
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు వేధింపులు తప్పవనే టాక్ ఇప్పటికీ ఉంది. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడితే.. అవకాశాల పేరుతో కొంతమంది..అవసరాలకు మరికొంత మంది వారిని ఇబ్బందికి గురి చేస్తూనే ఉంటున్నారు. టాలెంట్తో చాన్స్ దక్కించుకొని షూటింగ్కి వెళ్తే..అక్కడ కూడా వేధింపులు తప్పవు. చాలా మంది అలాంటి వేధింపులను భరించలేక..ఇండస్ట్రీనే వదిలేశారు. కొంత మంది మాత్రమే వాటిని ధైర్యంగా ఎదుర్కొని కెరీర్ పరంగా ముందుకు సాగారు. అలాంటి వారిలో సంజన గల్రానీ ఒకరు. తన కెరీర్లో ఎంతో మందితో వేధింపులు ఎదురయ్యాయని..వాటిని ఎదుర్కొని ముందుకు సాగడం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెబుతోంది.
తెలుగు, తమిళ, కన్నడలో పలు చిత్రాలతో అలరించిన ఈ బ్యూటి.. ఇప్పుడు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్(Bigg Boss 9 Telugu)లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఈ నటి బిగ్‌బాస్ హౌస్‌లోనే ఉంది. అయితే ఈమెకు సంబంధించిన ఓ పాట ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్గా మారింది. అందులో ఆమె కెరీర్లో ఓ హీరోతో ఎదురైన ఇబ్బందిని పంచుకుంది. కన్నడ సినిమా షూటింగ్లో ఓ హీరో తనను టార్చర్ చేశాడట. తన చేతులను పట్టుకొని గట్టిగా నొక్కాడట. నొప్పిగా ఉందని చెబితే.. మ్యానేజ్ చేసుకో అని దురుసుగా మాట్లాడినట్లు సంజనా చెప్పింది.

‘కన్నడలో ఓ సినిమా షూటింగ్ నాకు ఇబ్బందిగా అనిపించింది. పేరు చెప్పలేను కానీ ఓ హీరో నన్ను టార్చర్ పెట్టాడు. ఆ మూవీ డైరెక్టర్తో అతనికి గొడవలు జరుగుతున్నాయి. అదే సమయంలో షూటింగ్ జరపగా.. హీరో వచ్చిన నా చేతులు గట్టిగా నొక్కాడు. వాస్తవానికి ఆ సీన్లో హీరో నా చేతులు పట్టుకొని ముందుకు మూవ్ అవ్వాలి. కానీ ఆయన కోపంతో వచ్చి గట్టి గట్టిగా నొక్కాడు. నొప్పిగా ఉందని చెబితే.. మ్యానేజ్ చేసుకో అని సీరియస్ లుక్‌తో చెప్పాడు. నేను కాసేపు షూటింగ్నే ఆపేశా. ‘ నేను దెబ్బలు తినడానికి రాలేదు..ఇదేం యాక్షన్ సీన్ కాదు.. నేను విలన్ కాదు..ఈ సీన్కి తగ్గట్టుగా నీ మైండ్‌సెట్ మార్చుకో.. ఆ తర్వాతే షూట్ చేద్దాం’ అని అరగంట తర్వాత మళ్లీ ఆ సీన్ చేశాం. ఇలాంటి క్రాక్ ఉన్నవాళ్లు అప్పుడప్పుడు దొరుకుతారు. వారిని పట్టించుకోకుండా..మన పని చేసుకొని పోవాలి’ అని సంజన చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ చిత్రం సోగ్గాడు(2005) ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంజనా.. తమిళంలో ఒరు కధల్ సేవిర్తో తొలి విజయం అందుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు చిత్రం సంజన జీవితాన్నే మార్చేసింది. ఆ తర్వాత పోలీస్ పోలీస్, సత్యమేవ జయతే, దుశ్శాసన, యమహో యమ, ముగ్గురు, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ హీరోయిన్గా నటించింది.