తెలంగాణ అమ్మాయిగా అనుపమ.. నవ్వులు పూయిస్తున్న టీజర్‌ | Crazy Kalyanam Teaser Out | Sakshi
Sakshi News home page

తెలంగాణ అమ్మాయిగా అనుపమ.. ‘క్రేజీ కళ్యాణం’ టీజర్‌ చూశారా?

Aug 1 2026 1:40 PM | Updated on Aug 1 2026 1:51 PM

Crazy Kalyanam Teaser Out

అనుపమ పరమేశ్వరన్,  తరుణ్ భాస్కర్ , అఖిల్‌ రాజ్‌, నరేష్ వీకే  కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శవత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బూసమ్ జగన్ మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్ర టీజర్‌ విడుదల చేశారు మేకర్స్‌. పెళ్లి చుట్టూ సాగే ఈ వినోదాత్మక చిత్రంలో అనుపమ తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతుంది.

‘చెప్పు తల్లి ఎలా చేయాలి నీ పెళ్లి? ఎంత బంగారం కావాలి? ఎన్ని చీరలు కావాలన్నా కొనుక్కో.. నీ దోస్తులందరినీ పిలుచుకో.. జోరుగా చేస్తా నీ పెళ్లి’ అని నరేశ్‌ చెప్పె డైలాగుతో టీజర్‌ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఇద్దరి అన్నదమ్ముల మధ్య గొడవ.. మధ్యలో . మధ్యలో తరుణ్ భాస్కర్ మాస్ ఎంట్రీ, అఖిల్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఏం ఫ్యామిలీ రా నాయనా.. బ్రతకనివ్వరు.. చావనివ్వరు’ అంటూ తరుణ్ భాస్కర్ కొట్టే డైలాగ్ ఆకట్టుకుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement