
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్ గౌతమి(31) కొద్దిరోజుల క్రితమే తన భర్త సినీ నటుడు ధర్మమహేశ్(30) వరకట్నం కోసం వేధిస్తున్నాడని, మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో ఆమె ఆ యువతి పేరును చెప్పలేదు. కానీ, ఇప్పుడు కొన్ని వీడియోలు, ఫోటోలు విడుదల చేసి షాక్ ఇచ్చింది. అందులో బిగ్‌బాస్ రీతూ చౌదరి కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన భర్తతో రిలేషన్‌లో ఉండింది రీతూ చౌదరి అనే అర్థం వచ్చేలా వీడియో, ఫోటోలను ఆమె పంచుకుంది. 2023 నాటి సీసీ కెమెరా ఫోటోలు, వీడియోలను గౌతమి షేర్ చేసింది. రీతూ చౌదరి ప్రస్తుతం బిగ్‌బాస్-9లో ఉన్న విషయం తెలిసిందే.
గౌతమి 2023లో ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు బిగ్‌బాస్ ఫేమ్ రీతూ చౌదరి వల్ల తన భర్త ధర్మమహేశ్‌తో గొడవ పడినట్లు కొన్ని సాక్ష్యాలను ఆమె షేర్ చేసింది. రీతూ గురించి అడగటం వల్లే తనను దూరం పెడుతున్నావ్ అంటూ ఆమె పంపిన మెసేజ్‌లు ఉన్నాయి. ఆపై రీతూ చౌదరి, ధర్మమహేశ్ కలిసి ఒకే ఫ్లాట్‌లోకి వెళ్లిన వీడియోలను ఆమె విడుదల చేసింది. అయితే, వారిద్దరి మధ్య నిజంగా అక్రమ సంబంధం ఉందా.., లేక డ్రగ్స్ తీసుకునేందుకే వారిద్దరూ కలిసారా అనే చర్చ మొదలైంది. అయితే, ఒక యువతి వల్ల తన జీవితం నరకంలోకి నెట్టవేయబడిందని గౌతమి చెప్పింది. తన కుమారుడి సంతోషంతో పాటు తన జీవితాన్ని ఆ యువతి లాగేసుకుంది అంటూ ఆమె ఒక నోట్ రాయడంతో రీతూ, ధర్మ ఇద్దరి మధ్య రిలేషన్ నిజమే అనేలా అర్థం వస్తుంది.
సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో నటించిన ధర్మ కాస్త గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, 2019లో గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో వారికి బాబు జన్మించారు. అయితే, కొద్దిరోజుల క్రితం గౌతమి తన భర్త గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ధర్మ గురించి ఆమె ఇలా చెప్పింది. కొంత కాలంగా ధర్మమహేశ్ జల్సాలు, షికారులకు అలవాటు పడి భార్య, కుమారుడిని పట్టించుకోవడం లేదని.. ఓ యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని పోలీసుల ఫిర్యాదులో ఆమె పేర్కొంది. వారిద్దరి రిలేషన్‌పై నిలదీస్తే అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది. అయితే, ఇప్పుడు బిగ్‌బాస్ రీతూ చౌదరి తన భర్తతో కలిసి అర్ధరాత్రి కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను ఆమె విడుదల చేసింది. దీంతో సోషల్‌మీడియాలో అవి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.