ఇన్‌స్టా నుంచి సినిమాల్లోకి.. ఎవరయ్యా సమంత ఫ్రెండ్‌? | Maa Inti Bangaram Samantha Friend Artist Manjusha Full Details | Sakshi
Sakshi News home page

Maa Inti Bangaram: తొలి మూవీనే కానీ అదరగొట్టేసింది.. ఎవరీ అమ్మాయి?

Jun 20 2026 4:12 PM | Updated on Jun 20 2026 5:12 PM

Maa Inti Bangaram Samantha Friend Artist Manjusha Full Details

ఈ వీకెండ్ థియేటర్లలో రిలీజైన సినిమాల్లో సమంత 'మా ఇంటి బంగారం'కి పర్లేదనిపించే టాక్ వచ్చింది. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.13 కోట్లకు గ్రాస్ కలెక్షన్స్ సాధించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సరే ఈ విషయం పక్కనబెడితే మూవీలో సమంత అదరగొట్టేసినప్పటికీ ఈమె ఫ్రెండ్ కిరణ్మయి పాత్ర చేసిన నటి కూడా ఆకట్టుకుంది. 'లెట్స్ కమాన్' అంటూ అందరినీ నవ్విస్తోంది. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

(ఇదీ చదవండి:  సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ)

ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా నడుస్తోంది. ఇన్ స్టా, యూట్యూబ్‌లో తన ప్రతిభ చూపిస్తూ చాలామంది గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలానే 'మా ఇంటి బంగారం'లో సమంత స్నేహితురాలిగా మంజూష ముక్కవిల్లి అవకాశం దక్కించుకుంది. పాతతరం నటీమణులైన సూర్యకాంతం, ఛాయాదేవి, నిర్మలమ్మ రీల్స్ చేస్తూ ఇన్ స్టాలో గుర్తింపు మంజూష చాలానే తెచ్చుకుంది.

ఓ రోజు డైరెక్టర్ నందిని రెడ్డి అనుకోకుండా మంజూష రీల్ పడింది. దీంతో ఈమెని పిలిపించి ఆడిషన్ తీసుకుంది. మూడుసార్లు ఆడిషన్ చేసి సమంత ఫ్రెండ్ క్యారెక్టర్‌కి ఎంపిక చేసింది. నందిని రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రూవ్ చేసుకున్న మంజూష.. ఇప్పుడు పలువురు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది.

లాడ్జిలో ఉంటూ తెల్లవారుజామునే వంటలు చేసొచ్చి ఫ్రెండ్ సమంతకు రహస్యంగా చేరవేసి ఆమెను గట్టెక్కించే పాత్రలో మంజుష భలే నటించింది. ఓవైపు అమాయకంగా మరోవైపు గడుసుతనం ప్రదర్శించే సీన్స్‌లో ఈమె యాక్టింగ్ తెగ నవ్విస్తోంది. ఇదే తొలి సినిమా అయినప్పటికీ చాలా సహజంగా పాత్రలో సెట్ అయిపోయి, అనుభవమున్న నటిలా హావభావాలు పలికించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాద్‌లోనే ఉంటున్న ఈమెకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు పలకరిస్తాయేమో చూడాలి?

(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు ‍కలెక్షన్స్ ఎన్నికోట్లు?)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement