సాక్షి, సిద్ధిపేట: చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లిలో విషాదం జరిగింది. చెక్ డ్యామ్‌లో పడి ముగ్గురు మృతి చెందారు. చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడ్డారు. మృతుల్లో తల్లీ కొడుకులు ఉన్నారు. కుమారులను కాపాడే ప్రయత్నంలో తల్లి మృతి చెందింది. బతుకు దెరువు కోసం బీహార్ నుంచి ఐదు రోజుల కిందటే కస్తూరిపల్లికి రెండు కుటుంబాలు వచ్చాయి. మృతి చెందిన వారంతా వలస కూలీలు. కూలీల మృతిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


