breaking news
massive earthquake
-
వెనెజువెలా విలయం.. 50 వేల మంది ఆచూకీ గల్లంతు!
వెనెజువెలాను వణికించిన జంట భూకంపాల విధ్వంసం రోజురోజుకూ భయానకంగా మారుతోంది. నాలుగు రోజులు గడిచినా శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మంది కోసం సహాయక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో వరుస ఆఫ్టర్‌షాక్‌లు(వరుస ప్రకంపనలు.. తాజాగా 4.9 తీవ్రత) నమోదవుతుండటంతో బాధితుల్లో భయం మరింత పెరుగుతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 920కి చేరగా, మరో 50 వేల మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని నివేదికలు చెబుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.బుధవారం సాయంత్రం కేవలం ఒక్క నిమిషం వ్యవధిలో.. రిక్టర్‌స్కేల్‌పై 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన రెండు భారీ భూకంపాలు ఉత్తర వెనెజువెలాను అతలాకుతలం చేశాయి. రాజధాని కారకాస్ సమీపంలోని తీరప్రాంత నగరం లా గ్వైరా అత్యంత తీవ్రంగా దెబ్బతింది. భారీ అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. అనేక ప్రాంతాల్లో శిథిలాల కిందే వందలాది మంది చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు.సహాయక చర్యలు మాత్రం ఆశించిన వేగంతో సాగడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల భారీ యంత్రాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు, వాలంటీర్లే చేతులతో శిథిలాలను తొలగిస్తూ తమ ఆత్మీయుల కోసం వెతుకుతున్నారు. ఐదు నెలల చిన్నారి గల్లంతైందంటూ ఓ తల్లి కన్నీరుమున్నీరవుతుండగా, ప్రభుత్వ సహాయం కనిపించడం లేదంటూ మరో బాధితురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.‼️🚨🆘😭😭😭 Estos verdaderos héroes de #Venezuela, están dando su vida por salvar otras vidas. Sin cascos, sin implementos, con las uñas, dando una palabra de aliento. Tanta valentía y bondad por parte de algunos, me quedo con eso. ¡Dios bendiga a Venezuela! Esto es durísimo. pic.twitter.com/s7hljQwmJZ— Rubén Valencia (@rubenvalencia22) June 27, 2026🇸🇻🙏🇻🇪 URGENTE: Rescatistas de El Salvador lograron rescatar con vida a Nayarit Colmenares, de 39 años, quien quedó atrapada bajo los escombros tras el terremoto que sacudió Venezuela. 🙏❤️ pic.twitter.com/5twmSRP86e— Alerta Mundial (@AlertaMundoNews) June 27, 2026అధికారికంగా.. ఇప్పటివరకు 920 మంది మృతి చెందగా, 3,360 మందికి పైగా గాయపడ్డారు. అయితే మరో 50 వేల మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని లోకల్ మీడియా కథనాలు, పలు నివేదికల ఆధారంగా ఐక్యరాజ్యసమితి చెప్తున్నాయి. శిథిలాల కింద ఇంకా 172 మంది చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే.. గణాంకాల విషయంలో ప్రభుత్వం దాపరికం ప్రదర్శిస్తుండడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.ప్రజల ఆగ్రహం తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్పై కూడా వ్యక్తమైంది. ఆమె బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు స్థానికులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. పరిస్థితుల దృష్ట్యా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి 8 గంటల తర్వాత ప్రవేశాన్ని అధికారులు తాత్కాలికంగా నిషేధించారు. అదే సమయంలో.. పాజిటివ్ వీడియోలను ప్రభుత్వం వైరల్ చేస్తోంది. సహాయక చర్యల్లో చిన్నారులను, వృద్ధులను, మూగజీవాలను రక్షించిన వీడియోలను రిలీజ్ చేస్తోంది. అయినప్పటికీ.. ప్రజాగ్రహం మాత్రం చల్లారడం లేదు.ఇదిలా ఉండగా.. ప్రపంచ దేశాలు వెనెజువెలాకు అండగా నిలుస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కనీసం 17 దేశాల నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. చిలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, మెక్సికో, కొలంబియా, ఎల్ సాల్వడార్ దేశాల బృందాలు ఇప్పటికే సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. అమెరికా కూడా 250 మందికిపైగా సిబ్బంది, ప్రత్యేక శునకాలతో కూడిన సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను పంపేందుకు సిద్ధమైంది.ఈ భూకంపాల్లో పలువురు విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా తొమ్మిది మంది పోర్చుగల్ పౌరులు, ఐదుగురు స్పెయిన్ పౌరులు, ఇద్దరు బ్రెజిలియన్లు, ఇద్దరు చైనా పౌరులు, ఒక ఇటలీ-వెనెజువెలా పౌరుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు వందలమంది విదేశీయుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.దశాబ్దకాలంగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న వెనెజువెలాలో.. ఆస్పత్రులు, ప్రభుత్వ సేవలు ఇప్పటికే బలహీనంగా ఉండటంతో సహాయక చర్యలు మరింత క్లిష్టంగా మారాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. భూకంపం తర్వాత 50 నుంచి 60 వేల మంది జాడ లేకపోయారని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తోంది. ఈ అత్యవసర పరిస్థితి మరింత పెద్ద మానవ విపత్తుగా మారకుండా అంతర్జాతీయ సమాజం తక్షణమే మరింత సహాయం అందించాలని పిలుపునిచ్చింది.వెనెజువెలా భూకంపంలో మృతులు, క్షతగాత్రులకు గౌరవసూచకంగా ఫిఫా ప్రపంచకప్-2026 ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు ముందు రెండు నిమిషాల మౌనం పాటించారు. దాదాపు వందేళ్ల తర్వాత వెనెజువెలాలో సంభవించిన అత్యంత తీవ్ర భూకంపాలు ఇవేనని భూకంప నిపుణులు చెబుతున్నారు. -
దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం
దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.5గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7:30 సమయంలో శక్తివంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని ప్రజలను అధికారులు సూచించారు.భూకంప కేంద్రం మిండనావో ద్వీపంలోని జోస్ అబాద్ సాంటోస్ పట్టణానికి నైరుతి దిశలో సుమారు 35 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 52.4 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యూఎస్జీఎస్ తెలిపింది. తొలుత దీని తీవ్రతను 6.7గా అంచనా వేసిన అధికారులు.. అనంతరం 6.5గా సవరించారు. ఈ భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదని స్థానిక సహాయ బృందాల అధికారులు తెలిపారు.సాంటా మారియా పట్టణానికి చెందిన రెస్క్యూ అధికారి జెర్సన్ తలాహిగ్ మాట్లాడుతూ.. భూకంపం బలంగానే సంభవించిందని.. అయితే అది కొద్ది సెకన్లపాటే కొనసాగింది. టేబుళ్లు, లైట్లు స్వల్పంగా ఊగడం కనిపించిందని చెప్పారు. కాగా, ఇదే ప్రాంతంలో ఈ నెల జూన్ 8న 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ భూకంపం వల్ల భవనాలు కూలిపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. -
వెనెజువెలా మహావిషాదం: శిథిలాల కిందే మరెందరో!
లాటిన్ అమెరికా దేశం వెనెజువెలాను జంట భూకంపాలు అతలాకుతలం చేశాయి. రాజధాని కారకాస్‌తో పాటు తీర ప్రాంతాల్లో ఎటు చూసినా.. భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ.. సహాయక చర్యలు సాగుతున్నా కొద్దీ.. మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. మృతుల సంఖ్య 589కు చేరుకోగా.. దాదాపు 4,300 మంది గాయపడ్డారు. వేల మంది జాడ ఇంకా తెలియరావడం లేదు. అలాగే.. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.బుధవారం సాయంత్రం సెకన్ల తేడాతో సంభవించిన రెండు భారీ భూకంపాల ధాటికి.. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా లా గువైరా, కారకాస్ పరిసర ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. సుమారు 250 భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వందల మంది ఆ శిథిలాల కిందే చిక్కుని ఉంటారని అధికారులు చెబుతుండగా.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. శిథిలాలను తొలగిస్తూ ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. భారీగా మృతులు?శిథిలాలను తొలగించే కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడుతుండటంతో వెనెజువెలాలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే వెనెజువెలా ప్రభుత్వం, అలాగే అక్కడి అధికార యంత్రాగం చెబుతున్న పరిస్థితులకు భిన్నంగా అక్కడి వాతావరణం కనిపిస్తోంది. మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై వాళ్ల ప్రకటనలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ భూకంపంలో 10 వేల మంది దాకా మరణించి ఉంటారని తొలుత అక్కడి మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. అయితే కాసేపటికే.. ఆ సంఖ్యను వందల్లోకి తీసుకొచ్చాయి. అయితే.. Se siguen desplomando edificios en la zona costera de Venezuela. Más de 250 estructuras reducidas a escombros, según las autoridades. No sólo la construcción, es también las características del terreno sobre el que se alzan https://t.co/AaUrq66RXl pic.twitter.com/6buAjkxWEH— Sandro Pozzi (@sandro_pozzi) June 25, 2026Te lo cuentan y no lo crees. Qué desesperación tan grande. Se salvaron por un pelo. #Venezuela #Terremoto 🚨‼️🆘 pic.twitter.com/7rNILpCl4r— Cristian Crespo F. 🇨🇺 (@cristiancrespoj) June 25, 2026😢Así vivieron esta pareja de ancianos el terremoto de #Venezuela Dos fuertes sismos sacudieron el miércoles el oeste de la capital de Venezuela, provocando el derrumbe de edificios en #Caracas, dejando personas atrapadas bajo los escombros, y llevaron a científicos a estimar… pic.twitter.com/aci0yLAxSe— Cristian Crespo F. 🇨🇺 (@cristiancrespoj) June 25, 2026అమెరికా భూగర్భ సర్వే (USGS) మాత్రం.. ఆ సంఖ్య లక్ష దాకా ఉండొచ్చని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి స్థాయి శిథిలాల తొలగింపనకు నాలుగైదు రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉండడంతో.. దాదాపు 11 వేల మందికి పైగా మిస్ అయినట్లు కథనాలు వెలువడుతుండడంతో.. మృతుల సంఖ్య బాగా పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తోంది. An earthquake that lasted only a few seconds caused devastation in Venezuela.Oh God,how terrifying the Day of Judgment will be. pic.twitter.com/mGzzQfMiG2— SilencedSirs◼️ (@SilentlySirs) June 25, 2026🇻🇪 Freaking devastating footage of Venezuela after it got absolutely crushed by twin massive earthquakes.The number keeps piling up, with at least 164 people dead, nearly 1,000 injured, and over 11,000 missing. More than 100 BUILDINGS COLLAPSED in La Guaira alone, with entire… https://t.co/1ZHLCVp4OX— Mario Nawfal (@MarioNawfal) June 25, 2026Moments after the first earthquake in Caracas you can see the total destruction of the surrounding area.Minutes later a massive 7.5 hit the same area finishing the job and leaving thousands trapped and unfortunately deceased.California Democrats would love for this to happen… https://t.co/kSC0ZfzxDE pic.twitter.com/l5QebHImRZ— B. Wilkins lll 🇺🇸 (@ScummyMummy511) June 25, 2026అధికారికంగా.. భూకంపాల కారణంగా ఇప్పటివరకు సుమారు 235 మంది మృతి చెందగా, 4,300 మందికి పైగా గాయపడ్డారని ఆరోగ్య మంత్రి కార్లోస్ అల్వరాడో తెలిపారు. వేలాది మంది గల్లంతయ్యారని, మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తీర ప్రాంతం, లా గ్వైరా వంటి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భవనాలు కూలిపోవడం, ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోవడం, పిల్లలు సహా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం వంటి దృశ్యాలు దేశాన్ని విషాదంలో ముంచేశాయి.ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బఈ భూకంపాల వల్ల వెనెజువెలాకు 7.5 బిలియన్ డాలర్లకుపైగా ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి. ఇది దేశ జీడీపీలో దాదాపు 7 శాతం వరకు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. చమురు, గ్యాస్ రంగానికి పెద్దగా నష్టం జరగకపోయినా.. విద్యుత్ అంతరాయాలు చమురు ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.సహాయానికి ముందుకొచ్చిన..వెనెజువెలాలో భారీ భూకంపం ధాటికి.. వేలాది మంది నిరాశ్రయులుగా మారగా, సహాయక శిబిరాల్లో వారికి ఆహారం, తాగునీరు, వైద్యసేవలు అందిస్తున్నారు. విపత్తు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పలు దేశాలు వెనెజువెలాకు అండగా నిలుస్తున్నాయి. అమెరికా 150 మిలియన్ డాలర్ల అత్యవసర సాయాన్ని ప్రకటించడంతో పాటు సహాయక బృందాలను పంపింది. చిలీ, స్విట్జర్లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, టర్కీ, బ్రిటన్ వంటి దేశాలు కూడా రెస్క్యూ బృందాలు, పరికరాలు, అత్యవసర సాయాన్ని అందిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన ప్రత్యేక రెస్క్యూ బృందాలు కూడా వెనెజువెలాకు చేరుకుంటున్నాయి. మరోవైపు స్టార్‌లింక్ సంస్థ నెల రోజుల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు అందిస్తామని ప్రకటించింది. అమెరికా భూగర్భ సర్వే (USGS) ప్రకారం.. వెనెజువెలా రాజధాని కారకాస్‌కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో తొలుత 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ప్రకంపనల నుంచి ప్రజలు తేరుకునేలోపే.. నిమిషం కూడా గడవకముందే(39 సెకన్లలోనే) 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం రావడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఇది 1900 తర్వాత వెనెజువెలాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా అధికారులు చెబుతున్నారు.గమనిక: పై వీడియోలు వెనెజువెలా భూకంపం పేరిట ఎక్స్ ఖాతాలో వైరల్ అవుతున్నవే! -
వెనెజువెలాలో భయానక దృశ్యాలు.. 164కు చేరిన మృతులు
వెనెజువెలాను భారీ భూకంపాలు అతలాకుతలం చేశాయి. రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాలు శిథిలాల కుప్పలుగా మారాయి. భవనాలు కూలిపోవడం, రోడ్లకు పగుళ్లు ఏర్పడటం, దుమ్ము మేఘాలతో నగరాలు కమ్ముకుపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. శిథిలాల మధ్య చిక్కుకున్నవారి కోసం సహాయక బృందాలు నిర్విరామంగా గాలింపు చర్యలు చేపట్టారు. సునామీ హెచ్చరికలు కొనసాగుతున్న వేళ.. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించారు. వెనెజువెలా భూకంపంలో పెరిగిన మృతుల సంఖ్యఇప్పటివరకూ 164 మంది మృతదేహాలు వెలికితీత.. 974 మందికి తీవ్ర గాయాలుభూకంప ధాటికి కుప్పకూలిన భవనాలుశిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నట్లు సమాచారంయుగాంతం వచ్చేసిందా?.. వెనెజువెలాలో భయానక దృశ్యాలు భారీ భూకంపాలతో వెనెజువెలా రాజధాని కారకాస్ సహా పలు ప్రాంతాలు అతలాకుతలం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో భవనాలు ఊగిపోతూ కూలిపోయిన దృశ్యాలు.ప్రకంపనలు మొదలవగానే ప్రజలు ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి రోడ్డుపైకి పరుగులు. విమానాశ్రయంలో టెర్మినల్ మొత్తం కంపిపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సీసీటీవీ ఫుటేజీల్లో కొన్ని సెకన్ల వ్యవధిలోనే వీధులు వణికిపోయిన దృశ్యాలు రికార్డు. రహదారుల్లో పగుళ్లు, వాహనాలు ఊగిపోవడం, భవనాల గోడలు కూలిపోవడం చోటుచేసుకున్నాయి. భూమి కంపించడంతో జంతువులు కూడా భయంతో పరుగులు తీసిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ బృందాలు రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగించాయి. పలు ప్రాంతాల్లో కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. యుగాంతాన్ని తలపించే ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. Imágenes de las labores de rescate tras el terremoto y réplicas en Venezuela. pic.twitter.com/bYZm9eqHdr— Eric Cartman (@Cartman_Freedom) June 25, 2026Back-to-back earthquakes measuring 7.1 and 7.5 struck Venezuela, causing building collapses in Caracas. The powerful tremors triggered tsunami alerts for parts of the Caribbean as residents evacuated damaged structures. #Venezuela #Earthquake #BreakingNews #WorldNews pic.twitter.com/TwRBDaDRgc— Daily Hindi Milap (@DailyHindiMilap) June 25, 2026Fishermen in the sea off the coast of La Guaira record the moments after the earthquake with dust covering large parts of the coast as a result of building collapses#Venezuela pic.twitter.com/D8KNwLkLDf— CNW (@ConflictsW) June 25, 2026ముందే గుర్తించిన గూగుల్! వెనెజువెలాలో ప్రకంపనలకు కొన్నిక్షణాల ముందు మోగిన ఆండ్రాయిడ్ ఫోన్లుగూగుల్ నుంచి భూకంపం రాబోతోందని అలర్ట్అప్రమత్తమై పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్న పలువురు!భూ ప్రకంపనలను ముందుగానే గుర్తించే ఆండ్రాయిడ్ ఫోన్లలోని యాక్సిలెరోమీటర్ సెన్సార్లుప్రకంపనలు నమోదైతే ఫోన్లు Google Android Earthquake Alerts Systemకు సమాచారంఒకే ప్రాంతంలోని అనేక ఫోన్ల నుంచి వచ్చిన డేటాను విశ్లేషించి భూకంపాన్ని నిర్దారించుకునే గూగుల్భూకంపంలో ముందుగా వచ్చే P-Wavesను ఫోన్లు గుర్తించడంతో.. విధ్వంసకర S-Waves రాకముందే హెచ్చరికలు పంపే అవకాశంప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లు ఈ భూకంప హెచ్చరిక వ్యవస్థలో భాగంభారత్లోనూ 2023 నుంచి ఈ సేవ అందుబాటులోకి Android 5, ఆ పైబడిన ఫోన్లలో ఈ అలర్ట్‌లు పనిచేస్తాయి.శిథిలాల దిబ్బగా నగరాలుభారీ భూకంపంతో నాశనమైన రాజధాని కారకస్!ఘోరంగా దెబ్బ తిన్న తీర ప్రాంతం లా గ్వైరాపలు చోట్ల కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనాలు రోడ్లు, హైవేల్లో భారీ పగుళ్లుమొత్తం.. దుమ్ము, శిథిలాలతో నిండిపోయిన నగరాలుక్షతగాత్రుల హాహాకారాలువెనెజువెలాలో కొనసాగుతున్న సహాయక చర్యలుశిథిలాల కింద చిక్కుకుని పలువురి ఆర్తనాదాలుతమ వారి జాడ కోసం వెతుక్కుంటున్న వేల మంది!ఇప్పటివరకు అధికారికంగా.. 32 మంది మృతి, 700 మంది గాయాలుఅమెరికా జియాలజికల్ సర్వే అంచనా ప్రకారం మరణాలు.. 10,000 నుంచి 1 లక్ష వరకు! హరర్ మూవీలా.. భారీ భూకంపంతో వెనెజువెలాకు కాళరాత్రి భవనాలు కూలిపోతుండటంతో రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలురాత్రంతా రోడ్ల మీదే గడిపిన పౌరులుపొగ, దుమ్ము వల్ల కనిపించని పరిస్థితికుటుంబ సభ్యులను శిథిలాల మధ్య వెతుక్కుంటున్న దృశ్యాలుకాళ్లు చేతులు తెగి పడి సాయం కోసం ఆర్తనాదాలు పెడుతున్న ప్రజలు!హరర్ మూవీని తలపిస్తున్న రాజధాని కాకారస్ నాన్ స్టాప్‌గా సహాయక చర్యలువెనెజువెలాలో ఎమర్జెన్సీ ప్రకటనభూకంపం తర్వాత కొనసాగుతున్న సహాయక చర్యలుశిథిలాల మధ్య చిక్కుకున్న రక్షించే ప్రయత్నంఎక్స్కవేటర్లు, రెస్క్యూ బృందాలు మోహరింపువిరామం లేకుండా కొనసాగుతున్న సహాయక చర్యలురెస్క్యూ బృందాలకు.. స్థానికులు, వలంటీర్లు సహాయం ఒక టీనేజ్ అమ్మాయిని సజీవంగా బయటకు తీయడంతో.. చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసిన ప్రజలుకారకాస్లో హృదయ విదారక దృశ్యాలుధనిక ప్రాంతమైన అల్టామిరాలో పెద్ద ఎత్తున నష్టంకూలిన అపార్ట్మెంట్ల ముందు కుటుంబ సభ్యుల వేచి చూడటంరెసిడెన్సియాస్ ఒబెలిస్కో భవనంలో చిక్కుకున్నవారి కోసం ఆందోళనమౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావంభూకంపం ధాటికి తీర నగరం లా గ్వైరాలో భారీ విధ్వంసందేశ ప్రధాన విమానాశ్రయం సిమోన్ బొలివార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మూసివేతసముద్రతీర హోటళ్లు, భవనాలు కూడా ధ్వంసంరాత్రంత అంధకారంలోనే ఉండిపోయిన పలు ప్రాంతాలుకమ్యూనికేషన్ సైతం కట్ప్రభుత్వ అత్యవసర చర్యలుదేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన తాత్కాలిక అధ్యక్షురాలువేల మంది మరణించి ఉంటారనే ఆందోళనఅన్ని ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ప్రకటనరెండు భారీ భూకంపాలు ఒక్కసారిగా..వెనెజువెలాను కుదిపేసిన రెండు భారీ భూకంపాలు7.2, 7.5 తీవ్రతతో.. వరుసగా 39 సెకన్లలో ప్రకంపనలుస్థానిక సమయం ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత ఘటన20కుపైగా ఆఫ్టర్‌షాక్స్ (4.9–6.4 తీవ్రత) నమోదుశతాబ్ధం తర్వాత వచ్చిన అతిపెద్ద భూకంపాల్లో ఒకటిగా పేర్కొంటున్న శాస్త్రవేత్తలు👉 : (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వందేళ్లకొకసారి సంభవించే అరుదైన భూకంపం!
వామ్మో.. భూమి రెండుగా చీలిపోయిందా? అన్నట్లు వెనెజువెలా వణికిపోయింది. జంట భూకంపాలు రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. భారీ భవనాలు ఊగిపోతూ కుప్పకూలిపోగా.. సుదూరాన ఉన్న కొలంబియా దేశ రాజధాని బోగొటాలో ఆ ప్రకంపనల ప్రభావం కనిపించింది. వేల నుంచి లక్ష వరకు మరణాలు ఉండొచ్చన్న అంచనాల మధ్య దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఇంతటి భారీ విధ్వంసానికి కారణమైన ఈ రెండు భూకంపాలు.. కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే ఎలా సంభవించాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.దక్షిణ అమెరికా దేశం వెనిజువెలా భూకంపాల దెబ్బకు అతలాకుతలమైంది. మొదట 7.1 తీవ్రతతో భూమి కంపించగా, ఆ భయం తగ్గకముందే కేవలం 39 సెకన్లలోనే 7.5 తీవ్రతతో రెండో భారీ ప్రకంపన అదే ప్రాంతాన్ని తాకింది. ఈ రెండు శక్తివంతమైన భూకంపాలు కలిసి దేశాన్ని కుదిపేసి, ప్రజలను వీధుల్లోకి పరుగులు తీయించాయి. సాధారణంగా ఒక భారీ భూకంపం సంభవించిన తర్వాత భూమి లోపల ఒత్తిడి కొంతవరకు విడుదలవుతుంది. ఆ తర్వాత చిన్నచిన్న ఆఫ్టర్‌షాక్‌లు మాత్రమే వస్తాయి. కానీ వెనెజువెలా ప్రకంపనల పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. రెండు పెద్ద భూకంపాలు వరుసగా రావడంతో విధ్వంసం రెట్టింపైంది. భవనాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను శాస్త్రవేత్తలు ‘‘సిస్మిక్ డబ్లెట్” (Earthquake Doublet)’’ గా పేర్కొన్నారు. అంటే ఒకే ప్రాంతంలో ఉన్న భూగర్భ చీలికలు లేదంటే ఫాల్ట్ లైన్లు చాలా తక్కువ వ్యవధిలో విడివిడిగా విరగడం. సాధారణంగా ఒక భూకంపం తర్వాత మరొకటి గంటలు లేదంటే రోజుల గ్యాప్‌తో వస్తాయి. కానీ ఇక్కడ కేవలం 39 సెకన్లలోనే రెండో భారీ భూకంపం రావడం ఈ ఘటనను అరుదైనదిగా మార్చింది.వెనెజువెలాలో మొదటి భూకంపం తర్వాత పక్కనున్న భూగర్భ చీలికలపై ఒత్తిడి పెరిగి, వెంటనే రెండో భారీ భూకంపం సంభవించి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే.. ఒత్తిడి తట్టుకోలేక సమీపంలోని మరో చీలిక కూడా కదలడంతో రెండో భూకంపం వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.వెనెజువెలా భౌగోళికంగా అత్యంత ప్రమాదకర భూకంప జోన్లో ఉంది. కరీబియన్ ప్లేట్ మరియు దక్షిణ అమెరికా ప్లేట్ కలిసే ప్రాంతంలో ఈ దేశం ఉంది. ఈ రెండు భూభాగాలు నిరంతరం ఒకదానికొకటి స్లైడ్ అవుతూ కదులుతుంటాయి. ఈ కదలికల వల్ల భూగర్భంలో భారీ ఒత్తిడి ఏర్పడి, అది ఒక్కసారిగా విడుదలైనప్పుడు శక్తివంతమైన భూకంపాలు సంభవిస్తాయి.బొకోనో, సాన్ సెబాస్టియన్, ఎల్ పిలార్, మోరోన్ వంటి అనేక ఫాల్ట్ జోన్లు పరస్పరం అనుసంధానమై ఉండటంతో, ఒక ప్రాంతంలో జరిగిన కదలిక మరో ప్రాంతాన్ని కూడా వెంటనే ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇదే ఈసారి రెండు భారీ ప్రకంపనలు వరుసగా రావడానికి కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ప్రస్తుతం వెనెజువెలా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సహాయక బృందాలు శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించేందుకు శ్రమిస్తున్నాయి. రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. ఈ డబ్లెట్ భూకంపాల తర్వాత ఆఫ్టర్‌షాక్‌ల ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చని యూఎస్జీఎస్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బలహీనమైన భవనాలు కూలిపోయే ప్రమాదం ఉండటంతో ప్రజలను బయటే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.సాధారణంగా వందేళ్లకు ఒకసారి లేదంటే అత్యంత అరుదుగా మాత్రమే ఇలాంటి తీవ్ర స్థాయి జంట భూకంపాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనల్లో సాధారణంగా మొదటి భూకంపం తర్వాత భూగర్భ ఒత్తిడి సమీప ఫాల్ట్‌లకు బదిలీ అవుతుంది. ఆ ఒత్తిడి వెంటనే విడుదలైతే రెండో పెద్ద భూకంపం సంభవిస్తుంది. ఇండోనేషియా, ఇరాన్, అమెరికాలోనూ ఎర్త్‌క్వేక్ డబ్లెట్ చోటు చేసుకున్నాయి. అయితే వెనిజువెలాలో ఈసారి కేవలం 39 సెకన్లలోనే రెండు భారీ ప్రకంపనలు రావడం భూమి లోపల ఉన్న ఒత్తిడి ఎంత అస్థిరంగా ఉందో చూపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇదీ చదవండి: జంట భూకంపాల దెబ్బ.. లక్ష మంది మృతి? -
జంట భూకంపాల దెబ్బ.. వెనెజువెలాలో భారీగా మృతులు?
దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. మృతులు, క్షతగాత్రుల సంఖ్య భారీగా ఉండేలా కనిపిస్తోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మృతుల సంఖ్య లక్ష దాకా ఉండొచ్చని అమెరికా భూకంప పరిశోధనా సంస్థ (USGS) హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది.స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం వెనెజువెలా పశ్చిమ ప్రాంతంలో మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని కారకాస్‌కు పశ్చిమంగా ఉన్న సాన్ ఫెలిపే సమీపంలో దీని కేంద్రం నమోదైంది. కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే యుమారే ప్రాంతం వద్ద మరో 7.5 తీవ్రతతో మరింత శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆ తర్వాత 20 సార్లు భూమి స్వల్పంగా కంపించింది. ఈ ధాటికి జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. క్షణాల్లోనే.. భవనాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం, విద్యుత్ సరఫరా అంతరాయం కలగడం తీవ్ర నష్టాన్ని కలిగించాయని తెలుస్తోంది.ఈ ఘటనను "సిస్మిక్ డబ్లెట్"(seismic doublet earthquake)గా యూఎస్జీఎస్ అభివర్ణించింది. అంటే.. చాలా తక్కువ వ్యవధిలో ఒకే ప్రాంతాన్ని రెండు భారీ భూకంపాలు తాకడం. ప్రాథమిక అంచనాల ప్రకారం భారీ ప్రాణనష్టం సంభవించి ఉండొచ్చని తెలుస్తోంది. మృతుల సంఖ్య 10 వేలుగా ఉండొచ్చని స్థానిక మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. కానీ, భూకంపం తీవ్రతను బట్టి ఆ సంఖ్య లక్ష వరకు చేరవచ్చని యూఎస్జీఎస్ అంచనా వేస్తోంది. అయితే అధికారికంగా ఇప్పటివరకు మృతులు, గాయపడిన వారి సంఖ్యను వెనెజువెలా ప్రభుత్వం ప్రకటించలేదు. Venezuela shaken by a pair 7.2 and 7.5 magnitude earthquakes. Devastation is quite high, media says. pic.twitter.com/sj7CzuwdBL— Straturka (@straturka) June 25, 2026పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రాష్ట్ర టెలివిజన్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని వెల్లడించారు.భూకంప ప్రభావంతో కారకాస్ అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు ప్రభుత్వ భవనాలు, నివాస సముదాయాలు, వాణిజ్య కేంద్రాలు దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యాయి. జూన్ 24న వెనెజువెలాకు జాతీయ సెలవు దినం. దీంతో ఇళ్లలోనే ఎక్కువ మంది ఉండిపోయారు. దీంతో మృతుల సంఖ్కయ ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. Tras los fuertes sismos registrados esta tarde en el país, hemos decretado Estado de Emergencia en todo el territorio nacional. Hacemos un llamado a todos los ciudadanos y ciudadanas a mantenerse atentos, en resguardo y con la mayor calma posible. pic.twitter.com/WFlj6rVs0U— Delcy Rodríguez (@delcyrodriguezv) June 25, 2026ఇక అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దెబ్బతిన్న భవనాలకు దూరంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరించింది. మరోవైపు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలె, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు మరియా ఎల్విరా సలజార్, వెనెజువెలా ప్రతిపక్ష నేతలు సహా పలువురు అంతర్జాతీయ నాయకులు వెనెజువెలా ప్రజలకు సంఘీభావం ప్రకటించారు.ప్రస్తుతం వెనెజువెలా వ్యాప్తంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిథిలాల తొలగింపు, దూర ప్రాంతాల నుంచి సమాచారం సేకరణ పూర్తయిన తర్వాతే అసలు నష్టం, ప్రాణనష్టం ఎంత జరిగిందన్న విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంది. భూకంపాల తీవ్రత దృష్ట్యా వెనెజువెలా ఇటీవల కాలంలో ఎదుర్కొన్న అతిపెద్ద ప్రకృతి విపత్తులలో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మెగా క్వేక్ ముప్పు.. సూర్యుడు ఉదయించే దేశంలో వణుకు!
జపాన్ ప్రజల ముఖాల్లో కొత్త ఏడాది సంబురం ఏ మూలన కనిపించడం లేదు. నాన్నా-పులి కథలో మాదిరి.. ఎప్పుడు ఏ ముప్పు ముంచెత్తుతుందా? అని వణికిపోతున్నారు. తాజాగా ఆవోమోరి తీరంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనికి కొనసాగింపుగా.. జపాన్ వాతావరణ సంస్థ (JMA) హొక్కైడో–సన్రికు తీరానికి అరుదైన మెగాక్వేక్(megaquake) అడ్వైజరీ జారీ చేసింది.జేఎంఏ లెక్క ప్రకారం.. మరో వారం రోజుల్లో అక్కడ మెగా భూకంపం సంభవించే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో సునామీ ముప్పు పొంచి ఉంటుంది. దాదాపు 98 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడతాయి. ఫలితంగా ఊహకు అందని విషాదం నెలకొనే అవకాశం లేకపోలేదు. భూకంపం సంభవించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని అక్కడి పరిశోధకులు చెబుతున్నారు. ఇదే అక్కడ ఆందోళనకు కారణమైంది. ప్రపంచ చరిత్రలోనే ఈ తరహా ప్రకటన జారీ చేయడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.0 కన్నా ఎక్కువగా నమోదైతే మెగా భూకంపంగా (Mega Earthquake) పరిగణిస్తారు. భూ ఫలకాల్లో కదలికలు అంటే.. ఒక టెక్టోనిక్ ప్లేట్ మరో దానిలో కూరుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర చీలిక ఏర్పడొచ్చు. అదే జరిగితే గనుక సముద్ర గర్భం కింద పరిస్థితులతో భారీ సునామీకి కారణమవుతుంది.అలా అప్రమత్తమై.. జపాన్ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన భూకంపం (Great East Japan Earthquake) 1923లో (కాంటో భూకంపం) సంభవించింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.0గా నమోదైంది. దాదాపు లక్ష నుంచి 1.40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆపై 2011లో వచ్చిన టోహోకు భూకంపం ఇటీవలి సంవత్సరాల్లో అతిపెద్దది. 9.0 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపం దాదాపు ఆరు నిమిషాల పాటు కొనసాగింది. 23 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన సునామీ అలలతో దాదాపు 20వేల మంది ప్రాణాల్ని బలిగొంది. ఆ విషాదం నుంచి జపాన్ కొత్త పాఠాలు నేర్చుకుంది. ప్రపంచంలోనే భూకంపాలను ఎదుర్కొనడం కోసం అత్యాధునికమైన ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. లక్షల్లో మరణాలు?.. జపాన్ వాతావరణ సంస్థ ఊహించిందే జరిగితే.. భారీగా ప్రాణ నష్టం ఉంటుంది. ఒకవేళ సముద్ర తీరంలో చీలిక సంభవిస్తే మాత్రం దాదాపు 2లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి.. ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. అంతా తూచేనా?జపాన్ ఉంది ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ (Pacific Ring of Fire) వెంట. ఇక్కడ టెక్టానిక్ ప్లేట్లలో కదలికలు ఎక్కువగా ఉండటంతో.. ప్రతి ఐదు నిమిషాలకు ఓసారి ఎక్కడో ఓ చోట ప్రకంపనలు నమోదవుతాయి. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది జులై 5వ తేదీన ఏదో జరగబోతోందంటూ ఓ ప్రచారం బాగా జరిగింది. రియో టుత్సుకి అనే కళాకారిణి 1999లో రాసిన ది ఫ్యూచర్ ఐ సా అనే బుక్ ఆధారంగా జపాన్ జనాలు వణికపోయారు. 2025 జూలైలో జపాన్‌లో 2011 తూర్పు జపాన్ సునామీ కంటే 3 రెట్లు పెద్ద విపత్తు వస్తుందని హడావిడి చేశారు. ఊళ్లు ఖాళీ చేసి తరలిపోయారు. ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లలో ఉండిపోయారు. ఈ భయాందోళనను ప్రపంచం ఆసక్తిగా తిలకించింది. చివరకు.. ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఆ సమయంలో సైస్మాలజిస్టులు.. వాతావరణ సంస్థ (JMA) హెచ్చరికలను మాత్రమే నమ్మాలని సూచించారు. ప్రస్తుతం చిషిమా ట్రెంచ్ (హొక్కైడో ద్వీపం), జపాన్ ట్రెంచ్ (సన్రికు) వెంట తీవ్ర భూకంపం వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ విభాగం అలర్ట్ జారీ చేసింది. ఇప్పుడు.. నిజంగానే అలాంటి హెచ్చరిక రావడంతో వణుకు మొదలైంది. లైట్ తీస్కోవద్దు!జపాన్ మెగా క్వేక్ అడ్వైజరీ హొక్కైడో నుంచి చిబా ప్రిఫెక్చర్ వరకు సుమారు 800 మైళ్ళ (1,300 కిలోమీటర్ల) పసిఫిక్ తీర ప్రాంతం మొత్తానికి జారీ చేయబడింది. మధ్యలో సన్రికు, ఆఓమోరి, మియాగి, ఫుకుషిమా వంటి తీర ప్రాంతాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మెగాక్వేక్ అడ్వైజరీని తేలికగా తీసుకోవద్దని.. అవసరమైతే ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభావం ఎంత.. జపాన్ తీరానికే మెగాక్వేక్ పరిమితం కావడంతో.. ఇతర దేశాలపై ప్రభావం చూపించే అవకాశం తక్కువ. ఒకవేళ భారీ భూకంపం, సునామీ తీవ్ర ప్రభావం చూపితే మాత్రం.. పసిఫిక్ మహాసముద్ర తీరంలోని దేశాలు ప్రభావితం కావొచ్చు. కాబట్టి.. భారతదేశానికి ఎలాంటి ముప్పు పొంచి లేదు. -
ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం...
-
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 69 మంది మృతి!
ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది(Philippines Earthquake). మంగళవారం రాత్రి మధ్య సెబు(Cebu Earthquake) ద్వీపం కేంద్రంగా .. రిక్టర్‌స్కేల్‌పై 6.9 తీవ్రతతో భారీగా భూమి కంపించింది. ఇప్పటిదాకా 69 మంది మరణించినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తుండగా.. ఆ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటిదాకా 150 మందికి గాయాలైనట్లు సమాచారం. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. మంగళవారం రాత్రి 9గం.59ని. సమయంలో భూమి కంపించింది. బోగో నగర ఈశాన్య దిశగా 17 కిలోమీటర్ల దూరంలో.. 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదు అయ్యింది. ఈ లోతు భూకంపాన్ని.. శాలో భూకంపం (shallow earthquake) గా పరిగణిస్తారు. ఈ తరహా భూకంపాలు ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. తాజా ప్రకంపనల ధాటికి ఇళ్లు, ఆఫీసులు కూలిపోగా.. రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బ తిన్నాయి. A powerful offshore #earthquake measuring 6.9 struck the central #Philippines late Tuesday, causing widespread panic as residents rushed into the streets, damaging a historic stone church, and triggering a local tsunami alert.#EarthquakeAlert pic.twitter.com/gTlq4soCw3— News9 (@News9Tweets) October 1, 2025భూకంపం ధాటికి రోడ్ల మీదకు పరుగులు తీసిన జనాలు.. రాత్రంతా రోడ్ల మీదే భయంతో జాగారం చేస్తూ ఉండిపోయారు. ప్రకంపనల ధాటికి ఇళ్ల గోడలు పగిలిపోయాయని, రోడ్లు చీలిపోయాయని, రాత్రంతా చీకట్లలోనే గడిపామని వాళ్లు అంటున్నారు. దాన్బంటాయన్ (Daanbantayan) సమీపంలో ఉన్న చారిత్రక రోమన్ కాథలిక్ చర్చ్ తీవ్రంగా దెబ్బతిందని అధికారులు ధృవీకరించారు. తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉండడంతో తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసి అధికారులు.. ముప్పు లేకపోవడంతో దానిని ఉపసంహరించుకున్నారు. ❗️ 🇵🇭 🔸️ Un puissant séisme de magnitude 6,9 a frappé le nord de l’île de #Cebu, aux #Philippines, provoquant des dégâts matériels, des coupures d’électricité et faisant au moins cinq morts selon les autorités.#PhilippinesEarthquake pic.twitter.com/KprgbRF8YO— Olivier Jorba (@OlivierJorba) October 1, 2025ప్రకంపనల ధాటికి బోగో చుట్టు పక్కల చాలా గ్రామాలు, పట్టణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి కొండ చరియలు ఓ ఊరిపై విరిగిపడ్డాయని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాల స్పష్టతపై మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ఒక్క బోగోలోనే 14 మంది మరణించినట్లు సెబూ గవర్నర్ పమేలా బారిక్యువాట్రో ప్రకటించారు. సాన్ రెమిగియో పట్టణంలో ఆరుగురు మృతి చెందినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.A total of 26 deaths and 147 injuries were reported as of 8 a.m. Wednesday after a magnitude-6.9 #quake hit the central #Philippines the previous night, according to the National Disaster Risk Reduction and Management Council. pic.twitter.com/TNaDDfVckH— CGTN (@CGTNOfficial) October 1, 2025భారీ ప్రకంపనల ధాటికి సముద్ర అలలు ఎగసిపడడంతో సునామీ హెచ్చరికలు(Philippines Tsunami Alert) జారీ చేశారు. సెబూతో పాటు లెయిట్, బిలిరన్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే ఆ తర్వాత ఆ సునామీ ముప్పు లేదని ధృవీకరించుకున్నాక ఆ హెచ్చరికను ఎత్తేసినట్లు ఫిలిప్పీన్స్ వోల్కనాలజీ అండ్ సెస్మాలజీ సంస్థ డైరెక్టర్ టెరెసిటో బాకోల్కోల్ ప్రకటించారు.ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉన్న ఈ దేశంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలు కావడంతో పాటు ప్రతీ ఏటా పదుల సంఖ్యలో తుపానులు విరుచుకుపడుతూ తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంటాయి. తాజాగా సెబు ద్వీపాన్నే తుపాను వణికించింది. దీని ధాటికి 26 మంది మరణించగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ విపత్తు నుంచి తేరుకునేలోపే ఇప్పుడు భూకంపం తీవ్ర నష్టం కలిగించింది. ఇదీ చదవండి: మళ్లీ ట్రంప్ టారిఫ్ బాంబు -
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
-
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైంది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు హవాయిలోని కొన్ని ప్రాంతాలకు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు అప్రమత్తం చేశారు.పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్కా నగరానికి తూర్పున 143 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి ముందు దాదాపు గంట సమయంలోనే ఈ ప్రాంతంలో ఐదు భూకంపాలు నమోదైనట్లు యూఎస్జీఎస్ తెలిపింది.ఈ భారీ భూకంపాలు.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:28 నుంచి 3:49 గంటల మధ్య సంభవించాయి. ఈ భూకంపాల కారణంగా కొన్ని భవనాలు దెబ్బతిన్నాయని, అయితే ప్రాణ నష్టం గురించి ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం వెల్లడికాలేదు. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. -
ఎందుకింత తీవ్ర భూకంపం.. అసలు కారణాలేంటి?
-
Magazine Story: రెండు భారీ భూకంపాలు 100 భవనాలు నేలమట్టం
-
మయన్మార్ లో భారీ భూకంపం
-
నేపాల్ ను వణికించిన భూకంపం
-
ములుగు కేంద్రంగా భారీ భూకంపం
-
ఇండోనేసియా భూకంపంలో ఏడుగురు మృతి
పసమన్ (ఇండోనేషియా): ఇండోనేసియా సుమత్రా దీవుల్ని శుక్రవారం భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం ధాటికి వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. 85 మంది గాయపడ్డారు. 5 వేల మందికి పైగా ప్రజలు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. మలేసియా, సింగపూర్‌లో భూ ప్రకంపనలు ప్రజల్ని భయపెట్టాయి. పశ్చిమ సుమ త్రా ప్రావిన్స్‌లోని బుకిటింగి పట్టణం భూకం ప కేంద్రంగా ఉంది. భూ ఉపరితలానికి 12 కిలోమీటర్ల దిగువన భూమి కంపించినట్టుగా అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. -
మెక్సికోలో భారీ భూకంపం
-
భారీ భూకంపం.. శవాల దిబ్బగా హైతీ
భారీ భూకంపంతో కరేబియన్ దేశం హైతీ ఘోరంగా వణికిపోయింది. శనివారం సంభవించిన భూకంపం దాటికి మృతుల సంఖ్య 724 కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎటుచూసినా భవనాలు కుప్పకూలి కనిపిపస్తుండడంతో క్షతగాత్రుల సంఖ్య ఊహించని రీతిలో ఉండేలా కనిపిస్తోంది. శనివారం హైతీలో భారీ భూకంపం చోటు చేసుకుంది. భూకంప తీవ్రత 7.2గా నమోదు అయినట్లు తెలుస్తోంది. వందల్లో భవనాలు కుప్పకూలగా.. శవాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా 304కు మృతదేహాలను సహాయక సిబ్బంది, స్థానికులు వెలికి తీశారు. రెండు వేల మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Viewer Discretion: First heart-stopping images of children, babies being rescued by caring Good Samaritans, stepping up to save their neighbor. 💔 #Haiti #earthquake pic.twitter.com/1pYiyZ6Bdx — Calvin Hughes (@CalvinWPLG) August 14, 2021 రాజధాని పోర్టౌ ప్రిన్స్‌కు పశ్చిమంగా 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదు అయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే హైతీ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సహాయక చర్యల్లోకి దిగింది. ప్రకృతి విలయంపై ప్రధాని ఏరియెల్ హెన్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెలపాటు దేశ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షంచాకే .. అంతర్జాతీయ సమాజ సాయం కోరతామని వెల్లడించారు. Self-organized community brigades in Okay, #Haiti continue to search for survivors in rubble in wake of 7.2 earthquake that struck the region earlier today. pic.twitter.com/i1M6nlUzr5 — HaitiInfoProj (@HaitiInfoProj) August 14, 2021 కాగా, 2010లో హైతీలో సంభవించిన భారీ భూకంపం కారణంగా.. మూడు లక్షల మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తాజా భూకంప పరిణామాల నేపథ్యంలో అమెరికా సహాయక విభాగం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా, మరింత సమాచారం అందాల్సి ఉంది. My biggest concern is not just for the country but the safety and well being of my momma and papa. Please keep Aiyti in your thoughts and prayers during these times 🇭🇹❤️💙 #Haiti #Tsunami #Ayiti pic.twitter.com/BCTweHve1h — Hustling & Healing (@HustlinNHealin) August 14, 2021 -
జపాన్‌లో భారీ భూకంపం
టోక్యో: జపాన్‌లో శనివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. తీరప్రాంతమైన ఫుకుషిమా, మియాగి పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైనట్లు తెలిపారు. జపాన్ సముద్రంలో 60 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ దేశ వాతావరణ ఏజన్సీ చెప్పింది. భారీ భూకంపమే అయినప్పటికీ సునామీ ఉండకపోవచ్చని స్పష్టం చేసింది. ఫుకుషిమాలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ప్రస్తుతానికి ఏం సమస్యా ఎదురు కాలేదని అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా ఎనిమిదిన్నర లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కో తెలిపింది. క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ప్రభుత్వం చెప్పింది. తక్షణ సాయం అందించేందుకు జపాన్ ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సమాచారం సేకరిస్తున్నారు. పలు వార్తాల చానెళ్లలో భూకంపం కారణంగా పెచ్చులూడిన ఇళ్లు కనిపించాయి. -
భారీ భూకంపం
మాముజు: భారీ భూకంపం ధాటికి ఇండోనేసియాలోని సులవేసి ద్వీపం వణికిపోయింది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత 6.2 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ప్రభావానికి పలు ఇళ్లు, భవనాలు, వంతెనలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అ భారీ భూకంపం కారణంగా 42 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. 600 మందికి పైగా గాయాలయ్యాయన్నారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న అధికారులు సేకరిస్తు న్నారు. భూకంపం ధాటికి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కూడా పాక్షికంగా ధ్వంసమైంది. శిథిలాల్లో చిక్కుకున్న పేషెంట్లు, సిబ్బందిని రక్షించేందుకు ఎన్డీఎంఏ ప్రయత్నిస్తోంది. భూకంప బాధితుల కోసం తాత్కాలిక నివాస, భోజన ఏర్పాట్లు చేశారు. ముముజులోని గవర్నర్ బంగళా కూడా ధ్వంసమైందని, శి«థిలాల్లో పలువురు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. యంత్ర సామగ్రి లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని ఎన్డీఎంఏ సిబ్బంది తెలిపారు. జకర్తా, మకస్సర్, పలు తదితర నగరాల నుంచి మాముజుకు సహాయ సిబ్బందిని తరలిస్తున్నామని ఎన్డీఎంఏ చీఫ్ బాగస్ పురుహితొ వెల్లడించారు. సులవేసి రాష్ట్రం మాముజు జిల్లా కేంద్రానికి దక్షిణంగా 36 కి.మీ.ల దూరంలో, 18 కి.మీ.ల లోతున భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియొలాజికల్ సర్వే ప్రకటించింది. సులవేసిలో 2018లో సంభవించిన భారీ భూకంపంలో 4 వేల మంది మరణించారు. -
ఇండోనేషియాలో భారీ భూకంపం
జకార్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో కుదిపేసిన ఈ భూకంపంలో కనీసం 34 మంది మరణించారు. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. 600 వందల మంది పైగా గాయపడ్డారు. భూకంప కేంద్రం 10 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. భూకంపం తీవ్రతకు ప్రజలు భయాందోళనకు గురై.. తమ ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. మాముజు నగరంలో ఆస్పత్రి భవనం కూలిపోవడంతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయని స్థానిక మీడియా వెల్లడించింది. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. చదవండి: టర్కీలో కరువు తాండవం.. 45 రోజుల్లో.. -
టర్కీలో భారీ భూకంపం
ఎలాజిగ్: తూర్పు టర్కీని భారీ భూకంపం వణికించింది. ఎలాజిగ్, మలాట్యా ప్రావిన్స్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం ధాటికి 22 మంది మృతిచెందగా.. 1,015 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. సివ్రిస్ నగరంలో చిన్న సరస్సు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. తొలుత సివ్రిస్లో భూమి కంపించిందని టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ వెల్లడించింది. దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంప తీవ్రతకు పలు ఇళ్లు నేలకూలాయి. ఘటనా స్థలాలకు చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఎలాజిగ్‌లో శిథిలాల్లో చిక్కుకున్న 39 మందిని సురక్షితంగా కాపాడామని టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్లు వెల్లడించారు. టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దాదాపు 2 వేల మంది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. భూకంప బాధితుల కోసం మలాట్యాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ట్వీట్ చేశారు. -
సజీవ సమాధుల్లోంచి చిన్నారుల ఘోష
బెర్లిన్: సుమారు 90 వేలకు పైగా పౌరులు. వారిలో 7 వేల మంది స్కూల్ చిన్నారులు. భారీ భూకంపం దాటికి సజీవ సమాధి అయ్యారు. అయితే నాణ్యత లేమి కారణంగానే స్కూల్ భవనాల కారణంగా ఆరోపణలు. పదేళ్లైనా మృతుల జాబితాను ప్రభుత్వం ఎందుకు విడుదల చేయటం లేదు? మరోవైపు తమ పిల్లలు బతికే ఉన్నారా? అన్న ఆశలో తల్లిదండ్రులు. వెరసి దశాబ్ద కాలంగా సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో... చైనాలోని సిచువాన్ ప్రొవిన్స్‌లో మే12, 2008న రిక్చర్ స్కేల్‌పై 7.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనాల దాటికి పలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోగా.. 70 వేల మంది మృతి చెందారు. 20 వేల మంది ఇప్పటిదాకా ఆచూకీ తెలియకుండా పోయారు. పెద్ద సంఖ్యలో స్కూల్ భవనాలు కుప్పకూలిపోవటంతో సుమారు 7 వేల మంది చిన్నారులు సజీవ సమాధి అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. శరీరాలు భవనాల కిందే ఛిద్రం అయిపోగా తల్లిదండ్రుల శోకం వర్ణనాతీతంగా మారింది. అయితే మృతుల సంఖ్య ఎక్కువే ఉండొచ్చు అని సామాజిక వేత్త ‘అయి వెయివెయి’ చెబుతున్నారు. భూకంపం తర్వాత సహయక చర్యల్లో పాల్గొన్న ఆయన.. నాటి పరిస్థితిపై ఓ నివేదిక రూపొందించారు. వెయివెయి నివేదిక ప్రకారం... ‘కనీస ప్రామాణికాలు లేకుండా భవనాలను నిర్మించారు. ఫలితం 7 వేల మంది చిన్నారులు బలయ్యారు. భద్రత ప్రమాణాలు లేని స్కూళ్లకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది? ఆ మరుసటి ఏడాది సంభవించిన భూకంపాల్లో మరో 5 వేల మంది విద్యార్థులు చనిపోయారని ప్రభుత్వం అంటోంది. మరి మృతుల పేర్ల జాబితాను పదేళ్లు గడిచినా ఎందుకు విడుదల చేయలేదు. ఈ విషయంలో ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి సూటిగా సమాధానం రావట్లేదు. చారిత్రక ఘటనకు సంబంధించిన నిజాలను ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వం బయటకు రానీవ్వట్లేదు. పోరాటంలో తల్లిదండ్రులు అలసిపోయారు. విచారణ కోసం కోర్టుకు వెళ్లిన సమయంలో నాపై పోలీసులు దాడి చేశారు. నా ప్రాణాలు పోయినా చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరే వరకు పోరాటం ఆపను’ అని వెయివెయి చెబుతున్నారు. పోలీసుల దాడిలో మెదడులో రక్తం గడ్డకట్టడంతో వెయివెయికి జర్మనీలో శస్త్రచికిత్స జరగ్గా.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. భూకంపం జరిగి పదేళ్లు పూర్తి కావటంతో ఓ ప్రముఖ మీడియా సంస్థ ఆయన్ని ఇంటర్వ్యూ చేయగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. భారీ కుంభ కోణం... కాగా, నాటి భూకంపం దాటికి 6.5 మిలియన్ భవనాలు కప్పకూలిపోయాయి. మరో 23 మిలియన్ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా భూకంపం అధికారిక విభాగం, జియాలజిస్టులు నాణ్యత లేని భవనాల మూలంగానే పెను నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఆ తర్వాత కొందరు ఇంజనీర్లు భవన నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగినట్లు తేలుస్తూ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. దీంతో భారీ కుంభకోణం చైనా ప్రభుత్వాన్ని కుదిపేసింది. అయితే అవినీతి ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం.. భారీ భూకంపం జోన్లో ఆయా భవనాలు ఉండటంతోనే కుప్పకూలిపోయానని నివేదికను వక్రీకరించింది. కానీ, సామాజిక వేత్త వెయి వెయి పూర్తి ఆధారాలతో ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం స్వతంత్ర్య దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే రోజులు గడుస్తున్నా ఆ తర్వాత అంశాన్ని పట్టించుకోలేదు. ఈ పరిణామాలతో వెయివెయి పోరాటాన్ని ఉదృతం చేయగా.. ఆయనపై దాడి చోటు చేసుకుంది. -
అర్ధరాత్రి భారీ భూకంపం
జకర్త : ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌గా పేరొందిన ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జావా తీర ప్రాంతంలో భూమి భారీగా ప్రకంపించింది. రిక్చర్ స్కేల్ పై దాని తీవ్రత 6.5గా ఉన్నట్లు నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. పంగందరన్, తసిక్‌మలయా, కియామిస్, బంజర్, గౌరత్, కెబుమెన్, బన్యుమస్ నగరాలు భూకంపం దాటికి వణికిపోయాయి. అర్ధరాత్రి ఘటన చోటుచేసుకోవటంతో ఇళ్లలోంచి ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. జావాకు పశ్చిమాన ఉన్న తసిక్‌మాల్యాకు నైరుతి ప్రాంతంలో భూమికి 92 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రం నమోదయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సుమారు నిమిషానికి పైగా భూమి కంపించగా.. కొన్ని ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. భూకంపం దాటికి ఇళ్లకు పగుళ్లు వచ్చేశాయ్. అలల తీవ్రతతో తీర ప్రాంత ఇళ్లలోకి నీళ్లు రావటంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసి.. కొన్ని గంటల తర్వాత ఉపసంహరించుకున్నారు. ఘటనలో 40 ఇళ్లులు కుప్పకూలిపోగా.. 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటిదాకా ఇద్దరు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ.. ఆ సంఖ్య భారీగానే ఉండొచ్చని తెలుస్తోంది. కుప్పకూలిన ఇంటిలో సహాయక చర్యల్లో భద్రతా సిబ్బంది భూకంపం అనంతరం బైకులపై సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ప్రజలు -
జపాన్‌లో భారీ భూకంపం.
-
ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం
మనీలా: ఫిలిప్పీన్స్ లో సంభవించిన భారీ భూకంపంలో 15 మంది మరణించగా 90 మందికి పైగా గాయాలపాలయ్యారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.5గా నమోదైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక సంభవించిన ఈ ప్రకంపనల కేంద్రం సురిగావ్ డెల్ నోర్టె ప్రావిన్సు రాజధానికి వాయవ్యంలో 14 కి.మీ దూరంలో, 11 కి.మీ.ల లోతులో కేంద్రీకృతమైంది. ఆ సమయంలో నిద్రిస్తున్న ప్రజలు భూకంపం ధాటికి ఇళ్లు వదిలి పరుగులుపెట్టారు. శిథిలాలు, ఇతర వస్తువులు మీద పడటంతో సురిగావ్ పట్టణంలో కనీసం 15 మంది చనిపోయి ఉంటారని ఆసుపత్రి వర్గాలను ఉటంకిస్తూ ప్రావిన్స్ విపత్తు నిర్వహణ అధికారి ఒకరు వెల్లడించారు. -
భారీ భూకంపం.. ముంచెత్తిన సునామి
-
భారీ భూకంపం.. ముంచెత్తిన సునామి
టోక్యో: తూర్పుఆసియాలోని ద్వీపదేశం జపాన్ను భారీ భూకంపం కుదిపేసింది. భూకంపానికి కొనసాగింపుగా సునామీ చెలరేగడంతో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6:38కి జపాన్ ఈశాన్య తీరంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే మీటరు ఎత్తున్న రాకాసి అలలు ఎగిసి ప్రఖ్యాత పుకుషిమా అణుశక్తి కేంద్రాన్ని ముంచెత్తాయి. పుకుషిమా నగరానికి 37 కిలోమీటర్ల దూరంలో 11.4 కిలోమీటర్ల లోతులో(ఫసిపిక్ సముద్రంలో) భూకంపకేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనలు వచ్చిన వెంటనే సునామీ హెచ్చరికలను జారీచేసిన ప్రభుత్వం.. అణుశక్తి కేంద్రంతోపాటు ఈశాన్య తీరంలోని గ్రామాలను త్వరితగతిన ఖాళీచేయించ ప్రయత్నం చేసింది. దేశ రాజధాని టోక్యోలో సైతం భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. నేటి సునామీతో నీటమునిగిన పుకుషిమా అణుశక్తి కేంద్రం.. 2011లోనూ తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. నాటి భూకంప విలయంలో 20 వేలమందికిపైగా మరణించారు. అణుకేంద్రాన్ని పునరుద్ధరించడానికి ఏళ్లు పట్టింది. కాగా, మంగళవారంనాటి భూకంపం, సునామీల కారణంగా ఎంత మంది చనిపోయారు, ఏ మేరకు నష్టం వాటిల్లిందో తెలియాల్సిఉంది. -
9.0 తీవ్రతతో భూకంపం రావొచ్చు!
ఢాకా: బంగ్లాదేశ్‌లో త్వరలో భారీ భూకంపానికి అవకాశం ఉందని, దీని ప్రభావం తూర్పు భారతంలోని పట్టణ ప్రాంతాలపై ఉంటుందని అధ్యయనంలో తేలింది. గంగ, బ్రహ్మపుత్ర నదుల పరిధిలో భూమి లోపలి రెండు ఫలకాలపై ఒత్తిడి పెరిగిపోవడమే దీనికి కారణమట. భూకంపం వస్తే తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.2 కన్నా ఎక్కువగా ఉండొచ్చని, 9.0కీ చేరొచ్చని.. 14 కోట్ల మందిపై ప్రభావం చూపుతుందని కొలంబియా యూనివర్సిటీకు చెందిన భూ భౌతిక శాస్త్రవేత్త మైఖెల్ స్టెక్లర్ తెలిపారు. భూమి కంపించడం వల్లే ఇంతమందిపై ప్రభావం పడుతుందని, సునామీలు వస్తే మరింత మందిపై ప్రభావం పడే అవకాశముందన్నారు. సముద్రంలో భూకంపనాలు సంభవించే అవకాశం లేకపోలేదన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు నేచుర్ జియోసైన్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం, సునామీ 2,30,000 మందిని బలితీసుకుంది. 2011లో జపాన్ లో వచ్చిన విలయంతో 20 వేల మందిపైగా మృతి చెందారు. గతేడాది నేపాల్ లో భూకంపం సంభవించడంతో 9 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిశోధన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. -
పాక్‌లో భారీ భూకంపం
♦ 89 మందికి గాయాలు ♦ భారత్‌లోనూ ప్రకంపనలు ♦ కశ్మీర్లో ఒకరి మృతి ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: హిందూకుష్ పర్వతాల్లో శనివారం భారీ భూకంపం సంభవించింది. అఫ్గానిస్తాన్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో వచ్చిన ఈ విపత్తు ధాటికి పాకి స్తాన్‌లో 89 మంది గాయపడ్డారు. ఒక్క పెషావర్‌లోనే 59 మందికి గాయాలయ్యారు. భారత్, తజికిస్తాన్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. జమ్మూకశ్మీర్‌లో ఒకరు చనిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని కేంద్రం కాబూల్‌కు 280 కి.మీ. దూరంలోని భూమికి 203 కి.మీ దిగువన నమోదైంది. కాబూల్, ఇస్లామాబాద్ తదితర చోట్ల భూకంప ప్రభావం కనిపించింది. హరియాణా, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. కశ్మీర్‌లోని మెంధార్‌లో భూకంపంలో ఒకరు మృతిచెందారు. జరీద్ అహ్మద్ అనే యువకుడు కుటుంబ సభ్యులను ఇంటి నుంచి బయటకు తీసుకొస్తూ కుప్పకూలి చనిపోయాడు. -
280కి చేరిన భూకంప మృతుల సంఖ్య
అఫ్ఘానిస్థాన్ కేంద్రంగా 7.5 తీవ్రతతో సంభవించిన పెను భూకంపం దాదాపు 280 మంది ప్రాణాలను బలిగొంది. వారిలో 12 మంది అఫ్ఘాన్ విద్యార్థినులు కూడా ఉన్నారు. స్కూలు భవనం కూలిపోతుండటంతో అంతా ఒక్కసారిగా బయటపడేందుకు ప్రయత్నించినప్పుడు జరిగిన తొక్కిసలాటలో వారు మరణించారు. 8 మంది పిల్లలతో సహా 214 మంది పాకిస్థాన్‌లో మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఉత్తర భారతంపై కూడా భూకంపం ప్రభావం తీవ్రంగానే కనిపించింది. ఈశాన్య అఫ్ఘానిస్థాన్‌లో దేశ రాజధాని కాబూల్‌కు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఇది భూమికి 213.5 కిలోమీటర్ల లోతున ఉందని అమెరికా జియలాజికల్ సర్వే తెలిపింది. 200 అక్టోబర్‌లో కూడా ఇదే ప్రాంతంలో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా అప్పట్లో దాదాపు 75 వేల మంది మరణించారు. 35 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. జరిగిన దారుణం గురించి తాను అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో మాట్లాడి, సానుభూతి తెలియజేసినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. ప్రాథమికంగా లభించిన నష్టం అంచనాలను ఆయన వివరించారని, వీలైనంత సాయం చేస్తామని తాను హామీ ఇచ్చానని ఆయన తెలిపారు. అఫ్ఘాన్, పాకిస్థాన్ దేశాలు రెండింటికీ తమ సాయం అందిస్తామన్నారు. అఫ్ఘాన్‌లో సుమారు 63 మంది మరణించారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తుంఖ్వా రాష్ట్రంలోను, ఫతా ప్రాంతంలోను దాదాపు 120 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇతర రాష్ట్రాల్లో మరికొంతమంది మరణించారు. -
ఉత్తర భారతానికి పెను భూకంప ముప్పు!
అంతర్జాతీయ శాస్త్రవేత్తల హెచ్చరిక లాస్ఏంజెలిస్: ఉత్తర భారతంతోపాటు పశ్చిమ నేపాల్‌కు భవిష్యత్తులో మరో పెను భూకంప ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఏప్రిల్‌లో నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపంలో భూమి పొరలో లోపం(ఫాల్ట్) వద్ద కొంత శక్తి మాత్రమే విడుదలైందని, ఆ ఫాల్ట్ వద్ద ప్రస్తుతం ఇంకా చాలా ఒత్తిడి కొనసాగుతోందని తెలిపారు. జీపీఎస్ కేంద్రాలు, కఠ్మాండులో నేల కదలికలను పసిగట్టే యాక్సిలరోమీటర్ రాడార్ చిత్రాల నుంచి అందిన సమాచారాన్ని అధ్యయనం చేయగా ఈ విషయం తేలిందని అమెరికాలోని కాల్టెక్, వర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు తెలిపారు. నేపాల్‌లో రిక్టర్‌స్కేలుపై 7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపంలో 9 వేల మంది మరణించడం తెలిసిందే. దీనిపై అధ్యయనం చేసిన వీరు.. పశ్చిమ నేపాల్‌తో పాటు ఉత్తర భారత్‌లో అనేక చోట్ల జనసమ్మర్ద ప్రాంతాలున్నాయని, గంగా మైదానంలో భూకంపమొస్తే పెను విలయం తప్పదని అన్నారు. యురేసియా భూఫలకంతో ఇండియన్ ప్లేట్ కలిసే చోట ఉన్న హిమాలయన్ ఫాల్ట్ లైన్ వద్దే ఇటీవలి భూకంపం సంభవించిందన్నారు. ఈ ఫాల్ట్ భాగం లాక్ అయిపోయిందని, భవిష్యత్తులో రెండు ప్లేట్ల మధ్య ఒత్తిడి వల్ల సర్దుబాటు జరిగి ఇంతకంటే పెను భూకంపానికి దారి తీయవచ్చన్నారు. -
‘ఆపరేషన్ మైత్రి’ ముమ్మరం
నేపాల్‌లో భారీస్థాయిలో భారత్ సహాయక చర్యలు న్యూఢిల్లీ: భారీ భూకంపతో కుదేలైన పొరుగు దేశం నేపాల్‌ను ఆదుకోవడానికి ‘ఆపరేషన్ మైత్రి’ పేరుతో చేపట్టిన సహాయక కార్యక్రమాలను భారత్ ముమ్మరం చేసింది. ఆదివారం రెండు డజన్లకు పైగా విమానాలు, చాపర్లను కఠ్మాండుకు పంపింది. వాటితో పాటు సుశిక్షితులైన 1,000 మంది సిబ్బందిని తరలించింది. అక్కడ చిక్కుకున్న పర్యాటకులను రోడ్డు మార్గం ద్వారా త్వరగా తరలించేందుకు అంబులెన్స్‌లు, బస్సులు ఏర్పాటు చేశారు. శనివారం నుంచి 1000 మందిని విమానాల ద్వారా తరలించారు. ఢిల్లీలో భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. సహాయచర్యల సమన్వయానికి హోం శాఖ ఆధ్వర్యంలో మంత్రుల బృందం పర్యటించనుందన్నారు. నేపాల్ నుంచి శనివారం 546, ఆదివారం 504 మందిని భారత్‌కు తీసుకొచ్చామని తెలిపారు. ప్రమాద ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులకు ప్రాధాన్యం ఇస్తూనే.. ఇతర దేశస్తులను కూడా మన బృందాలు రక్షిస్తున్నాయన్నారు. భూకంపం తర్వాత వచ్చే చిన్న ప్రకంపనల వల్ల కఠ్మాండు ఎయిర్‌పోర్టును చాలా సేపు మూసివేయడంతో సహాయక చర్యలకు అంతరాయం కలిగిందని చెప్పారు. పది టన్నుల దుప్పట్లు, 50 టన్నుల నీళ్లు, 22 టన్నుల ఆహార పదార్థాలు, 2 టన్నుల మందులు కఠ్మాండుకు పంపినట్లు వెల్లడించారు. ఆర్మీ, సివిల్ డాక్టర్లను, ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్సును తరలించామన్నారు. నేపాల్‌లో వర్షాలతో పాటు.. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, భారీగా హిమపాతానికి ఆస్కారం ఉందని ఐఎండీ డీజీ ఎల్ఎస్ రాథోర్ తెలిపారు. భూ అంతర్భాగంలోని ప్లేట్ల సర్దుబాట్ల వల్ల మరికొన్ని వారాలు, నెలలు లేదా ఏళ్ల పాటు భూకంపానంతర ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. శనివారం ప్రధాన భూకంపం అనంతరం 46 ఆఫ్టర్‌షాక్స్ వచ్చాయని తెలిపారు. వీటిలో చాలామటుకు రిక్టర్ స్కేల్‌పై 4 నుంచి 6గా నమోదయ్యాయని, వాటిల్లో ఒకటి 6.9గా, మరోటి 6.6గా స్కేల్‌పై నమోదైందని తెలిపారు. -
అమెరికాలో భారీ భూకంపం
శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆదివారం రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున వచ్చిన ఈ భూకంప కేంద్రం అమెరికన్ కాన్యోన్లో భూమికి 10.8 కి.మీ దిగువన నమోదైంది. నార్తర్న్ బే ఏరియాలో ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ 70 మంది గాయపడ్డారు. పలు భవనాలు కూలిపోయాయి. కొన్నిచోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయి. శాన్ ఫ్రాన్సిస్కో, డేవిస్లలో భూకంప ప్రభావం కనిపించింది. మరోపక్క.. ఐస్‌ల్యాండ్‌లోని బర్దార్బుంగ అగ్నిపర్వతం కింద రెండు భూకంపాలు వచ్చాయి. -
చైనాలో భారీ భూకంపం
175 మంది మృతి; 1,400 మందికి గాయాలు బీజింగ్: చైనాలో భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేలుపై 6.5 పాయింట్ల తీవ్రతతో నైరుతి చైనాలోని యునాన్ రాష్ట్రాన్ని కుదిపేసింది. లూడియన్ కౌంటీలో జూవోతాంగ్ నగరానికి 23 కి.మీ.ల దూరంలోని లాంగ్తౌషన్ పట్టణం కేంద్రంగా ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు(బీజింగ్ కాలమానం) సంభవించిన ఈ భారీ భూకంపంలో 175 మంది మరణించగా, దాదాపు 1,400 మంది గాయపడ్డారు. 181 మంది జాడ తెలియడం లేదు. భూకంప తీవ్రతకు 12 వేల గృహాలు కుప్పకూలిపోగా, 30 వేల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. విద్యుత్, టెలికం, రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. భూకంపం ధాటికి క్వివోజియా కౌంటీలో 30 మంది మరణించారు. లాంగ్తౌషన్ సహా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లాంగ్తౌషన్కు వెళ్లే మార్గంలో కొండచరియ విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం కలిగి, సహాయక చర్యలకు ఇబ్బంది కలిగింది. మరోవైపు జూవోతాంగ్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ వర్షాలు సహాయక చర్యలను ఆటంకపరిచే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూవోతాంగ్ నగరం భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతంలో ఉంది. ఇక్కడే రిక్టర్ స్కేల్‌పై 7.1 పాయింట్ల తీవ్రతతో 1974లో సంభవించిన భూకంపంలో 1,400 మంది చనిపోగా, 2012లో వచ్చిన మరో భూకంపంలో 80 మంది మరణించారు. కాగా, భారత్, నేపాల్ సరిహద్దుల్లోని టిబెట్ ప్రాంతంలోనూ ఆదివారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించింది. -
భూకంపం @ బీచువాన్...
2008, మే 12న చైనాలో భారీ భూకంపం వచ్చింది. బీచువాన్ పట్టణం గడగడలాడిపోయింది. దాదాపు 9 వేల మంది చనిపోయారు.. 80 శాతం భవనాలు నేలకూలాయి.. కొన్ని బాగా దెబ్బతిన్నాయి.. ఆరేళ్లు గడిచిపోయాయి. మీరిప్పుడు బీచువాన్‌కు వెళ్లిచూడండి.. కొన్ని నిమిషాల ముందే అక్కడ భూకంపం వచ్చిందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. మనం టైం మెషీన్ ఎక్కి.. 2008, మే 12వ తేదీకి వెళ్లిపోయిన ట్లు అనిపిస్తుంది. ఎందుకంటే.. నాటి భూకంపం అనంతరం భవనాలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో.. ఇప్పుడూ అలాగే ఉన్నాయి.. కాదు.. కాదు.. వాటిని అలాగే ఉంచేశారు. బీచువాన్ను అతి పెద్ద స్మారక ప్రదేశంగా మార్చేశారు. వేలాడుతున్న భవనాలు కింద పడి.. సందర్శకులకు దెబ్బలు తగలకుండా ఉండేందుకు సపోర్ట్ ఏర్పాటు చేశారు.. కూలిపోయిన భవనాలు.. వాటి కింద చిక్కుకున్న వాహనాలు ఇప్పటికీ అన్నీ అలాగే ఉన్నాయి.. అప్పట్లో భూకంపం వచ్చిన తర్వాత చాలా వరకూ భవనాలు కూలిపోవడం.. ఊరంతా రాళ్లు, రప్పలతో నిండిపోవడంతో ఈ పట్టణాన్ని పున ర్నిర్మించడం చాలా కష్టమని నిపుణులు అభిప్రాయానికొచ్చారు. దీంతో వాటిని అలాగే ఉంచేసి.. బహిరంగ ప్రదేశంలో ఉన్న అతి పెద్ద స్మారక ప్రదేశంగా దీన్ని తీర్చిదిద్దారు. ఇక్కడుండేవారంతా బీచువాన్‌కు 12 మైళ్ల దూరంలో నిర్మించిన కొత్త పట్టణానికి వలస పోయారు.


