సాక్షి, హైదరాబాద్: స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని కౌంటర్ దాఖలు చేసిన దానం.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్‌ను కొట్టి వేయాలని విన్నవించారు.
‘‘నేను బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. బీఆర్‌ఎస్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు నాకు సమాచారం లేదు. నేను 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లా. కాంగ్రెస్ పార్టీకి సమావేశానికి నేను వ్యక్తిగత హోదాలో వెళ్లాను. మీడియా కథనాల ఆధారంగా నేను పార్టీ మారినట్లు బీఆర్‌ఎస్ భావిస్తోంది’’ అని దానం నాగేందర్ అన్నారు.


