గతవారం ఫ్యామిలీ వీక్ కావడంతో బిగ్‌బాస్ హౌస్ అంతా ప్రశాంతంగా కనిపించింది. హౌస్‌మేట్స్ కుటుంబ సభ్యులు, కన్నీళ్లు, భావోద్వేగాలు ఇలా చూడముచ్చటగా అనిపించింది. ఆదివారం దివ్య బయటకు వెళ్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఇమ్ము పవర్ వల్ల ఆమె సేవ్ అయిపోయింది. దీంతో ఎవరూ ఔట్ కాలేదు. సోమవారం వచ్చేసరికి ఎప్పటిలానే నామినేషన్స్ హడావుడి మొదలైంది. కాకపోతే ఈసారి అటు పవన్, ఇటు సంజన.. బిగ్‌బాస్ గీత దాటి ప్రవర్తించారు. ఒకరు నోరు జారితే మరొకరు ఫిజికల్ హ్యాండ్లింగ్ చేశారు. ఇంతకీ 78వ రోజు ఏం జరిగింది? నామినేషన్స్‌లో ఎవరెవరున్నారు?
ఈసారి నామినేషన్స్ ప్రక్రియని కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. మొదటి సీక్రెట్‌గా ఒకరి పేరు రాసి, ఆ కార్డ్‌ని బాక్స్‌లో వేయాల్సి ఉంటుందని చెప్పగా అందరూ దీన్ని ముగించారు. ఇక సాధారణ నామినేషన్ ప్రక్రియ మాత్రం ఈసారి రచ్చ రచ్చ అనేలా సాగింది. కొట్టుకోవడం, నోరు జారడం లాంటివి చాలా జరిగాయి. మొత్తం ఎపిసోడ్‌లో కల్యాణ్-పవన్ వివాదం, సంజన-రీతూది మాత్రం హైలైట్ అయింది.
(ఇదీ చదవండి: కాబోయే భార్యకు మర్చిపోలేని సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్)
ఇమ్ముని పవన్ నామినేట్ చేశాడు. గతవారం కెప్టెన్సీ టాస్క్‌లో మనం మాట్లాడుకున్నాం, నేను నీకు సపోర్ట్ చేస్తాను.. నువ్వు నాకు సపోర్ట్ చేస్తానని అనుకున్నాం. కానీ నువ్వు అలా చేయలేదు అని డీమాన్ పవన్ తన పాయింట్ చెప్పాడు. వీళ్లిద్దరూ ఎవరికి వాళ్లు తమని డిఫెండ్ చేసుకుంటుండగా.. మధ్యలో కల్యాణ్ ఎంటరయ్యాడు. వేర్వేరు టీమ్స్‌లో ఉండగా.. పవన్ ఇలాంటి డీల్ చేసుకోవడం ఏంటని అడిగాడు. డీమన్-కల్యాణ్ మధ్య డిస్కషన్ జరుగుతుండగా.. రీతూ కూడా దీనిలోకి ఎంటరైంది. నువ్వు అరిచినంత మాత్రాన ఏం కాదు, ఆరోజు ఇమ్మూ అన్నతో డీల్ మాట్లాడుకున్నానని నా మీద నింద వేశావ్. మరి ఇప్పుడు డీమన్ చేసింది ఏంటి అని కల్యాణ్ రీతూపై రెచ్చిపోయాడు.
కల్యాణ్ మాటలకు రెచ్చిపోయిన రీతూ.. గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీంతో కల్యాణ్ కూడా ఎక్కడా తగ్గలేదు. నువ్వు నీకు నచ్చినట్లు మాట్లాడకు.. ఏది పడితే అది వాగకు అంటూ రీతూ అనేసరికి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు శనివారం వచ్చినప్పుడు వీడియో ప్లే చేయించు.. నేను టీమ్ కోసం ఆడదామని చెప్పిన దానికి డీమన్ ఓకే చెప్పలేదని చూపించు. నేను షో నుంచి వెళ్లిపోతాను అని కల్యాణ్, రీతూకి సవాల్ చేశాడు. దీంతో మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు వెళ్లేందుకు యత్నించారు. దీంతో అడ్డుకునే క్రమంలో కల్యాణ్ పీకని డీమన్ పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కల్యాణ్.. ఎవడి నామినేషన్ ఎవడు లెగుస్తున్నాడు అని పక్కనే ఉన్న కుర్చీని తన్నేశాడు.
దీని తర్వాత కెప్టెన్ రీతూ.. సంజనని నామినేట్ చేసింది. దీంతో మరో గొడవ మొదలైంది. ఫైర్ స్ట్రామ్స్ వచ్చినప్పటి నుంచి మీ గేమ్ అసలు కనిపించడం లేదు. కెప్టెన్సీ టాస్క్‌లో ఇమ్మూ సపోర్ట్ చేయలేదని చాలా ఫీలయ్యారు. కానీ ఈరోజు ఇమ్మూని మీరు నామినేట్ చేసే అవకాశమున్నా చేయలేనని చెప్పారు అని రీతూ తన కారణాలు చెప్పింది. తర్వాత బూతులు మాట్లాడుతున్నారని ఒకరి గురించి ఒకరు కౌంటర్స్ వేసుకున్నారు. తర్వాత పవన్-రీతూ రిలేషన్ గురించి సంజన దారుణమైన కామెంట్స్ చేసింది. నీ అంత పెద్ద బూతులు ఎవరూ వాడలేదు, నీలాంటి స్ట్రాటజీలు ఈ హౌస్‌లో ఎవరికీ లేవు రీతూ. పవన్‌తో నువ్వు రాత్రి కూర్చుంటావ్.. కళ్లు మూసుకోవాల్సి వస్తుంది నేను అని సంజన అనేసింది. ఇలా అనకూడదని చెప్పి సంజనని హౌస్‌మేట్స్ అంతా సముదాయించారు. కానీ ఆమె వినలేదు. చివరగా రీతూ తప్పితే హౌస్‌లోని అందరూ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: ఐ బొమ్మ క్లోజ్ కావడం మాకు కలిసొచ్చింది)


