ఎవరు ఉద్యమం చేసినా కేసీఆర్‌ భయపడుతున్నారు: బండి సంజయ్‌ | BJP Bandi Sanjay Serious Comments On KTR And TS Government | Sakshi
Sakshi News home page

ఎవరు ఉద్యమం చేసినా కేసీఆర్‌ భయపడుతున్నారు: బండి సంజయ్‌

May 11 2023 8:38 PM | Updated on May 11 2023 8:54 PM

BJP Bandi Sanjay Serious Comments On KTR And TS Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. మంత్రి కేటీఆర్‌ 30 లక్షల మంది భవిష్యత్తును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ రోజుకో మంత్రి అవతారం ఎత్తుతారంటూ ఎద్దేవా చేశారు. 

కాగా, బండి సంజయ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులు ఏం పాపం చేశారు?. పంచాయతీ కార్యదర్శులు కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. రెగ్యులర్‌ చేయాలని పోరాడుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు ఉద్యమం ఆపొద్దు, మీకు బీజేపీ అండగా ఉంటుంది. ఎవరు ఉద్యమం చేసినా కేసీఆర్‌ భయపడుతున్నారు.

కేటీఆర్‌ 30 లక్షల మంది భవిష్యత్తును నాశనం చేశారు. కేటీఆర్‌ను వెంటనే బర్తరఫ్‌ చేయాలి. మళ్లీ టీఆర్‌ఎస్‌ గెలుస్తుంది అనుకుంటే బీఆర్‌ఎస్‌ ఎందుకు పెట్టారు?. తెలంగాణలో అన్నీ స్కాములే. ఈ ప్రభుత్వానికి దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసు. తెలంగాణలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు ఇవ్వలేదు. ప్రధాని మోదీని తిట్టే అర్హత మీకు లేదు. మోదీ ప్రభుత్వం 10లక్షల ఉద్యోగాలకు పరీక్ష పెట్టినా ఎక్కడా స్కాం జరగలేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రానుంది. పేదలకు ఉచిత విద్యుత్‌ ఇచ్చే బాధ్యత బీజేపీది. నిధులు ఇచ్చి, తెలంగాణను అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: స్టేజీపైనే కొట్టుకున్నంత పనిచేసిన ఎమ్మెల్యేలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement