బిగ్‌బాస్‌లోకి పాపులర్‌ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ | Rithu Chowdary Will Enter In Bigg Boss 9 Telugu | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌లోకి పాపులర్‌ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్

Sep 2 2025 7:19 AM | Updated on Sep 2 2025 8:34 AM

Rithu Chowdary Will Enter In Bigg Boss 9 Telugu

కామెడీ షో జబర్దస్త్‌ నటి రీతూ చౌదరి బిగ్‌బాస్‌-9లో ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆమెకు భారీగానే ఫాలోవర్స్‌ ఉన్నారు. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను షేక్‌ చేస్తుంది ఈ బ్యూటీ.. బిగ్‌బాస్‌ సెప్టెంబర్‌ 7న ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ రెడీ అయిపోయింది. అందులో రీతూ చౌదరి ఉందని దాదాపు ఖాయమైంది.

రీతూ చౌదరి గతంలో బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసి  పోలీసుల విచారణ కూడా ఎదుర్కొంది. ఆపై ఏకంగా రూ. 700 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో ఆమె పాత్ర కూడా ఉందంటూ రూమర్స్‌ వచ్చాయి. అయితే, అందులో ఎలాంటి నిజం లేదని కావాలనే కొందరు తన పేరును ఇందులోకి లాగుతున్నారని చెప్పుకొచ్చింది. అంతడబ్బులు తన వద్ద ఉంటే ఇలాంటి కష్టాలు ఎందుకు పడుతానంటూ పేర్కొంది. అయితే, బిగ్‌బాస్‌ ద్వారా తనపై వచ్చిన నెగటివిటిని కాస్త అయినా తగ్గించుకోవచ్చని ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.

సుమారు రెండేళ్ల క్రితం తన తండ్రి మరణంతో రితూ చౌదరినే తన కుటంబానికి పెద్ద దిక్కు అయింది. పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ సంపాదన మొదలుపెట్టింది. ఆపై సోషల్‌మీడియా ద్వారా కూడా  తన ఫ్యామిలీ కోసం కష్టపడుతుండటంతో ఆమె గురించి తెలిసినవాళ్లు మాత్రం ఫ్యాన్స్‌ అయిపోయారు. అయితే, బిగ్‌బాస్‌9 ద్వారా మరికొందరి ప్రేక్షకుల ప్రేమను గెలవచ్చు అనే రితూ చౌదరి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement