ధారాశివ్: మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యెద్షి ప్రాంతంలోని ఓ ఇంట్లో మంటలు అంటుకుని కుటుంబంలోని ఆరుగురు సజీవదహనమయ్యారు. స్థానిక కరాండే కుటుంబం తన నివాసంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్లాస్టిక్ వస్తువులు, ఆయిల్ దుకాణం నిర్వహిస్తోంది.
ఫస్ట్‌ఫ్లోర్‌లో వారు నివాసం ఉంటారు. ఆదివారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా గ్రౌండ్‌ఫ్లోర్‌లో మొదలైన మంటలు ఫస్ట్‌ఫ్లోర్‌కు వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో వారంతా నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా మంటలు చుట్టుముట్టి, వారంతా ఊపిరాడక మృత్యువాతపడ్డారు. ప్రమిదలో వెలిగించి ఉంచిన దివ్వె వల్లే మంటలు వ్యాపించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.


