breaking news
Ashwath Marimuthu
-
డ్రాగన్ సీక్వెల్? హింట్ ఇచ్చిన డైరెక్టర్
దర్శకుడిగా, హీరోగా హిట్టయినవారిలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. కోమలి సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన ఇతడు లవ్ టుడేతో డైరెక్టర్ కమ్ హీరోగా భారీ సక్సెస్ కొట్టాడు. ఆ వెంటనే డ్రాగన్ సినిమా చేశాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఫిబ్రవరి 21న ఈ సినిమా వచ్చి ఏడాది అవుతోంది.రెండోసారి తప్పక వస్తాంఈ సందర్భంగా అశ్వత్.. ప్రదీప్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. డ్రాగన్ చిత్రానికి ఏడాది. సెల్ఫ్ మేడ్ స్టార్ ప్రదీప్‌తో కలిసి పని చేసిన అనుభవాన్ని మర్చిపోలేను. ఇద్దరు స్నేహితులు కలిసి పని చేస్తే ఎలా ఉంటుందో చూపించాం. మమ్మల్ని నమ్మినందుకు ఏజీఎస్ ప్రొడక్షన్ బ్యానర్‌కు, మా టీమ్‌కు కృతజ్ఞతలు. మేము సెకండ్ టైమ్ తప్పకుండా వస్తాం అని రాసుకొచ్చాడు. సినిమాదీంతో అభిమానులు డ్రాగన్ సీక్వెల్ ఉంటుందా? అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో డ్రాగన్ టీమ్ కాంబినేషన్లో ఒక కొత్త చిత్రం రాబోతుందేమోనని అభిప్రాయపడుతున్నారు. డ్రాగన్ విషయానికి వస్తే.. ప్రదీప్ హీరోగా నటించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఈ చిత్రం తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరిట విడుదలై ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. 1 year of Dragon ! Blast working with this self made star ⭐️ @pradeeponelife . when friends come together for work the relationship is at stake ! But the same stake pushes u to deliver 🧨keep growing more PR! Thanks to @Ags_production & my team ❤️WE WILL COME BACK ‘2’nd TIME 😉 pic.twitter.com/ZpcH1j5QMT— Ashwath Marimuthu (@Dir_Ashwath) February 21, 2026 చదవండి: సెట్లో అందరూ చూస్తుండగా.. : తాప్సీ -
ఆయన కూడా తప్పుకున్నట్లే.. డ్రాగన్ డైరెక్టర్‌కు ఛాన్స్!
రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒక క్రేజీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. రజనీకాంత్ కథానాయకుడుగా నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మొదట దర్శకుడు సుందర్.సి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటన చేశారు. సుందర్.సి అవుట్అంతేకాదు ఈ చిత్ర పూజ కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అనూహ్యంగా ఆ చిత్రం నుంచి దర్శకుడు సుందర్.సి వైదొలగడంతో పెద్ద చర్చే జరిగింది. అయితే రజనీకాంత్‌కు కథ సంతృప్తిని కలిగించకపోవడమే ఇందుకు కారణం అని నటుడు, నిర్మాత కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. పార్కింగ్ డైరెక్టర్ కూడా తప్పుకున్నట్లే!ఆ తర్వాత పార్కింగ్ చిత్రంతో జాతీయ అవార్డును పొందిన రామ్‌కుమార్ రజనీకాంత్ 173వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ మూవీ సెట్‌పైకి వెళ్లడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం జరిగింది. పార్కింగ్ చిత్రం తర్వాత రామ్‌కుమార్ శింబు హీరోగా చిత్రం చేయడానికి కమిట్ అయ్యారు. అయితే రజనీకాంత్‌కు దర్శకత్వం వహించే లక్కీచాన్స్ రావడంతో ముందుగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాత శింబు హీరోగా సినిమా చేయాలని దర్శకుడు భావించినట్లు సమాచారం. కొత్తగా ఆయన పేరు తెరపైకి..అందుకు శింబు హీరోగా చిత్రాన్ని నిర్మించతలపెట్టిన డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత అంగీకరించలేదని తెలిసింది. దీంతో ఇప్పుడు ఈ యువ దర్శకుడు కూడా రజనీకాంత్ (Rajinikanth) సినిమా నుంచి వైదొలగినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా 'డ్రాగన్' చిత్ర దర్శకుడు అశ్వద్ మారిముత్తు పేరు తెరపైకి వచ్చింది. ఈయన రజనీకాంత్ 173 వ చిత్రానికి దర్శకత్వం వహించినున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇదైనా ఫైనల్ అవుతుందో? లేదో? చూడాలి! -
'డ్రాగన్' షూటింగ్ లో ప్రేమ.. ఇప్పుడు ఏకంగా పెళ్లి
ప్రేమ.. ఎప్పుడు ఎవరిపై ఎందుకు పుడుతుందో చెప్పడం కష్టం. అలా ప్రేమలో పడ్డ వాళ్లు కొందరు సులభంగా పెళ్లిపీటలు ఎక్కుతారు. మరికొందరు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని ఒక్కటవుతుంటారు. అలా ఇప్పుడు నిజంగా జరిగిన ఓ ప్రేమకథని దర్శకుడు అశ్వత్ మారిముత్తు బయటపెట్టాడు. రీసెంట్ గా 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' సినిమా తీసింది ఇతడే.(ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి.. త్వరలోనే ముహుర్తం ఫిక్స్!)'ఓ మై కడవులే' అనే తమిళ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అశ్వత్.. దీన్ని తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా 'ఓరి దేవుడా' పేరుతో రీమేక్ చేశారు. అలా తెలుగులోనూ అశ్వత్ మూవీ తీశాడు. రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ హీరోగా 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' తీసి సూపర్ హిట్ కొట్టేశాడు. అయితే ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసిన విక్కీ .. ఇదే మూవీకి మేకప్ ఆర్టిస్టుగా పనిచేసిన పవిత్ర రుక్మిణి ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు హాజరైన అశ్వత్.. వీళ్లిద్దరి ప్రేమకథ గురించి చెప్పాడు.'నిన్న నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నా అసిస్టెంట్ డైరెక్టర్ విక్కీ.. పవిత్రతో నిశ్చితార్థం చేసుకున్నాడు. 'ఓ మై కడవులే' సినిమా కోసం విక్కీ నా దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. 'డ్రాగన్'కి చీఫ్ అసోసియేట్ దర్శకుడిగా పనిచేశాడు. నాతో పాటే కలిసి ఉండేవాడు. కానీ కొన్నిసార్లు జీవితం మనల్ని సర్ ప్రైజ్ చేస్తూ ఉంటుంది. అలా విక్కీ.. 'డ్రాగన్' సెట్ లో మేకప్ ఆర్టిస్ట్ పవిత్రని కలిశాడు. చూడగానే ప్రేమలో పడిపోయాడు''ప్రతి గొప్ప ప్రేమకథ.. నో చెప్పడంతోనే మొదలవుతుంది. వీళ్లది కూడా అంతే. బ్రేకప్ సీన్ తీస్తున్న టైంలో విక్కీ ఏడుస్తూ కనిపించాడు. ఏమైందని అడిగితే.. తను నో చెప్పింది, మాట్లాడొద్దని కూడా చెప్పిందని అన్నాడు. ఓ అన్నగా నేను కొన్ని సలహాలు ఇచ్చా. కానీ పాట తీస్తున్న టైంకల్లా వాళ్ల గాఢమైన ప్రేమలో ఉన్నారు. రీసెంట్ గా నా దగ్గరకొచ్చి.. మేం పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పడంతో నేను షాకయ్యాను' అని అశ్వత్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
'డ్రాగన్' నా లైఫ్‌లో జరిగిందే.. మనీ అడగాలంటే సిగ్గనిపించింది: డైరెక్టర్
కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు సక్సెస్ బాట పడతాయి. ఇటీవల వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ (Return Of The Dragon) కూడా అదే కోవలోకి వస్తుంది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలైంది. అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ రూ.120 కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. తాజాగా హిందీలోనూ విడుదలకు సిద్ధమైంది. ముందడుగుఈ విషయాన్ని హీరో ప్రదీప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మార్చి 14న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ హిందీలో రిలీజవుతోంది. నా సినిమాలు దేశమంతటా చూడాలని ఎప్పటినుంచో అనుకునేవాడిని. నా ఆలోచనలు ఆచరణలో అమలయ్యేందుకు తొలి అడుగు పడింది. షారూఖ్ ఖాన్ సర్, సల్మాన్ ఖాన్ సర్, ఆమిర్ ఖాన్ సర్.. మీరందరూ పక్కకు జరగండి.. నేను వస్తున్నా అని సరదాగా ట్వీట్ చేశాడు.అంత పెద్దోడివైపోయావా?ఇది చూసిన నెటిజన్లు.. ఏంటి, బాలీవుడ్ హీరోలకే ధమ్కీ ఇస్తున్నావా? అంత పెద్దవాడివైపోయావా?, ఏదేమైనా హిందీలో రీమేక్ చేయకుండా డబ్బింగ్ చేసి మంచి పని చేశారు అని కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. డ్రాగన్ సినిమా తన నిజ జీవితానికి సంబంధించిందని చిత్రదర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలిపాడు. సినిమాలోని ఆ బ్యాచిలర్ రూమ్ నేను నివసించిందే!'కొన్నిసార్లు మన జీవితంలో అత్యంత ముఖ్యమైనవారికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతుంటాం. వాళ్లెవరో కాదు మన స్నేహితులే! డ్రాగన్ సినిమాలో చూపించే బ్యాచిలర్ రూమ్ లైఫ్ నా నిజజీవితంలోనిదే! కేవలం పాత్రలు మాత్రమే కాదు ఆ ప్లేస్ కూడా నేను నివసించిందే.. ఇగీ, పంబు, అంబు, అజయ్, కరుప్స్, బాలాజీ, జై, మురళి, జాన్, గ్లెన్, హరి, విక్కీ.. మేమంతా కాలేజీ ఫ్రెండ్స్. అందరం రూమ్ తీసుకుని ఉండేవాళ్లం. కాలేజీ అయిపోయాక జీరోఇందులో కొందరు అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చేవారు. సినిమాలో చూపించినట్లే కాలేజ్ అయిపోయాక నేను జీరోనయ్యాను. కానీ నాలో టాలెంట్ ఉందని నమ్మి నా స్నేహితులు నాకు అండగా నిలబడ్డారు. వాళ్లు కష్టపడి సంపాదించిన జీతంలో నుంచి ఒక్కొక్కరూ రూ.2000 చొప్పున నాకు ఇచ్చేవారు. ఆ డబ్బుతో షార్ట్ ఫిలింస్ తీశాను. ఒకసారి ఏదో పోటీలో నేను రెండో రౌండ్‌కు సెలక్ట్ అయ్యాను. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రోత్సాహంతో..కానీ ఫ్రెండ్స్‌ను మళ్లీ డబ్బులడగాలంటే నాకు సిగ్గుగా అనిపించింది. ఆ సమయంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఇగీ.. అతడి తల్లికి ఫోన్ చేసి అశ్వత్ పోటీలో ముందుకు వెళ్లడానికి రూ.2 వేలిస్తున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పాడు. అది నేనెన్నటికీ మర్చిపోలేను. 8 షార్ట్ ఫిలింస్ తీశా.. నా ప్రతి అడుగులో వారు తోడున్నారు. నా ఫోన్ పగిలిపోయినప్పుడు బాలాజీ ఫోన్ కొనిచ్చాడు. ఇంత మంచి మిత్రులు నా జీవితంలో ఉన్నారు. మా గ్యాంగ్‌లో నేనే మిగిలా..నేను అందుకున్న విజయం వారి సొంతం. థాంక్యూ బాయ్స్.. ఈ రోజు మా గ్యాంగ్‌లో పంబు పెళ్లి జరిగింది. అంటే ఈ గ్యాంగ్‌లో సింగిల్‌గా మిగిలింది నేనొక్కడినే' అని రాసుకొచ్చాడు. ఇందుకు తన ఫ్రెండ్స్‌తో దిగిన పాత ఫోటోలను జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. ఇంత మంచి స్నేహితులు దొరకడం నీ అదృష్టం.. నువ్వు జీవితంలో ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి అని కామెంట్లు చేస్తున్నారు. ‘Return of The Dragon ‘ releasing in HINDI from MARCH 14 . Always wanted my movies to be watched by the whole of India, and here is our first step . Sharukh @iamsrk sir , Salman @BeingSalmanKhan sir , Aamir sir संभल जाओ, मैं आ रहा हूँ! 😂😂😂😂😂😂Link. :… pic.twitter.com/Lg99OWYIFn— Pradeep Ranganathan (@pradeeponelife) March 8, 2025Important post. Sometimes we fail to thank the most important people in our life because they are our friends and they won’t take it wrong !The bachelor room life that u see in ‘Dragon’ is almost 90 percent recreated from my life ! Not just the characters but also the place !… pic.twitter.com/k2Jzc64SFa— Ashwath Marimuthu (@Dir_Ashwath) March 8, 2025చదవండి: కన్నడ స్టార్ యశ్‌తో విభేదాలు.. స్పందించిన సోదరి


