దగ్గుబాటి సోదరులపై కేసును కొట్టేయలేం: హైకోర్టు | Telangana HC Setback for Venkatesh and Rana in Deccan Kitchen Dispute | Sakshi
Sakshi News home page

దగ్గుబాటి సోదరులపై కేసును కొట్టేయలేం: హైకోర్టు

Aug 7 2026 11:17 AM | Updated on Aug 7 2026 11:50 AM

Telangana HC Setback for Venkatesh and Rana in Deccan Kitchen Dispute

దగ్గుబాటి కుటుంబానికి హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్‌లోని ఓ ఆస్తి లీజు వివాదానికి సంబంధించి దగ్గుబాటి సురేశ్‌బాబు, వెంకటేశ్‌లపై నమోదైన క్రిమినల్‌ కేసును కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో క్రిమినల్‌ నేరాలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నందున విచారణను ఈ దశలో నిలిపేయడం సరికాదంటూ దగ్గుబాటి సోదరులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. 

హైదరాబాద్‌లోని ఓ ఆస్తిని డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చాక తెలెత్తిన వివాదంలో దగ్గుబాటి సోదరులపై దాఖలైన కేసును నాంపల్లి కోర్టు విచారిస్తోంది. లీజు ప్రాంగణంలోకి చొరబడి వస్తువులు ఎత్తుకెళ్లడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదుదారు నందకుమార్‌ ఆరోపించారు. ఈ కేసును కొట్టేయాలంటూ సురేశ్‌బాబు, వెంకటేశ్‌లు హైకోర్టును ఆ​శ్రయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement