కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జ హీరోగా నటించగా, మనోజ్ విలన్ మహావీర్ లామా పాత్రను పోషించాడు.
ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది.
మనోజ్ విలనిజం అద్భుతంగా ఉందంటూ సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.
హిట్ టాక్ రావడంతో తొలి రోజే రూ. 12 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.


