వివిధ ఘటనల్లో 40 మంది మృతి
కూలిన సహాయక చర్యల హెలికాప్టర్
ఇళ్ల పైకప్పులపై చిక్కుకున్న ప్రజలు
వరద నీటిలో తేలియాడిన కార్లు
మనీలా: ఫిలిప్పీన్స్‌ను ‘కల్మెగి’తుపాను హడలె త్తిస్తోంది. దేశ మధ్య ప్రాంతంలో సెబు, ఈస్టర్న్ సమర్, గుయిమరస్, బొహొల్, పలవన్ ప్రావిన్స్ లపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. కనీసం 40 మంది చనిపోయినట్లు అధికారులు మంగళవారం సాయంత్రం తెలిపారు. సెబు ప్రావిన్స్‌లో అత్యధి కంగా మరణాలు సంభవించాయన్నారు. ప్రభావిత ప్రాంతాల నుంచి పూర్తి సమాచారం అందాల్సి ఉందన్నారు. వరద చుట్టుముట్టడంతో ఇళ్లపైకప్పుల పైకి జనం చేరి, అక్కడే చిక్కుబడి పోయారు. రక్షించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.
వరదల కారణంగా చెత్తాచెదారం రోడ్లపైకి భారీగా చేరడంతో ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితులున్నాయని అధికారులు అంటున్నారు. వరద ఉధృతి తగ్గేదాకా తామేమీ చేయలేకపో తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీళ్లలో కార్లు తేలియాడుతున్నాయన్నారు. గుయి మరస్ ప్రావిన్స్‌లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న భీకర గాలులతో వందలాదిగా ఇళ్లపై కప్పులు లేచిపోయాయని స్థానికులు తెలిపారు. ఈస్టర్న్ సమర్‌లోని హొమొన్‌హొన్‌లో 300 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రావిన్స్‌లో వరదలు సంభవించకున్నా, ఈదురుగాలులు మా త్రం జనాన్ని భయపెట్టాయి. మరో ఘటన, దక్షిణ ప్రాంత అగుసన్ డెల్ సుర్ ప్రావిన్స్‌లో మానవతా సాయం అందించేందుకు బయలుదేరిన సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది.
అందులో ఐదుగురు మిలిటరీ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తు న్నామని అధికారులు చెప్పారు. అందులోని వారి క్షేమ సమాచారం తెలియాల్సి ఉంది. కల్మెగి నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సుమారు 4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సముద్రంలో అలలు మూడు మీటర్ల వరకు ఎగసిపడవచ్చని, అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చ రించింది. ఫెర్రీలను నిలిపివేయడంతో దీవుల మధ్య రాకపోకలు సాగించే 3,500 మంది ప్రయా ణికులు వంద పోర్టుల్లో ఎక్కడివారక్కడే నిలిచిపో యారు. 186 దేశీయ విమానసర్వీసులను అధికా రులు రద్దు చేశారు. దక్షిణ చైనా సముద్ర తీర దేశం ఫిలిప్పీన్స్‌లో ఏటా 20 వరకు తుపాన్లు సంభవిస్తుంటాయి. ఇవికాకుండా భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం సర్వసాధారణం.


