ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం | Massive earthquake in the Philippines | Sakshi
Sakshi News home page

ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం

Feb 12 2017 1:59 AM | Updated on Sep 5 2017 3:28 AM

ఫిలిప్పీన్స్ లో సంభవించిన భారీ భూకంపంలో 15 మంది మరణించగా 90 మందికి పైగా గాయాలపాలయ్యారు.

మనీలా: ఫిలిప్పీన్స్ లో సంభవించిన భారీ భూకంపంలో 15 మంది మరణించగా 90 మందికి పైగా గాయాలపాలయ్యారు. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.5గా నమోదైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక సంభవించిన ఈ ప్రకంపనల కేంద్రం సురిగావ్‌ డెల్‌ నోర్టె ప్రావిన్సు రాజధానికి వాయవ్యంలో 14 కి.మీ దూరంలో, 11 కి.మీ.ల లోతులో కేంద్రీకృతమైంది.

ఆ సమయంలో నిద్రిస్తున్న ప్రజలు భూకంపం ధాటికి ఇళ్లు వదిలి పరుగులుపెట్టారు. శిథిలాలు, ఇతర వస్తువులు మీద పడటంతో సురిగావ్‌ పట్టణంలో కనీసం 15 మంది చనిపోయి ఉంటారని ఆసుపత్రి వర్గాలను ఉటంకిస్తూ ప్రావిన్స్  విపత్తు నిర్వహణ అధికారి ఒకరు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement