'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు | Choreographer Shrasti Verma Buys New Hyundai Car | Sakshi
Sakshi News home page

Shrasti Verma: కొత్త కారు కొన్న కాంట్రవర్సీ కొరియోగ్రాఫర్!

Apr 11 2025 7:08 PM | Updated on Apr 11 2025 7:27 PM

Choreographer Shrasti Verma Buys New Hyundai Car

సాధారణంగా కొరియోగ్రాఫర్స్ పెద్దగా ఫేమస్ అవ్వరు. కానీ కొన్నిరోజుల క్రితం జానీ మాస్టర్(Jani Master)పై పోలీస్ కేసు పెట్టి వార్తల్లో నిలిచింది శ్రష్ఠి వర్మ(Shrasti Verma) అనే కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఈమె కొత్త కారు కొనుగోలు చేసింది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) 

ఢీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శ్రష్ఠి వర్మది మధ్యప్రదేశ్. షోలో పాల్గొన్న తర్వాత కొన్నాళ్లకు జానీ మాస్టర్ దగ్గర అసిస‍్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరింది. మరి ఏమైందో ఏమో గానీ కొన్నాళ్ల క్రితం ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టడం వరకు వెళ్లింది.

మరోవైపు పుష్ప 2(Pushpa 2 Movie)మూవీలోనూ కొన్ని పాటలకు ఈమె కొరియోగ్రాఫీ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అలా బన్నీ సినిమాతో ఫేమ్ సంపాదించిన శ్రష్ఠి.. ఇప్పుడు హుండాయ్ కారు కొనుకున్నానని తెగ సంతోషపడిపోతుంది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి) 

Advertisement
 
Advertisement
Advertisement