
అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్ విజయ కేతనం ఎగురవేసింది. భారత్‌కు చెందిన షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా, మొట్టమొదటి తల్లిగా చరిత్ర సృష్టించారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా ఆమె సుమారు 120 మందితో పోటీ పడి కిరీటాన్ని దక్కించుకున్నారు.
తొమ్మిదేళ్ల క్రితం సికందర్ సింగ్ అనే వ్యక్తితో పెళ్లి, ఒక కుమారుడు ఉన్న షెర్రీ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "ఈ విజయం హద్దులు దాటి కలలు కనే ప్రతి మహిళదీ. బలం, దయ, పట్టుదల మహిళ నిజమైన అందానికి నిదర్శనం అని అదే తాను ప్రపంచానికి చూపాలనుకున్నా." అంటూ భావోద్వేగంగా చెప్పారామె.
అంతేగాదు ప్రతి గృహిణి తన కుటుంబాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ.. తను కన్న ప్రతి కలను నిజం చేసుకోగల సత్తా ఆమెకు ఉందని సగర్వంగా చెప్పింది. పైగా తన విజయం ప్రతి మహిళను ప్రేరేపించి అడ్డంకులను చేధించి తన లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుందని పేర్కొంది. కాగా, చరిత్రాత్మకమైన ఈ విజయం భారత్‌ను గర్వపడేలా చేసిందని మిస్ యూనివర్స్ పోటీ నిర్వాహకులు ప్రశంసించారు. ఆమెకు ఇన్‌స్టాలో 2.5 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.
(చదవండి: Karwa Chauth: భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..)