హీరోయిన్‌ సంజనకు సీమంతం చేసిన స్నేహితులు | Bujjigadu Heroine Sanjana Galrani Seemantham Photos Viral | Sakshi
Sakshi News home page

Sanjana Galrani : సౌత్‌ ఇండియన్‌ స్టైల్‌లో హీరోయిన్‌ సంజనా సీమంతం

Apr 25 2022 6:59 PM | Updated on Apr 25 2022 9:14 PM

Bujjigadu Heroine Sanjana Galrani Seemantham Photos Viral - Sakshi

బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్‌ సంజనా గల్రానీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినిమాలు సహా పలు విషయాలను ఆమె అభిమానులతో షేర్‌ చేస్తుంటుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న సంజన త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో సౌత్‌ ఇండియన్‌ స్టైల్‌లో సీమంతం జరుపుకుంది. 


చదవండి: బన్నీకి ఫేవరెట్‌ అదే.. సీక్రెట్‌ రివీల్‌ చేసిన స్నేహారెడ్డి

దీనికి సంబంధించిన ఫోటోలను సంజన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసుకుంది.  'కొన్నిసార్లు కుటుంబం కంటే కొంతమంది స్నేహితులే నయమనిస్తుంది. ఎంతో ప్రేమగా నా సౌత్‌ ఇండియన్‌ ఫ్రెండ్స్‌ నా సీమంతం చేశారు. 9వ నెలలోకి ప్రేవేశిస్తున్నా. ఇంకో నెల రోజుల్లో నా బిడ్డను చూస్తాను. నాపై ఇంత ప్రేమను కురిపిస్తున్నందుకు ధన్యవాదాలు' అంటూ పేర్కొంది.

కాగా శాండల్‌ వుడ్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఈ బ్యూటీ మూడు నెలలు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే.  బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తన చిరకాల మిత్రుడు, ప్రియుడు డాక్టర్‌ పాషాను 2021 జనవరిలో రహస్య వివాహం చేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement