సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా శ్రీరామ్‌ ‘ది మేజ్‌’ | The Maze Movie First Look Released | Sakshi
Sakshi News home page

సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా శ్రీరామ్‌ ‘ది మేజ్‌’

Jul 26 2026 10:01 AM | Updated on Jul 26 2026 10:37 AM

The Maze Movie First Look Released

హీరో శ్రీరామ్‌ (శ్రీకాంత్‌) నటిస్తున్న సినిమా ‘ది మేజ్‌’. ప్రియాంక, హ్రితికా శ్రీనివాస్, కమల్‌ కామరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డా. నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో డా. రవికిరణ్‌ గడలాయ్‌ దర్శకత్వంలో డా. ఉదయ్‌ కె. రెడ్డి పాల్వాయి, డా. కేఎస్‌ఆర్, డా. భరత్‌ రెడ్డి గోపు, డా. అనిరుధ్‌ రెడ్డి సోమ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. దర్శకుడు రవికిరణ్‌ మాట్లాడుతూ – ‘‘వాస్తవం–భ్రమ మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ, మీ ఆలోచనలను సవాలు చేసే సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కథలోని ప్రతి మలుపు ఆసక్తి రేపేలా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement