ఢిల్లీలో వాంగ్‌చుక్‌ నిరాహార దీక్ష | Sonam Wangchuk has begun an indefinite hunger strike at Jantar Mantar | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో వాంగ్‌చుక్‌ నిరాహార దీక్ష

Jun 29 2026 5:14 AM | Updated on Jun 29 2026 5:14 AM

Sonam Wangchuk has begun an indefinite hunger strike at Jantar Mantar

న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ ముందుగా ప్రకటించిన విధంగానే ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. నీట్‌ పేపర్‌ లీకేజీకి కేంద్రమే బాధ్యత వహించాలని, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. వాంగ్‌చుక్‌ దీక్షకు కాక్రోచ్‌ జనతా పార్టీ మద్దతు తెలిపింది. ఆ పార్టీ కూడా 20వ తేదీ నుంచి ఇదే వేదికపై నీట్‌ పేపర్‌ లీకేజీపై ఆందోళన కొనసాగిస్తుండటం తెల్సిందే. 

దీక్ష ప్రారంభించడానికి ముందుగా వాంగ్‌చుక్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేతో కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం జంతర్‌మంతర్‌లో నిరసన స్థలిలో అంతా కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. వందల సంఖ్యలో హాజరైన విద్యార్థులు, యువకులు తరలివచ్చి వాంగ్‌చుక్‌ దీక్షకు మద్దతు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement