NEET paper leak case: ‘మాస్టర్‌మైండ్‌’ అరెస్ట్‌ | NEET Paper leak Case CBI Arrests Mastermind | Sakshi
Sakshi News home page

NEET paper leak case: ‘మాస్టర్‌మైండ్‌’ అరెస్ట్‌

Aug 6 2024 9:38 AM | Updated on Aug 6 2024 10:06 AM

NEET Paper leak Case CBI Arrests Mastermind

నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ముందడుగు వేసింది. తాజాగా ఈ కేసులో ఒడిశాకు చెందిన సుశాంత్ కుమార్ మొహంతిని దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ  ఉదంతంలో సుశాంత్‌ ప్రధాన సూత్రధారి అని సమాచారం. ప్రస్తుతం అతనిని సీబీఐ ఐదు రోజుల పాటు రిమాండ్‌కు తరలించింది.

ఈ కేసులో ఇప్పటి వరకు 42 మందిని అరెస్టు చేశారు. ఆగస్టు 4న నీట్ పేపర్ లీక్ కేసులో సాల్వర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. సాల్వర్ సందీప్ రాజస్థాన్‌లోని భిల్వారాలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. సందీప్‌ను పట్నాలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 5 రోజుల రిమాండ్‌కు తరలించారు.

నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ ఆగస్టు ఒకటిన చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 13 మంది పేర్లను నమోదు చేసింది. ఇందులో నలుగురు అభ్యర్థులు, ఒక జూనియర్ ఇంజనీర్, ఇద్దరు కింగ్‌పిన్‌ల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు కూడా ఉన్నాయని సీబీఐ వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement