సీబీఐతో విచారించాలి | YSR Congress Party and Students Protest Over DSC Paper Leak in andhra pradesh | Sakshi
Sakshi News home page

సీబీఐతో విచారించాలి

May 30 2026 6:13 AM | Updated on May 30 2026 6:13 AM

YSR Congress Party and Students Protest Over DSC Paper Leak in andhra pradesh

శ్రీకాకుళంలో ధర్నా చేస్తున్న ధర్మాన కృష్ణదాసు, వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి నాయకులు

విద్యామంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలి

దగా డీఎస్సీపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనల వెల్లువ

వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు

లోకేశ్‌కు ఉద్యోగం.. నిరుద్యోగులకు శఠగోపం అంటూ మండిపాటు

డీఎస్సీ అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్‌

సాక్షి, అమరావతి, సాక్షి నెట్‌వర్క్‌: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కారు దగా చేసిందని టీచర్‌ పోస్టుల అభ్యర్థులు, నిరుద్యోగులు భగ్గుమన్నారు. డీఎస్సీ అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ 2025­లో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యార్థి పోరుకు భారీ స్పందన వచి్చంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరుద్యోగులు, టీచర్‌ అభ్యర్థులు వేలాదిగా తరలివచ్చి చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. 

డీఎస్సీలో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలు, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ నేతలు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్‌ కోటా దుర్వినియోగం, అర్హతలేని వారికి ఉద్యోగాల కేటాయింపు, పేపర్‌ లీకేజీ ఆరోపణలు, ఫేక్‌ సరి్టఫికెట్లతో ఎంపికలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. 

మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు నిర్వాకాలను ఎండగడుతూ నిర్వహించిన నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమైనట్లు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య తెలిపారు. శుక్రవారం గుంటూరులో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లాడ్జి సెంటర్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బైఠాయించి వినతి పత్రం సమర్పించారు.

 పూర్తిగా పారదర్శకత లోపించిన మెగా డీఎస్సీ తంతులో పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్‌ లిస్టు మాయం లాంటి అనేక అవకతవకలు జరిగాయని పానుగంటి చైతన్య ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ డబ్బులు వసూలు చేసి పోస్టులు అమ్ముకున్నారని మండిపడ్డారు. ధర్నాలో వైఎస్సార్‌ సీపీ జిల్లా, నగర అధ్యక్షులు అంబటి రాంబాబు, షేక్‌ నూరిఫాతిమా, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నేతలు పోతిన మహేష్, అంబటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ..
 పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సు«దీర్‌ భార్గవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 బాపట్లలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం చేపట్టిన నిరసన ర్యాలీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున, మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పార్టీ శ్రేణులతో కలసి పాల్గొన్నారు. విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని నినదించారు.

డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ప్రధాన ద్వారం ఎదుట నిర్వహించిన ధర్నాలో పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ సూచనల మేరకు శాప్‌ చైర్మన్‌ రవినాయుడు ఆధ్వర్యంలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ఆరోపించారు.

మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను నట్టేట ముంచేశారని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు శశిదీప్, నియోజవర్గ అధ్యక్షులు సద్ధాం ఆరోపించారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చిత్తూరు దర్గా సర్కిల్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులతో ధర్నా నిర్వహించి విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు వ్యతిరేకంగా నినదించారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న నారా లోకే‹శ్‌మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

  ఉమ్మడి విశాఖ జిల్లాల్లో వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వ­హించారు. డాబాగార్డెన్స్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ద్రోణంరాజు శ్రీవత్సవ్‌ నేతృత్వంలో దగా
డీఎస్సీపై నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యే వా­సుపల్లి గణే‹Ùకుమార్,
సమన్వయకర్తలు తిప్పల దేవాన్‌రెడ్డి, మొల్లి అప్పారావు పాల్గొన్నారు.

 మెగా డీఎస్సీ నిర్వహణలో అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం విగ్రహం నుంచి కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించింది. సకల శాఖా మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్‌ చేశారు.

 కాకినాడలో వైఎస్సార్‌సీపీ విద్యారి్థ, యువజన విభాగాల ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.

 డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు.
 ఒంగోలులో నిరసన ర్యాలీ, ధర్నా కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ,
ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహా్మనందరెడ్డి, ప్రచార కమిటీ రాష్ట్ర అధ్య­క్షుడు కాకుమాను రాజశేఖర్, మాజీ ఎమ్మె­ల్యే కసుకుర్తి ఆదెన్న తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌ భవనం నుంచి ర్యాలీ నిర్వహించారు.

 విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాల్లో ‘విద్యార్థి పోరు’ పేరుతో నిరసన ర్యాలీలు నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు.

 నెల్లూరు వీఆర్‌సీ సెంటర్‌లో శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును

 చంద్రబాబు సర్కారుకు డీఎస్సీపై శ్వేతపత్రం వి­డుదల చేసే ధైర్యముందా అని వైఎస్సార్‌సీపీ నే­తలు నిలదీశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్ర­హం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పార్టీ ఎన్టీఆ­ర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినా‹Ù, మా­జీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మె­ల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. డీఎ­స్సీ అభ్యర్థులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా­రు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు, లోకేశ్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినదించారు.

దగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నంద్యాల బొమ్మలసత్రం వద్ద అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.
 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేడ్కర్‌ సెంటర్, ఏలూరు పాత బస్టాండ్‌ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement