ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రాల్లో దురంధర్ ముందు వరుసలో ఉంటుంది. దంగల్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాల సరసన చేరింది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా మెప్పించారు. సారా అర్జున్ హీరోయిన్‌గా కనిపించింది.
తాజాగా ఈ మూవీ మరో రికార్డ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోన్న దురంధర్ అరుదైన రికార్డ్ సాధించింది. ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. కాగా.. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. ధురందర్ పార్ట్-1 డిసెంబర్ 2025లో థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో సీక్వెల్ దురంధర్ ది రివెంజ్ రిలీజైంది.


