breaking news
Main Vaapas Aaunga Movie
-
దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ
ప్రేమకథలకు భాషతో సంబంధం లేదు. బాగుండాలే గానీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలా రీసెంట్ టైంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిందీ సినిమా 'మై వాపస్ ఆవుంగా'. జూన్‌లో థియేటర్లలో రిలీజైంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, దిల్జిత్ దోసాంజ్, వేదాంగ్ రైనా, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రధారులు. రెండు రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఇదెలా ఉంది? ఏడిపించేంతలా ఇందులో ఏముందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'ఉయిర్' తెలుగు రివ్యూ)కథేంటి?చంఢీగడ్‌లో ఉండే 95 ఏళ్ల కీను అలియాస్ ఇషార్ సింగ్ గ్రెవాల్ (నసీరుద్దీన్ షా) ఎలాగైనా సరే పాకిస్థాన్‌లోని సర్గోదా నగరానికి వెళ్లాలని పట్టుబడుతుంటాడు. అదలా ఉండగానే స్ట్రోక్ వస్తుంది. దీనికి తోడు మెల్లమెల్లగా జ్ఞాపకశక్తిని కోల్పోతుంటాడు. చివరదశలో తాతకు తోడుగా ఉండేందుకు ఇంగ్లాండ్‌లో నుంచి మనవడు నిర్వార్(దిల్జీత్ దోసాంజ్)స్వదేశానికి తిరిగొస్తాడు. తాతతో మాట్లాడుతూ ఆయన గతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ కీను.. పాక్ ఎందుకు వెళ్లాలనుకుంటున్నాడు? ఎవరిని కలవాలనుకుంటున్నాడు? అసలు 1947 దేశ విభజన టైంలో ఏం జరిగింది? అనేది అసలు స్టోరీ.ఎలా ఉందంటే?భారత్-పాక్ విడిపోయి 78 ఏళ్లు అయిపోయింది. అప్పుడేం జరిగిందో కళ్లారా చూసిన సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు చాలావరకు జీవించిలేరు. ఇప్పటితరానికి ఆ సంగతులేవి పెద్దగా తెలీదు. చరిత్ర పుస్తకాల్లోని ఫొటోలుగా మాత్రమే చూశారు, చూస్తున్నారు. కానీ దేశవిభజన జరిగినప్పుడు నరకాన్ని అనుభవించిన ఆనాటి తరం పరిస్థితి ఏంటి? తమ సొంత ఇళ్లని, ప్రాణానికి ప్రాణమైన మనుషుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చినవాళ్ల బాధేంటి? వారు తమ జీవితాంతం మోసిన ఆ గుండెకోత, గాయాల విలువెంత? అనేది ఓ ప్రేమకథతో చూపించిన సినిమానే 'మై వాపస్ ఆవుంగా'.సినిమా మొదలైన నిమిషాల్లోనే స్టోరీలోకి నేరుగా వెళ్లిపోతాం. 1947లో మన దేశంలోని పంజాబ్‌కి వలస వచ్చిన ఓ కుర్రాడు.. తిరిగి పాకిస్థాన్‌లోని పంజాబ్‌కి వెళ్లాలని ప్రయత్నం చేసే సీన్‌తో కథ మొదలవుతుంది. అసలు ఇంతకీ ఇతడెవరు? దేశ విభజన జరగకముందు ఎలా ఎక్కడ ఉండేవాడు? ఎవరిని ప్రేమించాడు? అసలు 1947లో ఏం జరిగింది? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన జియా అనే అమ్మాయిని వదిలేసి ఎందుకు రావాల్సి వచ్చింది? అనే విషయాల్ని ఒక్కొక్కటిగా చూపించారు.మూవీ ప్రారంభమైన కాసేపటికి స్క్రీన్‌ప్లే కాస్త నెమ్మదిస్తుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి ఈ పాత ప్రేమకథలో ఇక చెప్పడానికి ఏముంది? అనిపించింది. ఎప్పుడైతే సెకండాఫ్ మొదలవుతుందో మన మదిలో మెదిలిన ఒక్కో ప్రశ్నకు సమాధానాలు కనిపిస్తాయి. అప్పటివరకు సరదాగా, థ్రిల్లింగ్‌గా సాగిన సినిమా కాస్త గుండెల్ని పిండేసేలా మారుతుంది. క్లైమాక్స్‌లో అయితే ఏడిపించేసింది. అంతా అయిపోయిన తర్వాత అద్భుతమైన ప్రేమకథ చూశామే అని అనుభూతి కలిగింది.1947 విభజన అనగానే చాలామంది దాన్ని రాజకీయంగానే చూస్తారు. కానీ ఈ సినిమాలో ఆ సంఘటనని మనుషుల జీవితాలని శాశ్వతంగా మార్చిన విషాదంగా చూపించారు. మతాలు వేరు అయినప్పటికీ కీను-జియా ప్రేమించుకుంటూ ఉంటారు. అమాయకమైన ప్రేమ, చిలిపితనం, దొంగచూపులతో సాగుతున్న వీరి బంధాన్ని 1947 విభజన ఛిద్రం చేస్తుంది. రాడ్‌క్లిఫ్ అనే బ్రిటీషర్ గీసిన విభజన రేఖ కారణంగా కీను తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌కు రావాల్సి వస్తుంది. జియా పాక్‌లోనే ఉండిపోతుంది. తిరిగి కలుస్తానని ఆమెకు మాట ఇచ్చిన కీను.. ఆ జ్ఞాపకంతోనే జీవితాన్ని కొనసాగిస్తాడు. కానీ కలవలేకపోతాడు.ఇది జరిగిన 78 ఏళ్ల తర్వాత కీను మనవడు.. తాత కోరికని ఎలా నెరవేర్చాడు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేది ఇందులో హృద్యంగా చూపించారు. దేశం కోసం చేసే త్యాగం మాత్రమే గొప్పది కాదు, స్వస్థలాన్ని వదిలి వెళ్లాల్సిన శరణార్థి కన్నీటిలోనూ అపారమైన విలువ ఉందని ఇందులో అద్భుతంగా చూపించారు.ప్రస్తుత సమాజంలో ప్రేమకు విలువ లేకుండా చేశారు. కానీ అప్పట్లో ప్రేమ అంటే ఎలా ఉండేదో తెలియాలంటే ఈ మూవీ చూడండి. ఓ సీన్లో కీను, జియాని ముద్దుపెట్టుకుంటాడు. ఆమె ఇబ్బందిపడేసరికి ఇక జీవితంలో ఎప్పుడు ఇలా చేయనని అంటాడు. పెళ్లయినా సరే నన్ను ముద్దుపెట్టుకోవా అని జియా గోముగా అడుగుతుంది. ఈ సీన్ చూస్తున్నప్పుడు భలే క్యూట్‌గా అనిపిస్తుంది. అలానే రాజకీయాల కోసం రెండు మతాలు, దేశాల మధ్య చిచ్చుపెట్టి బ్రిటీషర్లు ఎలాంటి దమనకాండ సృష్టించారో ఇందులో కంటతడి పెట్టించేలా చూపించారు. 'శత్రువు వెళ్లిపోయాడు.. మనలో మనల్ని శత్రువులుగా మార్చాడు' అనే డైలాగ్ అప్పటి పరిస్థితులకు అద్దం పడుతుంది.ఎవరెలా చేశారంటే?ఇందులో 95 ఏళ్ల వృద్ధుడిగా చేసిన నసీరుద్దీన్ షా కళ్లతోనే హావాభావాలు పలికించాడు. తన నటన అనుభవం ఏంటో ఇందులో మరోసారి చూపించాడు. యుక్త వయసు కీనుగా చేసిన వేదాంగ్ రైనా, జియాగా చేసిన శార్వరి వాఘ్ కూడా వాళ్ల పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారని చెప్పొచ్చు. చూస్తున్నంతసేపు వీళ్లు కనిపించరు సదరు పాత్రలే దర్శనమిస్తాయి. దిల్జీత్ దోసాంజ్ కూడా తాత కోరికని నెరవేర్చే మనవడి పాత్రలో పర్లేదనిపించాడు. మిగిలిన వాళ్లు కూడా తమకిచ్చిన రోల్స్‌కి న్యాయం చేశారు.ఈ సినిమాలో నటీనటులు ఎంత తోడ్పాటు అందించారో డైరెక్టర్ ఇంతియాజ్ అలీ, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అంతకుమించి కష్టపడ్డారు. విజయానికి మూలకారకులు వీళ్లే. తనదైన టేకింగ్‌తో దర్శకుడు.. కథలో లీనమయ్యేలా రెహమాన్ తన మ్యూజిక్‌తో ప్రేమకథకు ప్రాణం పోశాడు.ఈ సినిమా నిడివి 2 గంటల 46 నిమిషాలు. హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ స్క్రీన్ మీదున్న పాత్రలతో ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అందువల్ల సినిమా చూస్తున్నప్పుడు టైమ్ ఎలా గడిచిపోయిందో కూడా మనకు తెలియదు. గడియారంలోని ముల్లుల కంటే పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ మనల్ని కట్టిపడేస్తుంది. ఎలాంటి అసభ్యకర సీన్స్ లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ) -
ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో పాటు కేజేక్యూ, అనకాపల్లి, అమ్మ నాకు అబ్బాయి కావాలి అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే లోకేశ్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న 'డిసి', మాధవన్ 'జీడీ నాయుడు' లాంటి డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా దూకుడు రీ రిలీజ్ (ఆగస్టు 09) కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ చాలానే క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. జాబితాలో దాదాపు 23 వరకు మూవీస్, సిరీస్‌లు ఉన్నాయి. వాటిలో లెనిన్, హృదయం మురళి (ఇదయం మురళి), వంద దేవుళ్లు (నూరు సామి), మై వాసప్ ఆవుంగా లాంటి హిట్స్ ఉన్నాయి. వీటికి తోడు ఆపరేషన్ సఫేద్ సాగర్, వదంది 2 లాంటి డబ్బింగ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 03 నుంచి 09 వరకు)జీ5లెనిన్ (తెలుగు మూవీ) - ఆగస్టు 07వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07తుంబడ్ చీ మంజులా (మరాఠీ మూవీ) - ఆగస్టు 07అమెజాన్ ప్రైమ్ఈవిల్ డెడ్ బర్న్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 04 (రెంట్)స్టెర్లింగ్ పాయింట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05వదంది 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07నెట్ఫ్లిక్స్బ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 04బిగ్ చికెన్: ఏ ఫాస్ట్‌ఫుడ్ కాన్సిపరసీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 05ఇన్సైడ్ ద ట్రస్టెడ్ స్కాండల్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 05మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 06ఇదయం మురళి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07ఆపరేషన్ సఫేద్ సాగర్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07ద లాస్ట్ హౌస్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 07మై వాపస్ ఆవుంగా (హిందీ సినిమా) - ఆగస్టు 07రికీ గెర్వైస్ ఆలే క్యాట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07అవర్ స్టిక్కీ లవ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 07డెత్ ఇంక్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07ద రిబ్బన్ హీరో (జపనీస్ ఏనిమే మూవీ) - ఆగస్టు 08హాట్స్టార్ఉయిర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 04ద షార్డ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05ద సూపర్ మారియో గెలక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 07మనోరమ మ్యాక్స్కాట్టలన్ (మలయాళ మూవీ) - ఆగస్టు 07ఆపిల్ టీవీ ప్లస్టెడ్ లాసో సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 04(ఇదీ చదవండి: తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలో ఇంటెన్స్ ప్రేమకథా సినిమా.. అధికారిక ప్రకటన
ప్రేమకథలు సరిగా తీయాలే గానీ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. అలా రీసెంట్ టైంలో ఆకట్టుకున్న చిత్రం 'మై వాపస్ ఆవుంగా'. హిందీ భాషలో తీసిన ఈ మూవీ ఇంటెన్స్ ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కించారు. బిగ్ స్క్రీన్ పై అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అధికారికంగా అప్డేట్ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, దిల్జీత్ దోసాంజే, వేదాంగ్ రైనా, శార్వరి వాఘ్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించాడు. జూన్ 11న పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలో రిలీజై ఇప్పటికీ ప్రదర్శితమవుతూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 07వ తేదీ నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు.భారత్-పాక్ విభజన జరిగిన టైంలో ఇద్దరు ప్రేమికులు విడిపోతారు. ఏళ్లు గడిచిపోయిన తర్వాత సదరు ప్రేమికుడు.. వృద్ధుడు అవుతాడు. ప్రియురాలిని మళ్లీ కలవాలనే ఇతడి ఆశయాన్ని నెరవేర్చేందుకు మనవడు సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్తాడు. తర్వాత ఏమైంది? చివరకు అనుకున్నది చేశారా లేదా అనేదే మిగతా స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన)


