ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే | Cockroach Janta Party Seeks Dharmendra Pradhan Resignation Over NEET Row, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే

May 23 2026 5:14 AM | Updated on May 23 2026 10:09 AM

Cockroach Janta Party seeks Dharmendra Pradhan resignation over NEET row

విద్యా వ్యవస్థల్లో జవాబుదారీతనం ఉండాలి  

మా ఆన్‌లైన్‌ పిటిషన్‌కు మద్దతివ్వండి  

ప్రజలకు కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే వినతి

న్యూఢిల్లీ: నీట్‌(యూజీ)–2026 పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే రాజీనామా చేయాలని కాక్రోచ్‌ జనతా పారీ్ట(సీజేపీ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం సోషల్‌ మీడియాలో పోరాటం ఆరంభించింది. ఆ పార్టీ ‘ఎక్స్‌’ఖాతాలను ప్రభుత్వం నిలిపివేయడంతో ‘కాక్రోచెస్‌ నెవర్‌ డై’అనే ట్యాగ్‌లైన్‌తో ‘కాక్రోచ్‌ ఈజ్‌ బ్యాక్‌’పేరిట కొత్త ఖాతాను సృష్టించుకుంది. 

ఇదే ఖాతా నుంచి పోస్టులు చే స్తోంది. ఇన్‌స్టా్రగామ్‌లోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. విద్యా రంగంలో కేంద్రం దారుణంగా విఫలమైందని, పరీక్షలు సైతం సక్రమంగా నిర్వహించలేకపోతోందని సీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ధర్మేంద్ర ప్రధాన్‌ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆన్‌లైన్‌లో పెట్టిన పిటిషన్‌కు మద్దతు ఇవ్వాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే కోరారు. తాజాగా ఒక వీడియో సందేశం పోస్టుచేశారు.

 ‘‘బొద్దింకల్లారా.. ఎలా ఉన్నారు? ఇంటర్నెట్‌లో మీరంతా బాగా రాణిస్తున్నారని అందరూ అంటున్నారు. కానీ ఇప్పుడు నిజమైన పని చేయాల్సిన సమయం వచ్చింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఈ రోజు ఆన్‌లైన్‌లో ఒక పిటిషన్‌ను ప్రారంభిస్తున్నాం. దీనికి అందరూ మద్దతివ్వాలి’’అనికోరారు. విద్యా వ్యవస్థలోని వైఫల్యాలు విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. 

అందుకే జవాబుదారీతనం ఉండాలన్నారు. అందుకు సమయం వచ్చిందన్నారు. 22 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినడానికి, నీట్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి వ్యవస్థే కారణమని ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందేనని అభిజిత్‌ దీప్కే తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తనకు బెదిరింపులు కూడా వచ్చాయని పేర్కొన్నారు. చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని చెప్పారు.

దీప్కే భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన  
కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే భద్రతపై ఆయన తల్లిదండ్రులు భగవాన్, అనితా దీప్కే ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడి ప్రాణాలకు ఎవరైనా ముప్పు తలపెట్టే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. ఆ పార్టీకి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పార్టీ ఎక్స్‌ ఖాతాను ప్రభుత్వం నిలిపివేసింది. మరోవైపు అభిజిత్‌కు బెదిరింపులు సైతం వస్తున్నట్లు తెలుస్తోంది.

 తమ కుమారుడు ఇబ్బందుల్లో పడతాడేమో లేక అరెస్టును కూడా ఎదుర్కొంటాడేమోనన్న భయంతో తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. అభిజిత్‌కు ఆమ్‌ ఆద్మీ పారీ్టతో సంబంధాలున్నాయి. అతడి తల్లిదండ్రులు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో నివసిస్తున్నారు. తమ బిడ్డ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని వారు చెప్పారు. అతడి భద్రత పట్ల ఆందోళన చెందుతున్నామని, నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నామని వెల్లడించారు. ఇంటికి తిరిగిరావాలని అభిజిత్‌ను కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement