సొంత భాష మలయాళంలో తొలుత నటిగా ఎంట్రీ ఇచ్చి ఆపై కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లో సినిమాలు చేసిన కీర్తి సురేశ్.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్, కెరీర్ పరంగా బిజీగా ఉంది. రీసెంట్ టైంలో నాని 'ప్యారడైజ్'లో ఐటమ్ సాంగ్ చేసిందని రూమర్స్ వచ్చాయి. అలానే విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన'లోనూ హీరోయిన్‌గా చేస్తోంది. ఇవలా ఉండగానే ఓ తమిళ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసింది.
(ఇదీ చదవండి: దీనికంటే ఇంకేం ఆశించగలం.. ఉదయనిధి అరెస్ట్‌పై విశాల్)
తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కొత్త సినిమాని ప్రకటించారు. డోరోతీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఓ టీజర్ రిలీజ్ చేశారు. సనత్, రిషీకాంత్ ప్రధాన పాత్రలు చేస్తుండగా.. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇదో పీరియాడిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇళయరాజా సంగీతమందిస్తుండగా ఈ చిత్రాన్ని వచ్చే నెల అంటే సెప్టెంబరు 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)


