
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి మవ్లావీ అమీర్ ఖాన్ ముత్తాకీ.. పాకిస్తాన్‌కు సందేశంతో కూడిన వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌ను పరోక్షంగా హెచ్చరించారు. ముత్తాకీ. తాము అధికారం చేపట్టిన తర్వాత అఫ్గాన్‌లో ఒక ఉగ్రవాది పురుగు కూడా చొరబడలేదన్నారు ముత్తాకీ.
తమ దేశం తరహాలోనే ప్రతీ దేశం కూడా ఉగ్రవాదంపై పోరును సాగించాలనే సూచించారు. ఈ మేరకు పాకిస్తాన్‌కు భారత్ గడ్డపై నుంచే వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి దూరంగా ఉండటం మంచిదని హెచ్చరించారు. గత నాలుగేళ్లుగా అఫ్గాన్‌లో ఉగ్రవాదం అనే ఛాయలే లేవని, అందుకు తాము అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు.
అంతకుముంద లష్కరే తోయిబా, జైషీ మహ్మద్ ఉగ్రవాద సంస్థలు తమ గడ్డ నుంచి కార్యకలాపాలు సాగించినా తాము అధికారం చేపట్టిన తర్వాత ఆ పప్పులు ఉడకలేదన్నారు. ఏ దేశంలోనైనా శాంతి నెలకొనాలంటే ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని పాక్‌కు సూచించారు. ఇది పాకిస్తాన్ ఆచరిస్త వారికి మంచిదంటూ తన సందేశంలో పేర్కొన్నారు.
తాలిబన్లు అఫ్గాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ దేశం నుంచి ఒక దౌత్యవేత్త భారత్‌కు రావడం ఇదే తొలిసారి. నిన్న(అక్టోబర్9వ తేదీ) భారత్‌లో అడుగుపెట్టారు ముత్తాకీ. తన భారత పర్యటనలో జై శంకర్, అజిత్ ధోవల్‌తో సమావేశం కానున్నారు ముత్తాకీ.
ఇది చదవండి
నోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర?.. ట్రంప్ సంచలన ఆరోపణ!