‘తాలిబన్‌ నేతకు డిన్నర్‌ ఇస్తారా?: అవమానంతో తలదించుకున్నట్లుంది’ | Hang My Head In Shame: Javed Akhtar | Sakshi
Sakshi News home page

‘తాలిబన్‌ నేతకు డిన్నర్‌ ఇస్తారా?: అవమానంతో తలదించుకున్నట్లుంది’

Oct 14 2025 5:55 PM | Updated on Oct 14 2025 7:28 PM

Hang My Head In Shame: Javed Akhtar

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్‌ ఏర్పాటైన సుమారు నాలుగేళ్ల తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి అమిర్‌ ఖాన్‌ ముత్తఖీ భారత్‌ పర్యటనపై ప్రముఖ కవి, రచయిత జావేద్‌ అక్తర్‌ విమర్శలు గుప్పించారు. ఒక తాలిబన్‌ నేతను భారత్‌కు ఆహ్వానించడమే కాదు.. డిన్నర్‌ కూడా ఇస్తారా? అవమానంతో తలదించుకున్నట్లైంది అంటూ మండిపడ్డారు.  

ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే మనం, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన తాలిబన్‌ నేతకు విందు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు.  అన్ని ఉగ్రవాద సంస్థలపై పోరాటం చేసే మనం, ఇలా వారిని ఆహ్వానించి ప్రత్యేక విందులు ఏర్పాటు చేయడమేంటని నిలదీశారు.

 

కాగా, ఆరు రోజుల భారత పర్యటనలో భాగంగా అమిర్‌ ఖాన్‌ ముత్తఖీ.. ఇటీవల ఢిల్లీలో అడుగుపెట్టారు. ఈ మేరకు భారత్‌ ప్రభుత్వ పెద్దల్ని కలుస్తూ తాము అఫ్గాన్‌ను ముందుకు నడిపిస్తున్న తీరును వివరించారు. అదే సమయంలో తమ దేశంలో ఉగ్రజాడలు లేకుండా చేశామని కూడా చెప్పుకొచ్చారు. భారత్‌ గడ్డపై నుంచే పాక్‌ ఉగ్రవాదాన్ని వీడాల్సిందేనని వార్నింగ్‌ ఇచ్చారు. అయితే ఇలా ముత్తఖీ హెచ్చరించిన గంటల వ్యవధిలోనే పాకిస్తాన్‌-అఫ్గాన్‌ల మధ్య పోరు రాజుకుంది. 

తెహ్రీక్‌–ఇ–తాలిబాన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) సంస్థ స్థావరమే లక్ష్యంగా పాకిస్తాన్‌ జరిపిన దాడులు చివరకు తాలిబాన్, పాక్‌ మధ్య పోరును మరింత ఉధృతం చేశాయి. పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం సైతం ఇరు దేశాల పరస్పర దాడుల పర్వం కొనసాగింది. శత్రుదేశానికి భారీ నష్టం వాటిల్లజేశామని అటు అఫ్గానిస్తాన్, ఇటు పాకిస్తాన్‌ ప్రకటించుకున్నాయి. 

ఇదీ చదవండి:
అంతా మాలా ఉండండి.. ఉగ్రవాదాన్ని తరమండి: అఫ్గాన్‌ మంత్రి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement