Sanjjanaa Galrani Shares Her Baby Shower Photos & Videos - Sakshi
Sakshi News home page

Sanjjanaa Galrani: గ్రాండ్‌గా హీరోయిన్‌ సంజన సీమంతం, వీడియో వైరల్‌

May 11 2022 5:00 PM | Updated on May 11 2022 5:52 PM

Sanjjanaa Galrani Shares Her Baby Shower Photos, Videos - Sakshi

ఈ ఫంక్షన్‌లోని మెనూలో మటన్‌ బిర్యానీ హైలైట్‌ అని చెప్పింది. ఈ వేడుకకు హాజరై తనను, పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపింది.

హీరోయిన్‌ సంజనా గల్రానీ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే! బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరోయిన్‌ గత నెలలో హిందూ సాంప్రదాయం ప్రకారంలో సీమంతం జరుపుకుంది. అతి కొద్ది మంది స్నేహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. తాజాగా అందరి సమక్షంలో మరోసారి గ్రాండ్‌గా సీమంతం చేసుకుంది సంజనా. ఈసారి ముస్లిం పద్ధతిలో ఈ వేడుక చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించింది. 

తన యోగక్షేమాలను పట్టించుకునేవారిని మాత్రమే ఈ శుభకార్యానికి ఆహ్వానించానని తెలిపింది. అలా ఓ 300 మందికి ఆహ్వానం పంపామంది. ఈ ఫంక్షన్‌కు హాజరై తనను, పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపింది. ఈ ఫంక్షన్‌లోని మెనూలో మటన్‌ బిర్యానీ హైలైట్‌ అని చెప్పింది. మరో 20 రోజుల్లో చిన్నారి బుజ్జాయి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతుందంటూ తన ఆనందాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఆమె సీమంతం ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా శాండల్‌ వుడ్‌ డ్రగ్స్‌ కేసులో సంజనా గల్రానీ అరెస్టయి మూడు నెలలు జైలు జీవితం గడిపింది. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ప్రియుడు డాక్టర్‌ పాషాను 2021 జనవరిలో పెళ్లి చేసుకుంది.

చదవండి: సమంత 'ఊ అంటావా మావా' పాటంటే ఇష్టం: బాలీవుడ్‌ హీరో

 అక్కడికి ఎందుకు వెళ్లాలి? బాలీవుడ్‌పై మహేశ్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement