ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సుల మధ్య ఇరుక్కున్న కార్లు | Buses, Car Collide In Mumbai | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సుల మధ్య ఇరుక్కున్న కార్లు

Nov 10 2026 3:00 AM | Updated on Nov 10 2026 3:00 AM

Buses, Car Collide In Mumbai

ముంబై: మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కార్లను వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో రెండు కార్లు బస్సుల మధ్య ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయ్యాయి. ఈ  ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.

ముంబైలోని భక్తి పార్క్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ముందుగా అక్కడ ఒక బెస్ట్ బస్సు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉంది. ఆ బస్సు వెనుక రెండు కార్లు నిలిపివున్నాయి. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ప్రైవేట్ బస్సు దూసుకొచ్చింది. ముందున్న కార్లను ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత కారణంగా ముందున్న కారు అమాంతం ముందుకు దూసుకెళ్లి ముందున్న బెస్ట్ బస్సు వెనుక భాగం కిందకి పూర్తిగా ఇరుక్కుపోయింది.

ఈ ప్రమాద తీవ్రతతో కార్ల ముందు, వెనుక భాగాలు ఎగిరిపోయి నుజ్జునుజ్జయ్యాయి. రెండు వాహనాల్లోని ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. ఆహాకారాలు చేస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్ల సహాయంతో నుజ్జునుజ్జయిన కార్లను, బస్సులను పక్కకు తొలగించి, అందులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీశారు.

ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల్ని సాయన్ ఆసుపత్రికి  తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. గాయపడిన ఐదుగురిలో  ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమేనా లేక బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కొంతసేపు తీవ్ర ట్రాఫిక్ నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement