breaking news
Sanjeeda Shaikh
-
హీరోయిన్‌తో తెలుగు హీరో డేటింగ్?
రాజమండ్రిలో పుట్టి తెలుగులోనే వరస సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయిన హర్షవర్ధన్ రాణే.. తర్వాత హిందీలోనే హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఫిదా, అవును, అవును 2, ప్రేమ ఇష్క్ కాదల్ తదితర చిత్రాల్లో నటించాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం బాలీవుడ్లోనే వరస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇకపోతే ఓ హీరోయిన్‌తో డేటింగ్లో ఉన్నాడనే రూమర్స్ మళ్లీ వినిపించాయి. సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ పోస్ట్ చేసిన ఫొటోలే దీనికి కారణం.(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ)హర్షవర్ధన్ రాణే, హీరోయిన్ సంజీదా షేక్ కలిసి పుణె సమీపంలోని పాన్షెట్లో వెకేషన్ ఎంజాయ్ చేసినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ బాలీవుడ్లో ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరూ ఒకే చోట ఉన్నప్పటికీ ఫొటోలను వేర్వేరు యాంగిల్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ కలిసే ట్రిప్‌కు వెళ్లారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.వీళ్లిద్దరి గురించి డేటింగ్ వార్తలు రావడం ఇదేం మొదటిసారి కాదు. 2023లో గిర్ అటవీ ప్రాంతంలో ఇద్దరూ ఒకేచోట ఉన్నట్లుగా అనిపించే ఫొటోలను షేర్ చేయడంతో ఇదంతా మొదలైంది. 2020లో రిలీజైన 'తైష్' మూవీలో కలిసి నటించారు. 2021లో వచ్చిన థ్రిల్లర్ మూవీ 'కున్ ఫయా కున్'లో మరోసారి జంటగా కనిపించారు. హర్షవర్ధన్ ఇప్పటికే సింగిలే కానీ సంజీదా షేక్ మాత్రం ఆమిర్ అలీని పెళ్లి చేసుకుని 2021లో విడాకులు తీసుకుంది. ఓ కూతురు ఉండగా.. ఆమె ఇప్పుడు సంజీదా దగ్గరే ఉంటున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా) View this post on Instagram A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda) View this post on Instagram A post shared by Harshvardhan Rane (@harshvardhanrane) -
ఎంబ్రాయిడరీ చీరలో సంజీదా.. చూస్తే ఫిదా అయిపోతారు! (ఫొటోలు)
-
నటి సంజీదా షేక్‌పై గృహహింస కేసు
సాక్షి, న్యూఢిల్లీ: హిందీ సీరియల్ పాపులర్ నటి సంజీదా షేక్‌పై గృహహింస కేసు నమోదయ్యింది. సంజీదా, ఆమె కుటుంబ సభ్యులు తనని హింసించారంటూ ఆమె ఆడపడుచు జకేరాబాను జకీర్ హుస్సేన్ బగ్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ యేడాది మే 27న తన తండ్రితో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో అకారణంగా సంజీదా ఫ్యామిలీ మొత్తం తనపై దాడి చేశారని జకేరాబాను తెలిపింది. ఘటన తర్వాత తన పుట్టింటికి వెళ్లిపోయిందని, తల్లిదండ్రులు తనని ఆస్పత్రిలో చేర్పించారని, చివరకు కోలుకోవటంతో షర్కేజ్ ప్రాంత పోలీసులను ఆశ్రయించానని జకేరా చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఆరోపణలపై సంజీద నోరు మెదపకపోగా, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం స్పందించారు. ‘సంజీదా ఆ ఆరోజు ఇంట్లో లేనే లేదు. జకేరా చేస్తున్నవన్నీ ఆరోపణలే. తనకీ అత్తగారి ఇంట్లో ఉండటం ఇష్టం లేకనే ఇలా రచ్చ చేస్తోంది’ అని సంజీద తల్లి చెబుతున్నారు. మరోవైపు అహ్మదాబాద్ హైకోర్టు నటికి ఊరటనిచ్చింది. విచారణ పేరిట నటిని ఇబ్బంది పెట్టవద్దంటూ కోర్టు పోలీస్ శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. క్యా హోగా నిమ్మో కా సీరియల్ ద్వారా ఆరంగ్రేటం చేసిన సంజీద షేక్, నటుడు అమీర్ అలీని వివాహం చేసుకున్నారు. నాచ్ బలియే లాంటి పాపులర్ రియాలిటీ షోలతోపాటు పలు సీరియళ్లలోనూ ఆమె నటించారు. 32 ఏళ్ల సజీద ప్రస్తుతం లవ్ కా హై ఇంతెజార్ సీరియల్లో కామిని మాథుర్ పాత్ర లో నటిస్తోంది.


