ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్‌.. పేపర్‌ లీకేజీలపై రాహుల్‌ ట్వీట్‌ | Examination Paper Leaks A Systematic Failure: Rahul Gandhi Attacks Bjp | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్‌.. పేపర్‌ లీకేజీలపై రాహుల్‌ ట్వీట్‌

Mar 13 2025 4:14 PM | Updated on Mar 13 2025 4:23 PM

Examination Paper Leaks A Systematic Failure: Rahul Gandhi Attacks Bjp

ప్రశ్నాపత్రాల లీక్‌లపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.

ఢిల్లీ: ప్రశ్నాపత్రాల లీకేజీలను వ్యవస్థాగత వైఫల్యంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన ఎక్స్‌ వేదికగా.. లీక్‌ల కారణంగా కష్టపడి చదివే ఎంతో మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని.. దీనిపై పోరాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విభేదాలు పక్కన పెట్టి కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు.

‘ప్రశ్నాపత్రాల లీకులతో ఆరు రాష్ట్రాల్లోని 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ ప్రమాదంలో పడిందన్న రాహుల్‌.. వీటి కారణంగా కష్టపడి చదివే విద్యార్థులతో  పాటు వారి కుటుంబాలు కూడా ఒత్తిడికి గురవుతున్నాయన్నారు. వారి కష్టానికి తగిన ఫలితం అందడం లేదన్నారు. దీంతో కష్టపడి పనిచేయడం కంటే నిజాయితీగా లేకపోవడమే మంచిదనే తప్పుడు సంకేతాలు భవిష్యత్‌ తరాలకు వెళ్తుందంటూ అభిప్రాయవ్యక్తం చేసిన రాహుల్‌.. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు.

‘‘ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం లీకులను అడ్డుకోలేకపోయింది. ఇది వారి వైఫల్యానికి నిదర్శనం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విభేదాలు పక్కనబెట్టి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే వీటిని అరికట్టగలం. ఈ పరీక్షలు మన పిల్లల హక్కు. దాన్ని ఎలాగైనా రక్షించాలి’  అంటూ రాహుల్ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement