'ఆలోచన' ఫస్ట్ లుక్ విడుదల చేసిన మురళి మోహన్ | Murali Mohan Released Alochana Movie First Look | Sakshi
Sakshi News home page

'ఆలోచన' ఫస్ట్ లుక్ విడుదల చేసిన మురళి మోహన్

Jun 28 2026 7:04 PM | Updated on Jun 28 2026 7:04 PM

Murali Mohan Released Alochana Movie First Look

ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం "ఆలోచన". సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, సీనియర్ నటుడు సుధాకర్ కొడుకు బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సురేందర్ చాచా దర్శకుడు కాగా.. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని నటుడు మురళి మోహన్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా మురళి మోహన్ మాట్లాడుతూ.. అద్భుతమైన నటుల కాంబినేషన్‌తో స్నేహంపై ఒక మంచి కాన్సెప్ట్‌తో ఆలోచన చేశారు. మంచి సంకల్పంతో నిర్మాతలు ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన  సినిమాను నిర్మించారు అని ప్రశంసించారు. మంచి కథాబలమున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ , ట్రైలర్ త్వరలో విడుదల కానున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement