బిగ్‌బాస్‌కు కొత్త ఐడియాలు రావడం లేదేమో! కొన్నిసార్లు పిచ్చి టాస్కులిస్తున్నాడు. నీళ్లు ఉమ్మే టాస్క్ అయితే మరీ దారుణం. అమర్‌దీప్- అర్జున్ ఎంట్రీ ఇవ్వడం కాస్త ఉపశమనంగా కనిపిస్తుంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో గురువారం (అక్టోబర్ 23వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
మట్టి కరిపించిన డిమాన్ పవన్
సంజనా సైలెన్సర్- మాస్ మాధురి గ్యాంగ్స్‌కు జెండాలే ఎజెండా టాస్క్ ఇచ్చాడు. ఇందులో సంజనా తరపు నుంచి బరిలో దిగిన డిమాన్-గౌరవ్.. మాధురి గ్యాంగ్ నుంచి వచ్చిన ఇమ్మాన్యుయేల్, కల్యాణ్‌ను మట్టి కరిపించారు. డిమాన్ పవన్ మరోసారి టాస్కుల వీరుడు అని నిరూపించుకున్నాడు. సంజనా రాను రాను శృతి, గతి అన్నీ తప్పుతోంది. నోటికి ఏదొస్తే అది అనేస్తోంది. చెత్తబుట్ట తీసుకొచ్చి.. ఇది ఖాళీ చేయలేదు.. పని చేయకుండా పిక్నిక్‌కు వచ్చారా? అని అరిచేసింది.

చెండాలం టాస్క్
కెప్టెన్స్ గౌరవ్, సుమన్‌తోనూ.. నేనేమైనా మీ పనిమనిషినా? నేను మీ సర్వెంట్ కాదంటూ చిందులు తొక్కింది. తర్వాత బిగ్‌బాస్ ఓ దరిద్రపు టాస్క్ ఇచ్చాడు. నోట్లో నీళ్లు పోసుకుని ఎక్కువ దూరంలో ఉన్న బకెట్‌లో ఉమ్మితే ఎక్కువ పాయింట్లు అట! ఇదే ఒక చెత్త టాస్క్ అంటే.. మా బకెట్‌లో చుక్క నీరు పడింది.. అక్కడ పడలేదంటూ గొడవ పెట్టుకున్నారు. ఈ గేమ్‌లో సంజన టీమ్ గెలిచింది.
మీరు తోపు.. మేము తుప్పాస్
దీంతో బిగ్‌బాస్ చెప్పినట్లుగా మాధురి టీమ్ మెంబర్స్ అంతా మోకాళ్లపై కూర్చుని మీరు తోపు.. మేము తుప్పాస్ అని సంజనాకు చెప్పారు. ఇక ఈ వాంటెడ్‌పేట గేమ్‌లో రాము, రమ్య దగ్గర ఒక్క రూపాయి లేకపోవడంతో కంటెండర్ రేసు నుంచి తప్పుకున్నారు. తర్వాత బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్లు అమర్‌దీప్-అర్జున్ పోలీస్ గెటప్స్‌లో హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. కాసేపు కామెడీ చేసి నవ్వించారు. ఇది నేటి ఎపిసోడ్‌లో కూడా కొనసాగనుంది.
చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?


