కవలలకు జన్మనిచ్చి..పురిటిలోనే తల్లి, శిశువు మృతి
ఉట్నూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఉట్నూర్ రూరల్: రోడ్డు సౌకర్యం లేక, ఫోన్ సిగ్నల్స్ రాక ఓ గర్భిణి నరకయాతన అనుభవించింది. ప్రసవంకోసం ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా వాహనం సహకరించకపోవడంతో అతికష్టంగా తిరిగి గ్రామానికి చేరుకుని కవలలకు జన్మనిచి్చంది. అయితే పుట్టిన శిశువు తో ఆమె కూడా ప్రాణాలు వదిలింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉ ట్నూర్ మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది.
కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కన్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధి రాజులమడుగు గ్రామానికి చెందిన గిరిజన మహిళ జంగుబాయి (37)కి సోమవారం ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. రోడ్డు సౌకర్యం, మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆటోలో ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో ఆటో చెడిపోయింది.
తిరిగి ఆ మహిళను గ్రామానికి తరలించారు. అప్పటికే నొప్పులు ఎక్కువై ఇద్దరు మగ శిశువులకు జన్మనిచి్చంది. ప్రసవ సమయంలో ఒక శిశువు ప్రాణాలతో ఉండగా మరో శిశువుతో పాటు తల్లి అస్వస్థతకు గురై మృతి చెందింది. ఘటనపై విచారణ జరిపిస్తామని అదనపు డీఎంహెచ్‌వో మనోహర్ తెలిపారు.


