‘రామాయణ’ ట్రైలర్‌కు పాక్‌ యూట్యూబర్ల ఫిదా.. | Ramayana Trailer Impresses Pakistani YouTubers: Praise VFX & Scale | Sakshi
Sakshi News home page

‘రామాయణ’ ట్రైలర్‌కు పాక్‌ యూట్యూబర్ల ఫిదా..

Aug 7 2026 5:02 PM | Updated on Aug 7 2026 5:09 PM

Ramayana Trailer Impresses Pakistani YouTubers

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ట్రైలర్‌పై పాకిస్థాన్‌కు చెందిన కొందరు యూట్యూబర్ల స్పందనలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రైలర్‌లోని భారీ విజువల్స్‌, వీఎఫ్‌ఎక్స్‌లపై ప్రశంసలు కురిపించారు. రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, యశ్‌ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపిస్తున్న ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు తమను ఆకట్టుకున్నాయని పాకిస్థానీ కంటెంట్‌ క్రియేటర్లు పేర్కొన్నారు.గతంలో విడుదలైన ‘రామాయణ’ ఫస్ట్‌ గ్లింప్స్‌తో పోలిస్తే తాజా వీఎఫ్‌ఎక్స్‌లో చాలా మార్పు కనిపిస్తోందని, ఈసారి విజువల్స్‌ మరింత మెరుగ్గా ఉన్నాయని తెలిపారు.
రూ.4 వేల కోట్లపై ..
‘రామాయణ’కు భారీగా రూ.4 వేల కోట్ల బడ్జెట్‌ ఖర్చవుతోందన్న ప్రచారంపై స్పందిస్తూ  సినిమా నిర్మాణానికి పెట్టుబడిదారులు ఉంటారని, ప్రేక్షకుల జేబులో నుంచి డబ్బు తీసుకుని సినిమా తీయడం లేదన్నారు. ‘రామాయణ’లో కనిపిస్తున్న  సాంకేతికత, నిర్మాణ విలువలు చూసి ఆశ్చర్యపోయామన్నారు. ఇంత భారీ చిత్రాన్ని రూపొందించడానికి భారత్‌, బాలీవుడ్‌కు ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎలా వస్తుందోనని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement