హైదరాబాద్: సింగరేణి ఫైల్స్ తారుమారయ్యే చాన్స్ ఉందన్నారు కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్,. సింగరేణలో కొంతమంది అధికారులు బీఆర్‌ఎస్ కంట్రోల్‌లో ఉన్నారని, సింగరేణికి సంబంధించిన ఫైల్స్‌ను వెంటనే సీజ్ చేయాలన్నారు. సింగరేణి విషయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు తోడు దొంగలు మాదిరి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
‘రెండు పార్టీలు సింగరేణిని ఏటీఎమ్‌గా మార్చుకున్నాయి. అధికారిని బదిలీ చేయాలని కోరినా అప్పటి ముఖ్యమంత్రి చేయలేదు. సింగరేణి వల్ల పాలకులకు, కాంట్రాక్టర్లకు లాభం జరుగుతోంది. సింగరేణికి మాత్రం నష్టం జరుగుతుంది. సింగరేణిలో కేసిఆర్ ఫ్యామిలీ అంతా దోచుకుంది. సింగరేణి కార్మికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్లు ఉంది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను కార్మికులు చీదరించుకుంటాయి. సింగరేణిని కాపాడేది కేవలం కేంద్ర ప్రభుత్వమే అని కార్మికులు అంటున్నారు. సింగరేణి నష్టాలకు కారకులు ఎవరు? అసలు దొంగలు ఎవరు ?, క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి కమిటీ వేశారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడదాం’ అని పేర్కొన్నారు.


