చర్చలకు సిద్ధం  | Jharkhand protests intensify as Governor meets Soren | Sakshi
Sakshi News home page

చర్చలకు సిద్ధం 

Aug 7 2026 6:22 AM | Updated on Aug 7 2026 6:22 AM

Jharkhand protests intensify as Governor meets Soren

ప్రభుత్వంతో చర్చించనున్న 11 మంది సభ్యుల ప్రతినిధి బృందం 

పదమూడో రోజుకు చేరిన రాంచీలో పరీక్షార్థుల ఉద్యమం

రాంచీ: జార్ఖండ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన పోటీ పరీక్షల్లో అక్రమాలకు చరమగీతం పాడాలని, సంస్కరణల బాటలో హేమంత్‌ సోరెన్‌ సర్కార్‌ పయనించాలన్న డిమాండ్లతో 13 రోజులుగా ఆందోళన చేస్తున్న పరీక్షార్థులు, విద్యార్థులు ఎట్టకేలకు ప్రభుత్వంతో చర్చలకు ముందుకొచ్చారు. త్వరలో ప్రభుత్వంతో జరిగే చర్చల కోసం 11 మందితో ప్రతినిధి బృందాన్ని ఏర్పాటుచేసినట్లు ఉద్యమనేతలు గురువారం ప్రకటించారు. 

జార్ఖండ్‌ శాసనసభ వర్షాకాల సమావేశాలు మొదలైన తొలిరోజే సభలో విపక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యతిరేక, ఉద్యమ అనుకూల నినాదాలతో హోరెత్తించిన వేళ ఉద్యమనేతలు చర్చలకు ముందుకురావడం గమనార్హం. ఎనిమిది మంది విద్యార్థులు, ఇద్దరు నిపుణులైన పాత్రికేయుడు, ఒక న్యాయవాదితో ప్రతినిధి బృందాన్ని ఏర్పాటుచేశామని ఉద్యమనేతలు తెలిపారు. రాంచీలోని జైపాల్‌సింగ్‌ ముండా స్టేడియంలో ‘జేపీఎస్‌సీ–జేఎస్‌ఎస్‌సీ రిఫారŠమ్స్‌ మంచ్‌’పేరిట జరుగుతున్న ఉద్యమం గత కొన్నేళ్లలో జార్ఖండ్‌లో ఎన్నడూలేనంతటి అతిపెద్ద ఉద్యమంగా రూపాంతరం చెందిన విషయం విదితమే. 

ఐదుగురు సభ్యుల ప్రభుత్వ ప్యానెల్‌తో గురువారమే చర్చలు ఆరంభంకానున్నట్లు తెలుస్తోంది. 14వ జేపీఎస్‌సీ పరీక్షను రద్దుచేయాలని, జేఎస్‌ఎస్‌సీలో సంస్కరణలు తేవాలని, గత పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ లేదా ఇతర రాష్ట్రాల హైకోర్టు రిటైర్డ్‌ జడ్జీల నేతృత్వంలో స్వతంత్య్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు తమ డిమాండ్లను ప్రభుత్వ బృందం ఎదుట విన్పించనున్నారు. జేపీఎస్‌సీతోపాటు జేఎస్‌ఎస్‌సీలో సంస్కరణలు తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో విపక్ష ఎమ్మెల్యేలు నిరసన ప్రదర్శన చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర లేచి సమస్యల్ని పరిష్కరించాలి అని రాసి ఉన్న మాస్‌్కలు ధరించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. మరోవైపు 7, 10 తేదీల్లో అసెంబ్లీ వద్ద ధర్నాకు విద్యార్థులు పిలుపునిచి్చన నేపథ్యంలో అసెంబ్లీ సమీపంలో గుమిగూడకుండా ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్‌ యంత్రాంగం తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement