హాలీవుడ్ ప్రముఖ డైరక్టర్ రాబ్ రైనర్, ఆయన సతీమణి మిచెల్ దారుణ హత్యకు గురయ్యారు. లాస్ ఏంజిల్స్‌లోని తమ నివాసంలో వారిద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. రక్తపుమడుగులో ఉన్న వారిద్దరిని చూసి అభిమానులు చలించిపోయారు. శరీరాలపై అనేక కత్తిపోట్లు కనిపించడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. అయితే, ఈ ఘాతుకానికి పాల్పడింది వారి కుమారుడు నిక్ రైడర్ అని అమెరికా వార్తా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి.
మాదక ద్రవ్యాల వినియోగించే వాడినని నిక్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తన తండ్రి దర్శకత్వంలో నిక్ ఒక సినిమాలో కూడా నటించి ప్రశంసలు పొందాడు. అయితే, తన తల్లిదండ్రులనే హత్య చేశాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అతని నుంచి ఎలాంటి రెస్సాన్స్ రాలేదు. రాబ్ రైనర్ గత ఐదు దశాబ్దాలకు పైగా హాలీవుడ్‌లో ఉన్నారు. ఆయన నటనకు రెండు ఎమ్మీ అవార్డులు కూడా లభించాయి. వెన్ హ్యారీ మెట్ సాలీ , స్టాండ్ బై మీ, ది ప్రిన్సెస్ బ్రైడ్, తదితర సినిమాలకు దర్శకత్వం వహించి పేరు తెచ్చుకున్నారు.


