'లెనిన్'లో లేని క్రేజీ సాంగ్ వీడియో రిలీజ్ | Soul Of Lenin Full Song Video Details | Sakshi
Sakshi News home page

Soul Of Lenin: మాస్ పాట.. కానీ మూవీలో పెట్టలేదు

Aug 1 2026 8:23 PM | Updated on Aug 1 2026 8:24 PM

Soul Of Lenin Full Song Video Details

అఖిల్‌కి 'లెనిన్'తో తొలి సక్సెస్ దక్కింది. గత నెలలో రిలీజైన ఈ మూవీకి రూ.100 కోట్ల వసూళ్లు వచ్చాయి. వచ్చే శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌కి కూడా రానుందని అధికారికంగా ప్రకటించారు. అయితే రిలీజ్‌కి ముందు 'సోల్ ఆఫ్ లెనిన్' పేరిట ఓ సాంగ్‌ని బయటకు వదిలారు. ఇది మూవీలో కూడా ఉంటుందేమోనని అనుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. దీనిని ఎడిటింగ్‌లో తీసేశారు. కానీ ఇప్పుడు పూర్తి వీడియోని యూట్యూబ్‌లో విడుదల చేశారు.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)

అఖిల్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన 'లెనిన్' సినిమాకు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడు. రూరల్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. నాగార్జున, నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరించారు. మహాభారతాన్ని రిఫరెన్స్‌గా తీసుకుని ఈ మూవీ తీశారు. ఫస్టాప్ రొటీన్‌గా ఉన్నప్పటికీ సెకండాఫ్‌లో వరసపెట్టి ట్విస్టులు వస్తూనే ఉంటాయి.

(ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' సినిమా రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement