డాన్సర్స్ అసోసియేషన్ మీటింగ్‌పై తీవ్ర ఉత్కంఠ | Telugu Film Dancers Association General Body Meeting Highlights | Sakshi
Sakshi News home page

డాన్సర్స్ అసోసియేషన్ మీటింగ్‌పై తీవ్ర ఉత్కంఠ

Jul 26 2026 9:47 AM | Updated on Jul 26 2026 10:55 AM

Telugu Film Dancers Association General Body Meeting Highlights

నేడు తెలుగు ఫిల్మ్‌ డాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫెడరేషన్ సూచనల మేరకు వివాదాలు సర్దుమణగడంతో ఈ సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. యూనియన్ సభ్యులందరూ కలిసికట్టుగా, ఐక్యంగా చర్చించుకుని ముందుకు సాగాలని నిర్మాతల మండలి, ఫెడరేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు.

ఉప ఎన్నికలు జరపాలంటూ హైకోర్టులో కేసు
యూనియన్ అధ్యక్షుడు సుమలతా దేవికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల మధ్య, డాన్సర్ బాలు నిన్న డాన్సర్స్ అసోసియేషన్‌పై కోర్టులో కేసు దాఖలు చేశారు. తక్షణమే ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫెడరేషన్ సూచించిన మార్గదర్శకాలను పక్కనపెట్టి, నేడు జనరల్ బాడీ మీటింగ్ ఉన్నప్పటికీ కోర్టు కేసు వేయడం వెనుక ప్రెసిడెంట్ సుమలత, జానీ మాస్టర్‌ల హస్తం ఉందంటూ కొంతమంది డాన్సర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫెడరేషన్ మాటలను వీరు పట్టించుకోవడం లేదని వారి ఆరోపించారు.

కాగా, ఇటీవల  డాన్సర్స్ అసోసియేషన్‌లో జరిగిన పరిణామాలపై ఫెడరేషన్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్‌పై ఇండియా వైడ్‌గా సస్పెన్షన్ విధిస్తామని హెచ్చరించడమే కాకుండా, ఆయన పనిచేసే చిత్రాల్లో మిగతా 23 క్రాఫ్ట్స్‌కు చెందిన వర్కర్లు పాల్గొనకుండా బహిష్కరిస్తామని స్పష్టం చేసింది.  

జూలై 19న కుదిరిన రాజీ  ఈ వివాద పరిష్కారానికి జూలై 19న ప్రొడ్యూసర్ కౌన్సిల్‌, ఫెడరేషన్ సభ్యులు, జానీ మాస్టర్ అలాగే అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతతో ప్రత్యేక చర్చలు జరిపారు.అదే రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫెడరేషన్ ప్రతినిధులు అసోసియేషన్‌లోని సమస్యలు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. జానీ మాస్టర్, సుమలతలు కూడా ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపారు.  ఈ రోజు జరుగుతున్న జనరల్ బాడీ మీటింగ్‌లో డాన్సర్స్ అసోసియేషన్ భవిష్యత్ కార్యాచరణ, ఏకాభిప్రాయం ఏ విధంగా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement