ఢిల్లీ: నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘నేను ఇకపై పోటీ పరీక్షలు రాయను అంటూ లఖింపూర్ ఖేరీకి చెందిన 21 ఏళ్ల హృతిక్ మిశ్రా పలికిన చివరి మాటలు ఇవి. మూడోసారి నీట్ పరీక్ష రాస్తున్న ఆ విద్యార్థి పరీక్ష రద్దు కావడంతో తీవ్రంగా కుంగిపోయాడు. గోవాలో కూడా నీట్ పరీక్ష రాసిన ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పిల్లలు పరీక్ష చేతిలో ఓడిపోలేదు.. అవినీతి వ్యవస్థ చేతిలో హతమయ్యారు. ఇది ఆత్మహత్య కాదు.. వ్యవస్థ చేసిన హత్య’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
‘‘2015 నుండి 2026 వరకు 148 పరీక్షల కుంభకోణాలు జరిగాయి. 87 పరీక్షలు రద్దు.. 9 కోట్ల మంది పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడింది. 148 కుంభకోణాలలో, కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే శిక్ష పడింది. సీబీఐ 17 కేసులు, ఈడీ 11 కేసులు తీసుకున్నాయి. ఎవరికీ శిక్ష పడలేదు. ఒక్క నీట్, ఏఐపీఎంటీ, ఇతర వైద్య పరీక్షలలోనే 15 కుంభకోణాలు జరిగాయి. అత్యంత సిగ్గుచేటైన విషయం ఏమిటంటే ఈ కుంభకోణాలకు బాధ్యులైన ఒక్క అధికారి గానీ, మంత్రి గానీ రాజీనామా చేయలేదు. వారిని తొలగించి, ఆ తర్వాత రహస్యంగా ఉన్నత పదవులలో తిరిగి నియమిస్తున్నారు’’ అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ నిలదీశారు.
‘‘మోసానికి సహకరించేవారికి బహుమతులు లభిస్తుండగా.. పరీక్షలు రాసే పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. మోదీ జీ.. మీలో జవాబుదారీతనం మేల్కొనడానికి ఇంకా ఎంతమంది హృతిక్‌లు కావాలి?. విద్యార్థుల బాధ నా బాధ. విద్యార్ధుల కష్టం నా కష్టం. విద్యార్ధుల భవిష్యత్తును దొంగిలించిన వారు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఎంత కాలం పట్టినా సరే.. ఎవరినీ వదిలిపెట్టం.. ఇది నా వాగ్దానం. ఈ యుద్ధాన్ని మనం కలిసి పోరాడదాం.. మనం గెలుస్తాం’’ అంటూ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.
“अब नहीं देनी प्रतियोगी परीक्षा।”
लखीमपुर खीरी के 21 साल के ऋतिक मिश्रा के ये आख़िरी शब्द थे। तीसरी बार NEET देने वाला यह बच्चा, परीक्षा रद्द होते ही टूट गया।
गोवा में भी एक NEET अभ्यर्थी ने जान दे दी।
ये बच्चे परीक्षा से नहीं हारे, इन्हें एक भ्रष्ट तंत्र ने मारा है।
यह…— Rahul Gandhi (@RahulGandhi) May 15, 2026


