హీరోయిన్‌తో తెలుగు హీరో డేటింగ్? | Harshvardhan Rane and Sanjeeda Shaikh Dating Rumours | Sakshi
Sakshi News home page

Harshvardhan Rane: వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారా? మరి ఈ ఫొటోలు

Aug 7 2026 1:28 PM | Updated on Aug 7 2026 1:32 PM

Harshvardhan Rane and Sanjeeda Shaikh Dating Rumours

రాజమండ్రిలో పుట్టి తెలుగులోనే వరస సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయిన హర్షవర్ధన్ రాణే.. తర్వాత హిందీలోనే హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఫిదా, అవును, అవును 2, ప్రేమ ఇష్క్ కాదల్ తదితర చిత్రాల్లో నటించాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం బాలీవుడ్‌లోనే వరస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నాడు.  ఇకపోతే ఓ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నాడనే రూమర్స్ మళ్లీ వినిపించాయి. సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ పోస్ట్ చేసిన ఫొటోలే దీనికి కారణం.

(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ)

హర్షవర్ధన్ రాణే, హీరోయిన్ సంజీదా షేక్ కలిసి పుణె సమీపంలోని పాన్షెట్‌లో వెకేషన్ ఎంజాయ్ చేసినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్‌లో ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరూ ఒకే చోట ఉన్నప్పటికీ ఫొటోలను వేర్వేరు యాంగిల్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ కలిసే ట్రిప్‌కు వెళ్లారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

వీళ్లిద్దరి గురించి డేటింగ్ వార్తలు రావడం ఇదేం మొదటిసారి కాదు. 2023లో గిర్ అటవీ ప్రాంతంలో ఇద్దరూ ఒకేచోట ఉన్నట్లుగా అనిపించే ఫొటోలను షేర్ చేయడంతో ఇదంతా మొదలైంది. 2020లో రిలీజైన 'తైష్' మూవీలో కలిసి నటించారు. 2021లో వచ్చిన థ్రిల్లర్ మూవీ 'కున్ ఫయా కున్'లో మరోసారి జంటగా కనిపించారు. హర్షవర్ధన్ ఇప్పటికే సింగిలే కానీ సంజీదా షేక్ మాత్రం ఆమిర్ అలీని పెళ్లి చేసుకుని 2021లో విడాకులు తీసుకుంది. ఓ కూతురు ఉండగా.. ఆమె ఇప్పుడు సంజీదా దగ్గరే ఉంటున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement