మా ఇంటి బంగారం రివ్యూ.. సమంత ఖాతాలో హిట్ పడిందా? | Samantha's Maa Inti Bangaaram Review and Rating In Telugu | Sakshi
Sakshi News home page

Maa Inti Bangaaram Review In Telugu: మా ఇంటి బంగారం రివ్యూ.. సమంత ఖాతాలో హిట్ పడిందా?

Jun 19 2026 12:07 PM | Updated on Jun 19 2026 12:19 PM

Samantha's Maa Inti Bangaaram Review and Rating In Telugu

టైటిల్: మా ఇంటి బంగారం

నటీనటులు: సమంత, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గౌతమి తదితరులు

దర్శకత్వం: నందిని రెడ్డి

నిర్మాణ సంస్థ: ట్రాలాలా పిక్చర్స్

మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్

విడుదల తేదీ: 19 జూన్ 2026

టాలీవుడ్ హీరోయిన్ సమంత లీడ్‌ రోల్‌లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో యాంకర్ శ్రీముఖి కీలక పాత్రలో కనిపించింది. అభిమానుల అంచనాల మధ్య జూన్ 19న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. సామ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.

సమంత 'మా ఇంటి బంగారం' మూవీ ‍HD స్టిల్స్ | Samantha Maa Inti Bangaaram Movie  HD Wallpaper | Sakshi

కథేంటంటే..

స్వర్ణ(సమంత) , అనిరుధ్ ప్రేమ వివాహం చేసుకుంటారు. ఇది అనిరుధ్ ఫ్యామిలీ కి  నచ్చకపోవడంతో కొన్నాలపాటు దూరంగా ఉంటారు. అయితే అనిరుద్ చెల్లెలు పెళ్లి ఫిక్స్ అవ్వడంతో స్వర్ణ, అనిరుద్ ఇంటికి తిరిగి వస్తారు.  సాంప్రదాయ కుటుంబం కావడంతో వారికి నచ్చేలా ఉండేందుకు స్వర్ణ ప్రయత్నిస్తుంది. అదే సమయంలో స్వర్ణ గురించి జైల్లో ఉన్న కరుణ (గుల్షన్ దేవయ్య) ఆరా తీస్తాడు. ఆమె కోసమే జైలు నుంచి తప్పించుకొని వస్తాడు. అసలు స్వర్ణకు జైల్లో ఉన్న కరుణకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్వర్ణ గతం ఏంటి? ఝాన్సీ ఎవరు ? కరుణ నుంచి తన ఫ్యామిలీకి ఆపద ఉందని తెలిసిన తర్వాత స్వర్ణ ఏం చేసింది? చివరకు తన ఫ్యామిలీని ఎలా రక్షించుకుంది? అన్నదే మిగతా కథ.

Samantha Maa Inti Bangaaram Movie HD Wallpaper8

ఎలా ఉందంటే..

ఓ బేబీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందిని రెడ్డి , సమంత కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో మా ఇంటి బంగారంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి . అయితే ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేదని చెప్పాలి. అలా అని తీసిపారేసే సినిమా ఏమి కాదు. ఓ బేబీ మాదిరే ఇది కూడా కుటుంబ నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్.

సమంత లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక సంప్రదాయ కుటుంబంలోకి కొత్త కోడలిగా అడుగుపెడుతుంది. ఇంట్లో జరిగే రోజువారీ ఫ్యామిలీ డ్రామా, శ్రీముఖితో వచ్చే సరదా సన్నివేశాలు, సున్నితమైన హాస్యంతో ఫస్టాఫ్ సాఫీగా సాగిపోతుంది. అయితే ఇంటర్వెల్ సమయంలో సమంత గతానికి సంబంధించిన వ్యక్తులు ఎంటర్ అవ్వడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.

అసలు సమంత ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌తో ఇంటర్వెల్ ట్విస్ట్ పడుతుంది. సెకండాఫ్‌లో ఆమె ఫ్లాష్‌బ్యాక్, గుల్షన్ దేవయ్య పాత్రతో ఆమెకు ఉన్న పరిచయం, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె చేసే పోరాటం చుట్టూ కథ నడుస్తుంది. ఫస్టాఫ్ కామెడీ సన్నివేశాలతో సరదాగా సాగిన సెకండాఫ్ మాత్రం కొంతమేర సాగదీసినట్లుగా అనిపిస్తుంది. దానికి తోడు విలన్ ట్రాక్ బలంగా లేకపోవడంతో చాలా సన్నివేశాలు అనవసరంగా పెట్టారన్న ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనం చాలావరకు అతడు సినిమాను గుర్తు చేస్తుంది. సెకండ్ హాఫ్ కథను ఇంకాస్త బలంగా రాసుకుని..  మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.

Samantha Maa Inti Bangaaram Movie HD Wallpaper19

ఎవరెలా చేశారంటే..

సమంత వన్ ఉమెన్ షో చూపించింది. ఈ మూవీలో కొత్త కోడలి పాత్రలో.. అలాగే యాక్షన్ సీక్వెన్స్‌లలో సమంత అద్భుతంగా నటించింది. శ్రీముఖి తన పాత్రలో ఒదిగిపోయింది. గుల్షన్ దేవయ్య మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం బాగుంది. బీజీఎం ఈ సినిమాకు ప్లస్. ఎడిటింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. 
 

Rating:
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement