పాన్ ఇండియా కథానాయికలుగా రాణిస్తున్న వారిలో నటి పూజా హెగ్డే ఒకరు. దశాబ్దానికి పైగా తెలుగు ,తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా కొనసాగుతున్న ఈ బ్యూటీకి అందరూ నటీమణుల మాదిరిగానే కెరీర్ పరంగా అవరోధాలు ఎదురయ్యాయి. చిత్రాల జయాపజయాలు అనేవి ఎవరి చేతుల్లోనూ ఉండవు. అయినా కొన్ని చిత్రాల అపజయాలకు నటి పూజా హెగ్డేను బాధ్యతను చేయడంతో చాలా అవకాశాలు దూరం అయ్యాయి.
అయితే అలాంటి వాటిని మళ్లీ అవకాశాలు అందుకుంటూ బిజీ అవుతున్నారు. అలా నటుడు విజయ్ సరసన కథానాయకి నటించిన చిత్రం జననాయకన్. ఇంతకుముందు ఆయన సరసన నటించిన బీస్ట్ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ జననాయకన్ చిత్రంతో మరో అవకాశాన్ని అందుకున్నారు.
ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం వసూళ్లు కురిపిస్తోంది. ఈ సందర్భంగా నటి పూజా హెగ్డే ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ‘‘ సినిమా అనేది ఒక ఇసుక ఊబి లాంటిది. జాగరూకత లేకుంటే చిక్కుకుపోతాం. అలా చిక్కుకుంటే చెల్లా చెదురవుతాం. అందువల్ల పోటీ ఉన్నా, రాగద్వేషాలు లేకుండా పయనించాలి. శ్రమ, నమ్మకం ఉంటేనే సినిమాలో జయించగలం. ఇక్కడ విజయం సాధించిన వారంతా పలు సమస్యలను అధిగమించినవారే అయ్యి ఉంటారు. ఎందుకంటే అవమానాలను , పరాభవాలను ఎదుర్కోకుండా సినిమాల్లో రాణించటం సాధ్యం కాదు ‘‘ అని నటి పూజా హెగ్డే పేర్కొన్నారు. దీంతో ఆమె తన స్వానుభవాన్ని బయట పెట్టినట్లుంది అనే కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


