తన గుర్తించి ఆరా తీశారు. మణిమేఘలైకు అదే పరిశ్రమలో పని చేసే సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న మరో వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు తెలియడంతో.. ఆదివారం మణిమేఘలైతో మాట్లాడాలని పిలిపించి పెనాలూరుపేట అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఆగ్రహంతో దుర్గాప్రసాద్ మణిమేఘలైను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.


