
మొన్ననే బిగ్‌బాస్ 9 మొదలైంది. అప్పుడే మొదటి వీకెండ్ వచ్చేసింది. వారాంతం వచ్చిందంటే హోస్ట్ నాగార్జున వచ్చేస్తాడు. నామినేట్ అయినవాళ్లలో కచ్చితంగా ఒకరిని ఎలిమినేట్ చేసేస్తారు. అయితే ఈసారి సెలబ్రిటీలుగా వచ్చిన వారిలో భరణి తప్పితే అందరూ నామినేషన్స్‌లో నిలిచారు. మరోవైపు సామాన్యుల నుంచి డీమాన్ పవన్ ఇందులో ఉన్నాడు. వీరిలో ఇద్దరు మాత్రం చివరి ప్లేసుల్లో నిలిచారు. ఇప్పుడు వారిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది తేలింది.
ఈ వారం నామినేట్ అయినవాళ్లలో లక్స్ పాప ఫ్లోరా సైనీ.. బయటకొచ్చేస్తుందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే సంజనతో గొడవ పడటం తప్పితే ఈమెకు పెద్దగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు. అలా అని కెప్టెన్సీ టాస్క్‌లో ఏమైనా ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిందా అంటే అదీ లేదు. దీంతో ఈమెనే తొలివారం ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ 'పుష్ప' కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: మీదే తప్పు షో నుంచి వెళ్లిపోతా.. నాగార్జునకు మాస్క్ మ్యాన్ ఝలక్)
బిగ్‌బాస్ హౌసులోకి శ్రష్ఠి వర్మ వస్తుందని రూమర్స్ వచ్చినప్పడు.. ఈమె కచ్చితంగా కొన్నివారాలైనా సరే ఉంటుంది. తన జీవితంలో జరిగిన వివాదం గురించి ఎప్పుడైనా మాట్లాడకపోదా అని అందరూ అనుకున్నారు. అలానే షో మొదలైన రోజు నాగార్జునతో మాట్లాడుతూ.. మనం కలిసి సినిమా చేయాలి సర్ అని అడిగింది. దీంతో త్వరగా బయటకొచ్చేయ్ అని నాగ్ సరదాగా అన్నాడు. మరి ఈ మాటల్ని సీరియస్‌గా తీసుకుందో ఏమో తొలివారమే ఈమెని ఎలిమినేట్ చేసినట్లు అనిపిస్తుంది.
సాధారణంగా తొలివారం ఎలిమినేషన్ అనగానే సీనియర్ నటుల్ని బయటకు పంపిస్తూ ఉంటారు. ఈసారి మాత్రం అనుహ్యంగా యంగ్ బ్యూటీని ఔట్ చేయడం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు బిగ్‌బాస్ కూడా ఊహలకు అందని విధంగా చేస్తుంటాడు. మరి ఈసారి అసలేం జరిగింది? అనేది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంతవరకు ఆగాల్సిందే.
(ఇదీ చదవండి: 'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?)