నిందితులు అనిత, మధుసూదన్, హతుడు ఉపేంద్ర (ఫైల్)
కర్ణాటక: ప్రియునితో జల్సాలకు భర్త అడ్డుగా ఉన్నాడని అతన్ని కాటికి పంపిన మహిళ ఉదంతమిది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... ఎల్రక్టానిక్ సిటీ ఠాణా పరిధిలోని దొడ్డతోగూరులో అనిత (35), ఉపేంద్ర (40) దంపతులు నివసిస్తున్నారు. అక్టోబరు 10న తెల్లవారుజామున ఉపేంద్ర ఇంట్లో చనిపోయాడు. గుండెపోటుతో పోయాడంటూ అనిత బోరున ఏడ్చింది. తరువాత అంత్యక్రియలు జరిపించారు.
మృతుని సోదరుడు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించగా గొంతు నులిమి చంపారని తేలింది. దీంతో అనిత, ప్రియున్ని అదుపులోకి తీసుకుని విచారించగా అంతా వివరించింది. స్థానికుడు మధుసూధన్ (45)తో చాలా ఏళ్లుగా అక్రమ సంబంధం ఉందని, భర్త తరచూ గొడవ పడేవాడు. భర్త నిద్రపోయాక ప్రియుడు మధుసూధన్కి ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. ఇద్దరూ కలిసి ఉపేంద్రను గొంతు పిసికి చంపారు, ప్రియుడు వెళ్లిపోయాక అనిత డ్రామా ప్రారంభించింది. చివరకు గుట్టు రట్టయింది.


